నయన్ సరోగసీ వివాదం

By KTV Telugu On 27 October, 2022
image

లేడీ సూపర్ స్టార్ కు క్లీన్ చిట్…. ఆరేళ్ల క్రితమే నయన్,విఘ్నేశ్ వివాహం

నయనతార, విఘ్నేష్ శివన్ ఇటీవలే పేరేంట్ గా ప్రమోషన్ పొందామని చెప్పి అందర్నీ ఆశ్చర్యపరిచారు.
సరోగసీ విధానం ద్వారా వీరిద్దరు మగ కవల పిల్లలకు జన్మనిచ్చారు. దాంతో నయన్, విఘ్నేశ్ సరోగసీ వ్యవహారం చట్టబద్ధంగా జరిగిందా లేదా అనే దానిపై తమిళనాడు ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. విచారణకు నలుగు సభ్యుల ప్యానెల్ ను సైతం ఏర్పాటు చేసింది. నివేదిక సిద్ధం చేసిన ప్యానల్ సభ్యులు ఈ రోజు ఆరోగ్య శాఖకు నివేదిక సమర్పించారు. నయన్ , విఘ్నేష్ సరోగతీ విధి విధానాలు,మార్గదర్శకాలను ఫాలో అయినట్లు నివేదికలో తెలిపారు. వీరిద్దరు మార్చి 11, 2016లోనే రిజిస్టార్ మ్యారేజ్ చేసుకున్నట్లు పెళ్లి చేసుకున్నారని, చెన్నై సమీపంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో సరగోసీ ప్రక్రియ జరిగిందని, సరోగసీ చట్టాన్ని వీరు ఎక్కడా అధిగమించలేదని నివేదికలో తేలింది. సరోగసీ పద్ధతిలో అమ్మా నాన్నలుగా ప్రమోషన్ పొందిన వీరిద్దరు సోషల్ మీడియా వేదికగా తమ ఆనందాన్ని అభిమానులతో పంచుకున్నారు.