బీహార్ లో బీజేపీని వదిలి ఆర్డేడీతో జట్టు కట్టిన నితీశ్ కుమార్ అసలు వ్యూహం ఏంటి ? మోడీని, బీజేపీని అడ్డుకునేందుకు వ్యూహం సిద్ధం చేశారా ? బీహార్ మొదలైన కొత్త ఈక్వేషన్ హిందీ రాష్ట్రాల్ని ఎలా మార్చే అవకాశం ఉంది ? మిగతా రాష్ట్రాలపై ఎంత వరకూ ప్రభావం చూపిస్తుంది ? తెలుగు రాష్ట్రాల పైన అందులోనూ ఢిల్లీలో ప్రభావం చూపాలని భావిస్తున్న కేసీఆర్ పైన, అటు చంద్రబాబు నాయుడి మీద నితీశ్ ప్లాన్ ప్రభావం ఎలా ఉండే అవకాశం ఉందో… కే టీవీ అనాలిసిస్ లో చూద్దాం !
నితీశ్ కుమార్ బీజేపీని వదిలి ఆర్డేజీ కాంగ్రెస్ తో కలవడానికి కేవలం బీహార్ మాత్రమే కారణం కాదు. బీజేపీని అడ్డుకోవాలన్నది అసలు ఎత్తుగడ. బీహార్ తోపాటు చుట్టపక్కల ఆరు రాష్ట్రాలు అసలు టార్గెట్. ఎలాగో చూద్దాం. ఆర్జేడీ కూటమి లోక్ సభ ఎన్నికల్లో ఫెయిల్ అయినా… తర్వాత ఏడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో దాదాపు గెలిచినంత పని చేసింది. ఇప్పుడు ఆర్జేడీ జేడీయూ కూటమి బలం 162 సీట్లు. ఈ లెక్కన 30కిపైగా లోక్ సభ సీట్లు సాధించాలన్నది నితీశ్ అండ్ కో ప్లాన్.
బెంగాల్లో బీజేపీ 18 సీట్లు సాధించడం నిజంగా రికార్డ్. ఈసారి బీజేపీని అడ్డుకునేందుకు ప్రత్యేక వ్యూహం ఉండాలని, ప్రాంతీయ పార్టీలను ఏకం చేస్తూ నితీశ్ నాయకత్వంలో కొత్త యుద్ధం చేయాలన్నది ప్రాంతీయ పార్టీల ప్లాన్ గా కనిపిస్తోంది.
ఉత్తర ప్రదేశ్ బీజేపీ అధికారానికి ఆయువు పట్టు. 62 సీట్లు బీజేపీ గెలిచింది యూపీలో. నాలుగు నెలల కిందట అసెంబ్లీ ఎన్నికల్లో ఫలితాలను బట్టీ చూస్తే ఈసారి బీజేపీ సీట్లకు భారీగా కోతపడే అవకాశం ఉంది. సమాజ్ వాదీ పార్టీ కనీసం 30సీట్లకు పెరిగినా బీజేపీకి భారీ షాక్ ఖాయం. అసెంబ్లీలో సమాజ్ వాదీకి దాదాపు 130 సీట్లున్నాయ్ ఈ లెక్క. 30 సీట్లలో గెలుపు కష్టం కాదనేది అంచనా.
ఈ ఆరు రాష్ట్రాల్లో 253 లోక్ సభ సీట్లు ఉన్నాయ్. ఈ రాష్ట్రాల్లో మూడొంతుల సీట్లు, అంటే 190 సీట్లు సాధించినా లెక్క మారిపోతుంది ఢిల్లీలో ! పైగా ఈ రాష్ట్రాల్లో యూపీయే పార్టీలు ప్రబలంగా ఉన్నాయ్. కానీ నాయకత్వమే సమస్య. ఇప్పుడు అన్ని రాష్ట్రాల్ని కలిపి నడిపే నాయకుడు, నితీశ్ లాంటి లీడర్ ఉంటే ప్రభావం వేరుగా ఉంటుందని అంచనాలు ఉన్నాయ్. అందుకే ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నా మరో ఏడాది తిరిగే లోపు బీహార్ పగ్గాలు తేజస్వీకి అప్పగిస్తారనే అంచనాలు ఉన్నాయ్.
బెంగాల్ తో కలిపి హిందీ బెల్ట్ లో ఉన్న రాష్ట్రాలతోపాటు బీజేపీని అడ్డుకునే అవకాశం ఉన్న రాష్ట్రాలు ఇంకొన్ని ఉన్నాయ్. ఈ ఐదు రాష్ట్రాల్లో 129 సీట్లు ఉన్నాయ్. ఇందులో వందకిపైగా స్థానాలు యూపీయే పక్షాలు సాధించే అవకాశం ఉంటుంది. ఇదే జరిగితే మొత్తం ఢిల్లీ స్థాయిలో లెక్క మారిపోతుంది. నితీశ్ అసలు వ్యూహం ఇదే అంటున్నారు.
తన పార్టీ జేడీయూని మింగేసేందుకు బీజేపీ వేసిన ప్లాన్ ను తిప్పికొట్టడమే కాదు… మోడీని ఓడించడం నితీశ్ లక్ష్యంగా చెబుతున్నారు. ఇప్పటికైతే కనిపిస్తున్న లెక్క పక్కగా కనిపిస్తోంది. మరి రిజల్ట్ ఎలా ఉంటుందో చూడాలి.