ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఫుల్ హ్యాపీ

By KTV Telugu On 7 November, 2022
image

ఎట్టకేలకు కనిపించిన కొరటాల
జనవరిలో సెట్స్ పైకి వెళ్లనున్న సినిమా

RRR తర్వాత తారక్ నటించే కొత్త చిత్రంపై అభిమానులు ఎలాంటి బెంగ పెట్టుకోవాల్సిన పనిలేదు. కొరటాలతో చేయాల్సిన సినిమా ఆగిపోతుందనే భయం అనుమానం కూడా అక్కర్లేదు. ఎందుకంటే మొన్న ఆ మధ్య సినిమా ఆగిపోయిందని ప్రచారం సాగిన క్రమంలో సినిమా ఆగిపోలేదని ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటోందని యూనిట్ వెళ్లడించింది. ఇఫ్పుడు ఆ మాటను నిలబెట్టుకుంటూ ఎన్టీఆర్ 30 దర్శకుడు కొరటాల, ఆర్ట్ డైరెక్టర్ సాబు సిరిల్, డైరెక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫీ రత్నవేలు ముగ్గురూ కలసి ఉన్న ఫోటోస్ సోషల్ మీడియాలో చెక్కర్లు కొట్టడం ప్రారంభమైంది. జనవరి నుంచి రెగ్యూలర్ షూటింగ్ ప్రారంభించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నాడు కొరటాల. అనిరుథ్ సంగీత దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో రష్మిక లేదా జాన్వీ కపూర్ హీరోయిన్స్ గా నటించే అవకాశాలు ఉన్నాయట. ఆచార్య లాంటి ఘోరమైన, దారుమైన పరాజయాన్ని చూసిన తర్వాత కూడా కొరటాల కాస్త కోలుకోని తారక్ కోసం పవర్ ఫుల్ స్క్రిప్ట్ రెడీ చేస్తున్నాడు. రాజమౌళితో వర్క్ చేసిన హీరోలు తర్వాతి చిత్రంతో హిట్ కొట్టిన సందర్భాలు లేవు. ఈ సెంటిమెంట్ ను తాను బ్రేక్ చేస్తానంటున్నాడు కొరటాల శివ.