గోరంట్ల వ్యవహారంతో డిఫెన్స్ లో వైసీపీ

By KTV Telugu On 13 August, 2022
image

ఎంపీ గోరంట్ల మాధవ్ వీడియోను…పోలీసులు టీడీపీగా కుట్రగా తేల్చేశారు. ఆ వీడియో ఐటీడీపీలోనే పోస్ట్ చేశారంటూ…ఇష్యూను డైవర్ట్ చేసేశారు. అక్కడి ఆగని ఎస్పీ ఫక్కీరప్ప…ఒరిజినల్ వీడియో దొరికితే తప్పా…మార్ఫింగ్ చేశారో చెప్పలేమని చేతులు దులుపుకున్నారు. అటు మాధవ్ పై చర్యలు తీసుకుంటే…మిగిలిన వారి సంగతేంటన్న ప్రశ్నలు వస్తాయ్. అందుకే వైసీపీ నేతలు…ఓటుకు నోటు కేసు విచారణ గురించి ప్రస్తావించారు. అసలు విషయంపై చర్చ జరగకుండా డైవర్ట్ పాలిటిక్స్ చేస్తున్నారు.

ఏపీకి చెందిన హిందూపురం వైసిపి ఎంపీ న్యూడ్ వీడియో వ్యవహారం దుమారం రేపుతోంది. ఓ మహిళతో ఎంపీ గోరంట్ల మాధవ్ న్యూడ్ గా వీడియో కాల్ మాట్లాడుతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మహిళకు తన ప్రైవేట్ పార్ట్స్ చూపిస్తూ… ఎంపీ చాలా అసభ్యంగా ప్రవర్తించారు. గతంలో ఎస్ఐగా పని చేసిన సమయంలో…ఓ మహిళను రేప్ చేశారంటూ ఎంపీపై కేసు నమోదైంది. ఎంపీ మాధవ్ న్యూడ్ వీడియో కాల్ వ్యవహారంలో…టీడీపీ నేతలు వైసీపీని నేరుగా టార్గెట్ చేస్తున్నారు. పార్టీ నుంచి సస్పెండ్ చేయాలంటూ నిరసనలు, ఆందోళనలు చేస్తున్నారు. వివాదాస్పదంగా మారిన వీడియోపై స్పందించిన గోరంట్ల మాధవ్…రాజకీయంగా దెబ్బతీయడానికే దీన్ని సృష్టించారని విమర్శించారు. ఓ సామాజిక వర్గాన్ని టార్గెట్ చేస్తూ తీవ్ర విమర్శలు చేశారు. ఇది ముమ్మాటికీ టిడిపి చేసిన కుట్రేనని అన్నారు. తాను జిమ్ చేసే సమయంలో తీసిన వీడియోను మార్ఫింగ్ చేసి సోషల్ మీడియాలో పెట్టారని ఆరోపించారు.

ఎంపీ గోరంట్ల మాధవ్…వీడియోపై ఫోరెన్సిక్ రిపోర్టు రాకముందే…ఎస్పీ ఫకీరప్ప కొత్త పల్లవి అందుకున్నారు. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో ఒరిజినల్‌ కానందున…అది మార్ఫింగ్‌ చేశారా ? లేదా అనేది నిర్ధారించలేకపోతున్నట్లు వెల్లడించారు. పనిలో పనిగా ఆ వీడియోను తెలుగుదేశం పార్టీ కుట్ర అని అర్థం వచ్చేలా వ్యాఖ్యలు చేయడం హాట్ టాపిక్ గా మారింది. యూకేలో రిజిస్టర్‌ వొడా ఫోన్‌ నెంబర్‌తో వీడియో అప్‌లోడ్‌ అయిందని… ఐ-టీడీపీ వాట్సాప్‌ గ్రూప్‌లో మొదట ఈ వీడియోను పోస్టు చేశారంటూ ఎస్పీ మీడియాకు వెల్లడించారు. సోషల్‌ మీడియాలో ఈ వీడియోను చాలా సార్లు ఫార్వర్డ్‌, రీ పోస్టు చేయడంతో ఏది ఒరిజినలో…కనిపెట్టడం కష్టంగా మారిందంటూ…ఎంపీ మాధవ్ ను వెనుకేసుకొచ్చేలా కామెంట్ చేశారు. సోషల్‌ మీడియాలో పోస్టు చేసిన నెంబరు.. ఇంటర్నేషనల్‌ నెంబర్‌ కావడంతో దర్యాప్తు కొనసాగుతున్నట్లు చెప్పారు.

బీసీ సామాజిక వర్గానికి చెందిన ఎంపీ గోరంట్ల మాధవ్ వ్యవహారం వైసీపీకి పెద్ద తలనొప్పిగా మారింది. ఒకవేళ మాధవ్ పై చర్యలు తీసుకుంటే…మిగిలిన వారి సంగతేంటన్న ప్రశ్నలు వస్తాయ్. హిందూపురం పార్లమెంట్ నియోజకవర్గంలో…మాధవ్ సామాజిక వర్గానికి చెందిన కురుబ ఓటర్లు ఎక్కువ. అసెంబ్లీ నియోజకవర్గాల్లో వారి జనాభా ఎక్కువ. అందుకు మాధవ్ పై చర్యలు విషయంలో వైసీపీ వెనకడుగు వేస్తోంది. దీనికి తోడు మంత్రి అంబటి రాంబాబు అర గంట అన్న ఆడియో… మాజీ మంత్రి అవంతి శ్రీనివాస్ రావు…గంట వచ్చిపోతే బాగుంటుందన్న ఆడియోలు…సోషల్ మీడియాలో హల్ చల్ చేశాయ్. వారి విషయంలో సైలెంట్ గా ఉన్న పార్టీ…ఇప్పుడు మాధవ్ పై చర్యలు తీసుకుంటే…నిప్పుతో తల గొక్కున్నట్లే అన్న టాక్ నడుస్తోంది. అందుకే ఇష్యూను తెలుగుదేశం పార్టీ పైకి నెట్టేసి..టాపిక్ ను డైవర్ట్ చేశారన్న విమర్శలు వస్తున్నాయ్.