ఒకవైపు సుజిత్ తో డిస్కషన్స్, ఇంకోవైపు హరీష్ తో రీమేక్
పవర్ స్టార్ నిర్ణయాలు ఎవరూ ఊహించని విధంగా ఉంటాయి. గత కొద్ది రోజులుగా హరీష్ శంకర్ దర్శకత్వంలో పవన్ నటించడం ఖాయం అనే మాటలు వినిపిస్తున్నాయి. తమిళ సూపర్ హిట్ తేరీ తెలుగు రీమేక్ బాధ్యతలను హరీష్ కు పవన్ అప్పగించినట్లు ఫిల్మ్ నగర్ వర్గాలు చెప్పుకొస్తున్నాయి. ఈ రూమర్ ఇలా చెక్కర్లు కొడుతుండగానే ఇప్పుడు సాహో దర్శకుడు సుజిత్ తో పవన్ న్యూ మూవీ కమిట్ అయ్యాడడి బాగా ప్రచారం సాగుతోంది. సుజిత్ రాసుకొచ్చిన ఒక స్టోరీ లైన్ పవన్ కు బాగా నచ్చిందట. వెంటనే అతడిని హరి హర వీరమల్లు సెట్ కు పిలిపించి కలిసే భోజనం చేసారట. పవర్ స్టార్ తో సుజిత్ మీట్ కావడం ఇప్పుడు టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది. తేరీ రీమేక్ బాధ్యతలను పవన్ ఈ యంగ్ డైరెక్టర్ చేతుల్లో ఏమైనా పెట్టాడా అనే అనుమానాలు కూడా కలగుతున్నాయి. రన్ రాజా రన్ తో టాలెంటెడ్ డైరెక్టర్ గా గుర్తింపు తెచ్చుకున్నాడు సుజిత్. ఆ తర్వాత ప్రభాస్ తో సాహో తీసి చేతులు కాల్చుకున్నాడు. మధ్యలో గాడ్ ఫాదర్ డైరెక్ట్ చేసే అవకాశం అందుకున్నాడు కాని అఫీసియల్ డైరెక్టర్ గా మాత్రం సెట్ లోకి అడుగు పెట్టలేకపోయాడు. పవన్ తో మూవీలాక్ అయితే మాత్రం సుజిత్ కెరీర్ కు ఢోకా ఉండదు.