ప్రభాస్ ప్రేమలో పడ్డాడు

By KTV Telugu On 28 November, 2022
image

కన్ ఫామ్ చేసిన తోడేలు
సిగ్గుతో ఎరుపెక్కిన బాహుబలి ప్రేయసి బుగ్గలు

త్వరలోనే ప్రభాస్ పెళ్లి పీటలెక్కడం ఖాయంగా కనిపిస్తోంది. వన్ నేనొక్కడినే హీరోయిన్ కృతిసనన్ తో ఆదిపురుష్ షూటింగ్ సమయంలో ప్రేమలో పడ్డాడు ప్రభాస్. ఈ వార్త షూటింగ్ దశలోనే బయటికి వచ్చినప్పటికీ ఎవరూ పెద్దగా పట్టించుకోలేదు. కాని ఇటీవలి కాలంలో ప్రభాస్, కృతి లవ్ మ్యాటర్ హాట్ టాపిక్ గా మారింది. కొద్ది రోజులుగా ఈ ప్యాన్ ఇండియా స్టార్స్ లవ్ మ్యాటర్ బ్రేకింగ్ న్యూస్ గా మారింది. ఇప్పుడు తోడేలు సినిమా హీరో వరుణ్ ఇన్ డైరెక్ట్ గా కృతి మనసు దోచుకుంది బాహుబలి అంటూ ఓ శాటిలైట్ టీవీ ప్రమోషన్స్ లో వెళ్లడించాడు. ఈ సమయంలో కృతి మనసు ఇంకో వ్యక్తి దగ్గర ఉంది.

ఆయన హైదరాబాద్ కు చెందిన వ్యక్తి కాదు. ప్రస్తుతం దీపిక పదుకొణె తో కలసి సినిమా చేస్తున్నాడు అంటూ చెప్పుకొచ్చాడు. ఇది వరుణ్ ఇన్ డైరెక్ట్ గా చెప్పుకొచ్చినప్పటికీ ఆన్సర్ క్లియర్ గానే ఉంది. హైదరాబాద్ కు చెందిన స్టార్ హీరో అంటే ప్రభాస్. దీపిక తో కలసి నటిస్తున్నాడు అంటే నాగ్ అశ్విన్ తెరకెక్కిస్తున్న సినిమాలో దీపిక పదుకొణె హీరోయిన్. వరుణ్ ఇలా ఇన్ డైరెక్ట్ గా తన లవ్ స్టోరీ గురించి చెబుతుంటే అక్కడే ఉన్న కృతి బుగ్గలు ఎరుపెక్కాయి. కృతి గతంలో మహేష్ సరసన వన్ నేనొక్కిడినే లో నటించి మెప్పించింది. ఆ తర్వాత దోచెయ్ లో కనిపించింది. బాలీవుడ్ వెళ్లిస్టార్ హీరోయిన్ గా మారిపోయింది. ప్రభాస్, కృతి జోడి చాలా బాగుంటుంది. ఇదే జోడి రియల్ లైఫ్ లోనూ జోడిగా మారితే మేడ్ ఫర్ ఈచ్ అదర్ లాగే ఉంటారు.