ఇది షెడ్యూల్… డైరెక్టర్స్ ఫిక్స్ కావాల్సిందే..
సంక్రాంతికి రిలీజ్ కావాల్సిన ఆదిపురుష్, గ్రాఫిక్స్ పెండింగ్ వర్క్ అంటూ, వాయిదా పడింది. ఇప్పుడు ఈ చిత్రాన్ని మేలో విడుదల చేయబోతున్నారంటూ జోరుగా ప్రచారం జరుగుతోంది.. సంక్రాంతి సీజన్ లో అందరికంటే ముందు బెర్త్ ఖరారు చేసుకున్న చిత్రం ఆదిపురుష్. అదే విధంగా మిగితా సంక్రాంతి హీరోలకంటే ముందే, ప్రమోషన్ స్టార్ట్ చేసాడు ప్రభాస్. అయితే ఆదిపురుష్ టీజర్ రిలీజ్ తర్వాత, సిచ్వువేషన్ మారిపోయింది. పెద్ద ఎత్తున కాంట్రవర్సీ రాజేసింది.
అందుకే ఆదిపురుష్ యూనిట్ వెనక్కి తగ్గింది. సినిమాలోని కంటెంట్ పై ఆడియెన్స్ ఆగ్రహాన్ని గ్రహించి, చేసిన తప్పును సరిదిద్దుకునే ప్రయత్నం చేస్తోంది. అందులో భాగంగా సినిమాను మే నెలకు వాయిదా వేసింది. అయితే మేలో ఆదిపురుష్ టార్గెట్ ఫిక్స్ అయినా సరే, సెప్టెంబర్ లో మాత్రం సలార్ రావడం ఖాయం. ఎందుకంటే సెప్టెంబర్ లో సలార్ రాకపోతే, మళ్లీ ఈ రిలీజ్ డేట్ దొరకదు. ఆ పై సమ్మర్ కు అంటే 2024 సమ్మర్ లో ప్రభాస్ సూపర్ హీరోగా నటిస్తున్న ప్రాజెక్ట్ కె ను రిలీజ్ చేసేందుకు అశ్వినీదత్ ప్రయత్నిస్తున్నాడు. సో ఎట్టిపరిస్థితుల్లోనూ మేలో ఆదిపురుష్, సెప్టెంబర్ లో సలార్ రిలీజ్ కావాల్సిందే.