నిర్మాతల మండలికి నిర్ణయానికి వ్యతిరేకంగా వ్యాఖ్యలు
తెలుగులో డబ్బింగ్ సినిమాలకు పెరుగుతున్న మద్దతు
సంక్రాంతికి తెలుగులో రిలీజ్ అవుతున్న అనువాద చిత్రం వారసుడు. దిల్ రాజు ఈమూవీని నిర్మించడంతో
తెలుగులో పాటు తమిళంలో భారీ ఎత్తున విడుదల చేయాలి అనుకోవడంతో అసలు వివాదం మొదలైంది. తెలుగులో అది కూడా సంక్రాంతి, దసరా లాంటి పండగ సమయాల్లో తెలుగు చిత్రాల విడుదలకు మాత్రమే ప్రాధాన్యతను ఇవ్వాలి అని, నిర్మాతల మండలి లేఖ ఒకటి విడుదల చేసింది. గతంలో రజనీకాంత్ నటించిన పేట రిలీజ్ సమయంలో
ఇలాంటి అభిప్రాయాన్ని వ్యక్తం చేసిన దిల్ రాజు కామెంట్స్ ను కూడా లేఖలో పొందుపరిచింది. వారుసుడు విడుదలకు వ్యతిరేకంగా తెలుగు నిర్మాతల మండలి విషయాన్ని గ్రహించిన తమిళ సినీ సంఘాలు ఇప్పుడు తెలుగు సినిమా పై విమర్శలు గుప్పిస్తున్నాయి. విజయ్ సినిమాను అడ్డుకోవడం సరికాదని అంటున్నాయి. మరోవైపు డబ్బింగ్ సినిమాలను ఆపడం ఎవరి తరం కాదని నిర్మాతల మండలి నిర్ణయం తీసుకున్నట్లు నడవడం కుదిరే పని కాదని సాక్షాత్తు అల్లు అరవింద్ వ్యాఖ్యలు చేయడం తీవ్ర దూమారాన్ని రేపుతున్నాయి. తెలుగు నిర్మాతలు ఇఫ్పుడు డబ్బింగ్ సినిమాల మాయలో పడ్డారు. ప్యాన్ ఇండియా మోజులో పడిపోయారు. దాంతో వారసుడుకు సపోర్ట్ చేస్తూ మాట్లాడుతున్నారని
సంక్రాంతికి రిలీజ్ అవుతున్న వాల్తేరు వీరయ్య, వీర సింహారెడ్డి హీరోల అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.