పూరీ జగన్నాథ్‌ని వీడని ‘లైగర్’ పీడకల!
లైగర్ రిలీజ్‌కి ముందు పూరీ జగన్నాథ్ ఊహల్లో తేలిపోయాడు. పాన్ఇండియా సిన్మాలకి తానే రోల్మోడల్ని అవుతానని అనుకున్నాడు. హీరో రంకెలేస్తుంటే చార్మి గంతులేసింది. విపరీతమైన హైప్ క్రియేట్ చేసి అమ్ముకున్నా రిలీజ్ తర్వాత సిన్మా కాస్తా తుస్సుమనేసింది. ఆ షాక్‌నుంచి పూరీ తేరుకోకముందే బయ్యర్లనుంచి ఒత్తిడి మొదలైంది. నిండా మునిగిపోయాం మా పరిస్థితేంటని పూరీమీద ప్రెజర్ పెరిగింది.
సిన్మా అట్టర్‌ఫ్లాప్ అయితే బయ్యర్లకి ఎంతోకొంత ఇచ్చి ఓదార్చడం ఇండస్ట్రీలో ఎప్పటినుంచో ఉన్న ఆనవాయితే. సూపర్‌స్టార్ రజినీకాంత్‌లాంటి వాడికి కూడా అప్పుడప్పుడూ ఇలాంటివి తప్పడంలేదు. కానీ అసలే ఎదురుదెబ్బలు తినీతినీ పూరీ రాటుదేలాడు. అందుకే రివర్స్‌గేర్‌లో వెళ్తున్నాడు. తనకు, తన కుటుంబ సభ్యులకు ప్రాణహాని ఉందని, రక్షణ కల్పించాలని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. సిన్మా దెబ్బకి రోడ్డునపడ్డ లైగర్ డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లు పూరి జగన్నాథ్ ఆఫీస్ ముందు ధర్నా చేయాలనుకున్నారు. వరంగల్ శ్రీను, నైజాం ఎగ్జిబిటర్లు ఈ ఆలోచన చేశారంటున్నారు. అయితే దీనిమీద పూరి సీరియస్ అయినట్లు ఆయన ఆడియో ఒకటి వైరల్ అయింది.
ఎవరూ ఇంటిమీదికి రాకుండా, ఆఫీస్‌ముందు కూర్చోకుండా తనే లీకేజీ ఇచ్చాడు బతికిచెడ్డ డైరెక్టర్. తన పరువుతీయాలని చూస్తే రూపాయి కూడా ఇవ్వనని, ఆ ప్రయత్నం చేయనివాళ్లకే ఏదో ఒకటి చేస్తాననే మెసేజ్ పంపించాడు. అయినా డబ్బులు తిరిగి ఇవ్వాల్సిన అవసరం లేదు. లాభాలు వస్తే మీరెప్పుడైనా ఇచ్చారా అంటూ రివర్స్‌గేర్ వేశాడు. ఇప్పుడు మరో అడుగుముందుకేసి వరంగల్ శ్రీను, ఫైనాన్షియర్ శోభన్‌లతో తన కుటుంబానికి హాని ఉందని, ఫిర్యాదు చేశాడు. పాపం పూరి కిందామీదా పడుతున్నా ఆయన కో ప్రొడ్యూసర్ ఛార్మి నోరువిప్పటం లేదు. ఏం పూరీకేనా..పంజాబ్ పాపకి ఆమాత్రం తెలివితేటలు ఉండవా ఏంటి!