తెలంగాణ సీఎం కేసీఆర్ ప్రారంభించిన బిఆర్ఎస్ పార్టీపై వ్యంగాస్త్రాలు సంధించారు కాంగ్రెస్ ముఖ్య నేత రాహుల్ గాంధీ. జాతీయ పార్టీ కాకపోతే అంతర్జాతీయ పార్టీ స్థాపించి చైనాలో కూడా పోటీ చేయొచ్చని రాహుల్ గాంధీ వ్యాఖ్యానించారు.
తెలంగాణలో రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర ఆరో రోజు కొనసాగుతోంది. నేడు షాద్ నగర్ నుంచి కొత్తూరు వరకు 13 కిమీ మేర పాదయాత్ర జరిగింది. కొత్తూరు వద్ద విరామం ప్రకటించగా, రాహుల్ గాంధీ మీడియాతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ తో తమ పార్టీకి ఎటువంటి అవగాహన ఉండదన్నారు. అవినీతి సొమ్ముతోనే బీజేపీ, టీఆర్ఎస్ పార్టీలు.. ఎమ్మెల్యేలను కొనుగోలు చేస్తున్నాయంటూ రాహుల్ ఆరోపించారు. బీజేపీ, టీఆర్ఎస్ లు కలిసి ఒకరిద్దరికే కాంట్రాక్టర్లు కట్టబెడుతూ దోచుకుంటున్నాయని అన్నారు. ఫిట్నెస్ కోసం పాదయాత్ర చేయాడం లేదని, ఫిట్నెస్ కావలంటే జిమ్ చేస్తే సరిపోతుందన్నారు. దేశ మనుగడ కోసం భారత్ జోడో యాత్ర చేస్తున్నామన్నారు. దేశాన్ని విడగొట్టే వాళ్ళు, జోడించే వాళ్ల మధ్యే పోటీ జరుగుతోందన్ని, విపక్షాల మధ్య ఐక్యత రావాలని రాహుల్ పిలుపునిచ్చారు. టీఆర్ఎస్ తో కాంగ్రెస్ పార్టీ ఎటూవంటి పొత్తు లేదని, వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధిస్తుందని అన్నారు రాహుల్‌గాంధి. మోడీ ప్రభుత్వం కార్పొరేట్ వర్గాల కోసం మాత్రమే పని చేస్తుందని, దేశంలో హింసను ప్రోత్సహిస్తోందని, బీజేపీ అస్తవ్యస్థ విధానాలతో దేశంలో నిరుద్యోగం పెరిగిపోయిందన్నారు రాహుల్. మొత్తానికి తెలంగాణన ప్రజలకు, కాంగ్రెస్ శ్రేణులకు రాహుల్ గాంధీ మాటల ద్వారా టీఆర్ఎస్ తో కాంగ్రెస్ ఎట్టి పరిస్ధితిలోను పొత్తు ఉండబోతున్నట్లు క్లారిటీ వచ్చింది.