దేశంలో ప్రస్తుతం రెడ్ డైరీ ప్రకంపనలు సృష్టిస్తోంది. రెడ్ డైరీ విప్పితే కాంగ్రెస్ పని మటాష్ అంటోంది కేంద్రంలోని బిజెపి. రెడ్ డైరీపైనే కాంగ్రెస్-బిజెపిల మధ్య మాటల యుద్దం నడుస్తోంది. ప్రధాని నరేంద్ర మోదీ రెడ్ డైరీ ప్రస్తావన తీసుకురావడంతో కాంగ్రెస్ దానికి కౌంటర్ ఇచ్చింది. ప్రధాని నరేంద్ర మోదీకి ఎర్రగా ఉండే డైరీ కనపడుతోంది కానీ.. ఎర్రెర్రగా ఉండే టమోటాలు కానీ వంట గ్యాస్ సిలెండర్లుకానీ కనపడ్డం లేదు అంటూ సెటైర్లు వేసింది కాంగ్రెస్.
దేశ వ్యాప్తంగా మణిపూర్ అల్లర్ల పై చర్చ జరుగుతోంది. దానిపై ప్రభుత్వం వివరణ ఇవ్వాలంటూ విపక్షాలు పార్లమెంటు వేదికగా ప్రభుత్వాన్ని ఇరకాటంలోకి నెట్టేస్తున్నాయి. ఈ సమయంలోనే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్న రాజస్థాన్ అసెంబ్లీలో పాలక పక్ష మంత్రి రాజేంద్ర గుధా మణిపూర్ లో అల్లర్లు అకృత్యాల గురించి మనం అడుగుతున్నాం బానే ఉంది కానీ..రాజస్థాన్ లో మహిళలపై జరుగుతున్న అత్యాచారాలపైకూడా మనం మాట్లాడాలి అని సంచలన వ్యాఖ్యలు చేశారు.
శాంతి కుమార్ వ్యాఖ్యతో పార్లమెంటులో పాలక పక్షమైన బిజెపి ఎంపీలు మంత్రులు మణిపూర్ అల్లర్గ గురించి ప్రభుత్వం చర్చిస్తుంది వివరణ కూడా ఇస్తుంది కానీ దాంతో పాటు రాజస్థాన్, బిహార్ లలో జరుగుతోన్న అత్యాచారాల గురించి కూడా చర్చ జరగాల్సిందే అంటూ ఎదురు దాడి చేశారు. విపక్షాలు పార్లమెంటులో దూసుకుపోతోన్న తరుణంలో.. బిజెపి ఆత్మరక్షణలో ఉన్న సమయంలో రాజస్థాన్ మంత్రి చేసిన వ్యాఖ్యలతో కాంగ్రెస్ ప్రతిష్ఠ దెబ్బతింది. దీంతో రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ శాంతి కుమార్ ను మంత్రి వర్గం నుండి తప్పించారు.
తనను పదవి నుండి తప్పించడంతో శాంతి కుమార్ ముందుగా కంగు తిన్నారు. ఆ తర్వాత భావోద్వేగానికి గురయ్యారు. తనకు అన్యాయం జరిగిందని ఆక్రోశించారు. ఆ సమయంలోనే ఆయన రెడ్ డైరీ ప్రస్తావన ఒకటి తెచ్చారు. రాజస్థాన్ లో రక రకాల అవక తవకలకు సంబంధించిన సమాచారం అంతా తన వద్ద ఉన్న రెడ్ డైరీలో ఉందని రాజేంద్ర అసెంబ్లీ సాక్షిగా ఆరోపించారు. అందులో 500 కోట్ల రూపాయలకు సంబంధించిన కుంభకోణాల వివరాలు ఉన్నాయన్నారు. గతంలో ఓ కాంగ్రెస్ నేత ఇంట్లో ఈడీ సోదాలు జరుగుతోన్న సమయంలో ఈ రెడ్ డైరీని తీసి దాచేయాల్సిందిగా ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ తనను ఆదేశించారని రాజేంద్ర ఆరోపించారు.
రాజేంద్ర ఆరోపణతో రెడ్ డైరీ వార్తల్లో కెక్కింది. ఆ డైరీలో ఏముందో బయట పెట్టాలంటున్నారు బిజెపి నేతలు. రెడ్ డైరీలో కాంగ్రెస్ నేతల అక్రమాలు అవినీతి బాగోతాలు ఉన్నాయని పాలక పక్షం భగ్గుమంది రాజస్థాన్ లో ఓ ర్యాలీలో పాల్గొన్న ప్రధాని నరేంద్ర మోదీ సైతం రెడ్ డైరీ ప్రస్తావన తెచ్చారు. దీనికి రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ కూడా కౌంటర్ ఇచ్చారు. రెడ్ డైరీలో ఏదో ఉందని ఎవరో చెబితే ఆ మాటలు పట్టుకుని మోదీ నోటికొచ్చింది మాట్లాడుతున్నారు. ఆ డైరీలో ఏముందో కేంద్ర దర్యాప్తు సంస్థల చేత విచారణ జరిపించి నిజాలు బయట పెట్టండి అని డిమాండ్ చేశారు గెహ్లాట్.
మరిన్ని వార్తలకు ఎక్కడ క్లిక్ చేయండి
మరిన్ని వీడియోలకు ఎక్కడ క్లిక్ చేయండి …..