చక్రవర్తికి పిలిచి మరీ అవకాశం?
జైలర్ పూర్తైన వెంటనే షూటింగ్ స్టార్ట్
సూపర్ స్టార్ రజనీకాంత్ మరో రెండు కొత్త సినిమాలకు సంబంధించిన దర్శకులను ఖరారు చేసినట్లు తెలుస్తోంది.
పెద్దన్న తర్వాత ప్రస్తుతం నెల్సన్ దర్శకత్వంలో జైలర్ అనే సినిమా షూటింగ్ లో పాల్గొంటున్నాడు సూపర్ స్టార్.
ఈ మూవీలో రమ్యకృష్ణ కీలకమైన పాత్రలో నటిస్తోంది. నెక్ట్స్ ఇయర్ ఆడియెన్స్ ముందుకు రానుంది. ఈ మధ్య కాలంలో వరుసగా యువ దర్శకులకు అవకాశం ఇస్తూ వస్తున్నాడు రజనీకాంత్. అందులో భాగంగానే ఇప్పుడు డాన్ డైరెక్టర్ శిబి చక్రవర్తితో కొత్త సినిమా చేయనున్నాడు. త్వరలోనే ఇందుకు సంబంధించిన అఫీసియల్ కన్ ఫర్ మేషన్ రానుంది. శిబి చక్రవర్తి ఈ ఏడాది శివకార్తికేయన తో తీసిన డాన్ అనే సినిమా 100 కోట్లు కొల్లగొట్టి బ్లాక్ బస్టర్ అయింది. తెలుగులో కూడా మంచి విజయాన్ని అందుకుంది. అందుకే శిబికి పిలిచి మరీ సినిమా అవకాశం ఇచ్చాడట తలైవా. రజనీకాంత్ తో 2.0 సినిమా తీసిన లైకా ప్రొడక్షన్స్ ఈ సినిమా భారీ బడ్జెట్ తో నిర్మించనుంది. ఇదే బ్యానర్ లో మరో మూవీ చేయాలనుకుంటున్నాడు రజనీకాంత్. ఆ సినిమా దర్శకుడు ఎవరూ అనేది ఇంకా క్లారిటీ రాలేదు. శిబితో సినిమా చేసే సమయంలో మరో దర్శకుడి గురించి రజనీకాంత్ లీక్ ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. కబాలి తర్వాత ఆ స్థాయిలో వసూళ్లను చూడలేదు రజనీకాంత్. పేట, కాలా, పెద్దన్న, దర్బార్ చిత్రాలు ఇలా వచ్చి అలా వెళ్లాయి. కాని రజనీకాంత్ ఇమేజ్ తగ్గట్లు వసూళ్లు రాలేదు. ఒక పైపు పాత ప్రత్యర్థి కమల్ విక్రమ్ తో బాక్సాఫీస్ రేస్ లో ముందుకు దూసుకొచ్చాడు. ఇంకో వైపు విజయ్, అజిత్ వరుస బ్లాక్ బస్టర్స్ అందుకుంటున్నారు. ఈ దశలో సూపర్ స్టార్ ఒక్కడే బ్లాక్ బస్టర్ బాకీ పడ్డాడు.