ఎవరికైనా డబ్బులు అవసరమైతే వంద నోటు కొట్టు అంటారు. ఆ వంద నోటుకున్న ప్రత్యేకత మాత్రం చాలా మందికి తెలీదు. ఆ నోటుకు ముందు వెనుక బొమ్మల ప్రత్యేకత ఏమిటో అర్థం కాదు… వంద నోటు వెనుకవైపు ఉన్న బావి బొమ్మ ప్రత్యేకత ఏమిటో తెలుసుకుందాం.
…
నోట్ల ముద్రణ ఒక నిరంతర ప్రక్రియ ప్రతీ పది పన్నెండు సంవత్సరాలకు రిజర్వ్ బ్యాంక్ కొత్త సిరీస్ నోట్లు విడుదలు చేస్తుంది. మహాత్మా గాంధీ న్యూ సిరీస్ లో భాగంగా 2016లో వంద రూపాయల నోటుకు రూపకల్పన జరిగింది. 2018 జూలైలో విడుదల చేసింది. చరిత్రలో నిలిచిపోయిన ఒక బావి… అంటే రాణి కీ వావ్.. ఈ నోట్లపై దర్శనమిచ్చింది. రాణి కీ వావ్ గుజరాత్లోని పటాన్ జిల్లాలో ఉంది.
…..
నిజానికి చాలా కాలం ఈ బావి గురించి ఎవరికీ తెలియదు. 1980లో పురావస్తు శాఖ తవ్వకాల సందర్భంగా ఈ బావి బయటపడింది. ప్రాచీన, మధ్య యుగాల్లో రాజులే ఆలయాలు, కట్టడాలని నిర్మించేవారు. ఇది మాత్రం రివర్స్. సోలంకీ వంశానికి చెందిన రాణి ఉదయమతి తన భర్తకు గుర్తుగా ఈ బావిని నిర్మించారు. మాములుగా దేశంలో ఉన్న చాలా నిర్మాణాలు రాజులు దేవుళ్ల కోసమో తమ రాణుల కోసమో కట్టించారు… కానీ దీన్ని మాత్రం సోలంకి వంశానికి చెందిన రాణి ఉదయమతి ఈ బావిని నిర్మించారు. ఏడు అంతస్తుల్లో నిర్మించిన రాణి కీ వావ్ … సరస్వతి నది ఒడ్డున ఉంది. భూమి లోపలికి తవ్వుతూ నిర్మాణాలు చేయడం దీని ప్రత్యేకత.
….
రాణి కీ వావ్ పొడవు దాదాపు 213 అడుగులు. వెడల్పు 66 అడుగులు, లోతు 92 అడుగులు ఉంటుంది. బావి గోడలపై కథలు చెక్కిన 215 స్థంభాలు, దాదాపు 800 శిల్పాలు ఉన్నాయి. గోడల మీద దశావతారం కథలు, ఇతర పురాణాలు, వీర నారీమణుల చరిత్రలు చెక్కారు. లోపలికి దిగిన కొద్ది ఉష్ణోగ్రత తగ్గి చల్లగా ఉండటం ఈ బావిలో మరో అద్భుతం. 7 అంతస్తులు దిగిన తరువాతే బావి ఉంటుంది.
బావి చుట్టూ ఔషధ మొక్కలు పెంచేవారు. అందుకే ఈ బావిలో స్నానం చేస్తే రోగాలు తగ్గేవి. బావి దగ్గరే ఓ తలుపు ఉంటుంది. అప్పట్లో శత్రువులు దాడి చేసినపుడు ఆ తలుపు తెరిచి లోపల 30 కిలోమీటర్ల పొడవు ఉన్న సొరంగ మార్గంలో సిద్దాపూర్ అనే పట్టణానికి చేరుకునే ఏర్పాటు చేశారు. ఒకసారి సరస్వతి నదికి వచ్చిన వరదల్లో ఈ బావి పూర్తిగా ఇసుకలో కూరుకుపోయింది. జనానికి కనిపించకుండా మాయమైంది.
రాణి ఉదయమతి ఈ బావిని 1083లో నిర్మించారు. 1940లోనే ఆర్కియాలజీ శాఖ దీన్ని ఆనవాళ్లు గుర్తించినా
. పూర్తిగా బయటపడేందుకు నలభై సంవత్సరాలు పట్టింది. వంద నోట్ల మీద బావి బొమ్మను ముద్రించినా.. చాలా మందికి దాని చరిత్ర తెలియదు.