కాంతార చూడలేదు అన్నందుకే టార్గెట్
కర్ణాటకలో అడుగు పెట్టకు అంటూ వార్నింగ్
సోషల్ మీడియాలో తన పై వస్తున్న ట్రోల్స్, పోస్టలు చూస్తుంటే తన హృదయం ముక్కలవుతోందని పెద్ద పోస్ట్ రాసుకొచ్చింది రష్మిక. కాని ఇప్పటికిప్పుడు నేషన్ క్రష్ అంతగా ఎందుకు ఫీలయింది అనేది ఎవరికి అర్ధం కాలేదు.
ఆ స్థాయిలో ఆమెపై ట్రోలింగ్ ఎక్కడ జరిగింది అనేది ఎంత వెతికినా కనిపించలేదు. ఇప్పుడు అసలు విషయం బయటికి వచ్చింది. అదేంటి అంటే కన్నడ లేటెస్ట్ బ్లాక్ బస్టర్ కాంతార చూడనందునే రష్మికను కన్నడిగులు టార్గెట్ చేసారు.
మీరు కాంతార చూశారా అని మీడియా అడిగిన ప్రశ్నకు చూడలేదు అంటూ సింపుల్ గా చెప్పింది రష్మిక.
దాంతో శాండల్ వుడ్ లో ఈ బ్యూటీపై ఆగ్రహం అంతకంతకూ పెరుగుతోంది. రిషబ్ శెట్టి డైరెక్ట్ చేసిన కిరిక్ పార్టీ సినిమా ద్వారానే సినిమాల్లోకి వచ్చింది రష్మిక. ఈ సినిమా బ్లాక్ బస్టర్ కావడంతోనే రష్మకకు నటిగా గుర్తింపు వచ్చింది.
కాని ఈ రోజు రిషబ్ శెట్టి నటించిన చిత్రాన్ని దేశం మొత్తం కీర్తిస్తుంటే రష్మిక మాత్రం సినిమా చూసేందుకు సమయం లేకపోవడం కన్నడిగుల్లో ఆగ్రహాన్ని కలిగిస్తోంది. కన్నడ సినిమాలు రిలీజ్ అయితే పట్టించుకోకపోవడం, కన్నడ సినిమాలను ప్రమోట్ చేయకపోవడం, తనకు సంబంధంలేని నటీ నటులు నటిస్తున్న సినిమాలను కూడా రష్మిక ప్రచారం చేస్తుండటం, శాండల్ వుడ్ తనపై చూపిస్తున్న కోపానికి మరో రీజన్ గా చెప్పుకోవచ్చు.