*ఇదేం రివ్యూ రష్మిక?
*డిజాస్టర్ మూవీ కు 5 స్టార్ రేటింగా?
*దేవరకొండకి రష్మిక సపోర్ట్
లైగర్ మూవీ చూశాను , నాకు సినిమా బాగా నచ్చింది, సినిమా చూస్తున్నంత సేపు ఈలలు వేసాను. డ్యాన్స్ కూడా వేసాను. నాకు మాస్ మూవీస్ ఇష్టం. మూవీలో విజయ్ యాక్షన్ ఇరగదీశాడు, అతని ఫిట్ నెస్ చూసిన ఫిదా అయిపోయాను.. ఇదీ లైగర్ మూవీ పై కాస్త లేటుగా రష్మిక ఇచ్చిన రివ్యూ. ప్రస్తుతం ఈ రివ్యూ హాట్ టాపిక్ గా మారింది. అసలే గీత గోవిందం జంట ప్రేమలో ఉన్నారని చాలా కాలంగా ప్రచారంలో ఉంది. కాని వీరిద్దరు తమ రిలేషన్ ను కేవలం స్నేహానికి మాత్రమే పరిమితం అంటారు. కాని లైగర్ పై రష్మిక ఇచ్చిన రివ్యూ చూస్తే మాత్రం వీరిద్దరి మధ్య సమ్ థింగ్ సమ్ థింగ్ ఉందనే మాట నిజమే అనిపిస్తోంది. లేకపోతే ఈ ఏడాది అతి పెద్ద డిజాస్టర్స్ లో ఒకటిగా నిలిచిన లైగర్ మూవీని పట్టుకుని సినిమా బాగుంది, అదిరిపోయింది అనడం ఏంటి? లైగర్ దెబ్బకు పూరి జగన్నాథ్ , విజయ్ దేవరకొండ చేయాల్సిన జనగణమన ఆగిపోయింది. పూరి కొత్త సినిమా డైలామాలో ఉంది. విజయ్ దేవరకొండ డల్ అయ్యాడు. ఈ సమయంలో రష్మిక లైగర్ మూవీ గురించి పాజిటివ్ గా మాట్లాడటాన్ని అందరూ విడ్డూరంగా చూస్తున్నారు. ఇంతకీ రష్మిక ఈ కామెంట్స్ ఎక్కడ చేసిందో తెలుసా… బాలీవుడ్ లో… తాను నటిస్తున్న గుడ్ బై అనే హిందీ సినిమా అక్టోబర్ 7న రిలీజ్ అవుతోంది. ఈ సినిమా ప్రమోషన్ లో భాగంగానే లైగర్ పై తన డిఫరెంట్ రివ్యూ చెప్పుకొచ్చింది రష్మిక. ఈ రివ్యూ ఏదో లైగర్ థియేటర్స్ లో ఉన్నప్పుడు చెప్పిఉంటే కనీసం కొంత కలెక్షన్స్ అయినా పెరిగేవి కదా అంటున్నారు దేవరకొండ ఫ్యాన్స్.