ఊపందుకున్న బాయ్ కాట్ ఆదిపురుష్ ట్రెండ్
ఒక్క రోజులో మారిపోయిన సినిమా ఫేట్
ఇంత ట్రోలింగ్, ఇంత నెగిటివిటీ, ఇన్ని విమర్శలు వచ్చిన తర్వాత ఆదిపురుష్ ను అసలు థియేటర్స్ లోకి రిలీజ్ చేస్తారా?
అంత రిస్క్ ప్రభాస్ చేస్తాడా? లేక ఉత్తరాది నిర్మాతలు ధైర్యం చేస్తారా? ఒకవైపు విమర్శలు, మరో వైపు బీజేపీ లీడర్స్ నుంచి సీరియల్ వార్నింగ్, ఇంకో వైపు ప్రభాస్ ఫ్యాన్స్ అగ్రహం మధ్య ఆదిపురుష్ అనే సినిమా థియేటర్ వరకు వస్తుందా ? అనేది ఇప్పుడు అనుమానంగా మారింది. బాధ్యత లేకుండా హిందీ దర్శకుడు ఓం రౌత్ తీసిన ఈ సినిమా పై విమర్శల దాడి గంట గంటకు పెరుగుతోంది. ఈ నేపథ్యంలో ప్రభాస్ కూడా దర్శకనిర్మాతలపై ఆగ్రహంగా ఉన్నట్లు సమాచారం. ఆదిపురుష్ టీజర్ రిలీజ్ కు ముందు వరకు ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలోనే ప్రెస్టీజీయస్ ప్రాజెక్ట్ . టీజర్ రిలీజ్ తర్వాత ఇప్పుడు ఈ సినిమాను కార్టూన్ ఛానల్లో వేయమంటూ నెటిజన్స్ చెప్పుకొస్తున్నారు. శ్రీరాముడిగా ప్రభాస్ లుక్ బాగోలేదు ఉన్నారు. అతని మీసకట్టుపై వాదనలు జరుగుతున్నాయి. మరో వైపు రావణుడు, హనుమంతుడు పాత్రలపై కూడా లోతైన ఆధ్యయనం జరగుతోంది. దర్శకుడు ఆయా పాత్రలను తీర్చిదిద్దిన విధానం పై బీజేపీ పాలిత మంత్రులు చాలా కోపంగా ఉన్నారు. అయితే దర్శకుడు ఓం రౌత్ మాత్రం సినిమాను త్రీడీలో చూస్తేనే వాల్యూ తెలుస్తుందంటూ కొత్త పల్లవి అందుకున్నాడు. ఆదిపురుష్ కొత్త జనరేషన్ కు కనెక్ట్ కావాలని తీసామని, స్మాల్ స్క్రీన్ ఆడియెన్స్ కోసం కాదని బుకాయిస్తున్నాడు. మొత్తంగా రానున్న రోజుల్లో ఆదిపురుష్ వ్యవహారం ఏ మలుపు తిరుగుతుందో చూడాలి.