మా యాక్షన్ కామెడీగా ఉండేదట
అంతే కాదు టైటిల్స్ విషయంలోనూ బాగా యటకారంగా మాట్లాడేవారు
పదేళ్ల క్రితం దక్షిణాది సినిమా పరిస్థితి వేరు, ఇప్పుడు వస్తున్న ఆదరణ వేరు. దశాబ్ధం క్రితం సౌత్ మూవీస్ బాలీవుడ్ లో చాలా తక్కువ స్థాయిలో రిలీజ్ అయ్యేవి డబ్బింగ్ కూడా సరిగ్గా ఉండేది కాదు. చిత్ర విచిత్రమైన టైటిల్స్ తో ఉత్తరాది మార్కెట్ లోకి డబ్ అయ్యేవి, సినిమాల్లో యాక్షన్ స్టంట్ల్ చూసి ఇదీ కూడా ఒక సినిమానా అని అక్కడివారు అందరూ ఆట పట్టించేవారు. కాని బాహుబలి సినిమాతో దక్షిణాది రూపురేఖలు మారిపోయాయి. ఒక కొత్త గుర్తింపు వచ్చింది అంటున్నాడు రాఖీభాయ్ యశ్. ఓ ఈవెంట్ లో ఆసక్తికర కామెంట్స్ చేస్తూ ఒకప్పుడు ఉత్తరాది వారు దక్షిణాది వారి చిత్రాలను ఏ విధంగా కించపరిచే వారో చెప్పుకొచ్చాడు యశ్. రాజమౌళి వల్లే దక్షిణాది సినిమాకు సరికొత్త గుర్తింపు వచ్చిందని, యశ్ తన మనసులోని బాధను ఇన్నేళ్లకు బయటికి చెప్పాడు. గతంలో ఇలాంటి అవమానకర పరిస్థితులను చిరు కూడా ఎదుర్కొన్నారు. ఆచార్య ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ఆ విషయాన్ని వివరించారు. ఏదైనా బాహుబలితో రాజమౌళి వేసిన మార్గం దక్షిణాది సినిమాకు కొత్త గుర్తింపు తీసుకొచ్చింది. మన గౌరవాన్ని పెంచింది.