ఏంటి సామ్ నీకు ఏమైంది?

By KTV Telugu On 30 October, 2022
image

ఎలా తట్టుకుంటున్నావు ఆ కష్టాలను?
ఎప్పుడు తిరిగొస్తావ్ నువ్వు?

ఏ రూమర్ అయితే కొద్ది రోజులుగా సమంత అభిమానులు నిజం కాకూడదు అని అనుకుంటున్నారో,
అదే నిజంగా మారి వారి ముందుకు వచ్చంది. ఎప్పుడూ చలాకీగా, హుషారుగా ఉంటూ కేవలం తన నవ్వుతోనే అవతలి వారిని ఇంప్రెస్ చేసే సమంత. ఇప్పుడు ముఖం కూడా చూపించలేని పరిస్థితిలో ఉంది. తన ఒంట్లో శక్తి లేదు అంటోంది. కదలలేకపోతున్నాను అంటోంది. ఒక వైపు సెలైన్ బాటిల్ తో కనిపిస్తూ, మరో వైపు తన సినిమాకు డబ్బింగ్ చెప్పుకుంటున్న ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో నెటిజన్స్ ను బాధపెడుతోంది. రెండేళ్లుగా సమంత అనేక సమస్యలతో ఇబ్బంది పడుతోంది. ముందు నాగ చైతన్యతో డైవోర్స్. ఆ విషయాన్ని గట్టిగా ఎదుర్కొంది అంటే, ఇప్పుడు సీరియస్ హెల్త్ ఇష్యూ. ప్రస్తుతం సమంత ఆటో ఇమ్యూనిటీ డిజార్డర్ తో బాధపడుతోంది. 50 ఏళ్లు దాటిన తర్వాత రావాల్సిన ఈ హెల్త్ ప్రాబ్లమ్. సమంతకు ఇప్పుడే వచ్చింది. అందుకే మూడు నెలలుగా, ఈ వ్యాధికి సంబంధించిన ట్రీట్ మెంట్ తీసుకుంటోంది. నవంబర్ 11న యశోద మూవీ రిలీజ్ లేకపోయి ఉంటే కనుక, సమంత తన హెల్త్ ఇష్యూ గురించి బయట పెట్టి ఉండేది కాదేమో. యశోద ప్రమోషన్ స్టార్ట్ చేయాల్సిన సమయంలో తన అనారోగ్య పరిస్థితులను బయటపెట్టింది సమంత. ప్రస్తుతం ట్రీట్ మెంట్ తీసుకుంటున్నానని, త్వరలోనే ఆరోగ్యవంతురాలిగా తిరిగొస్తానని మాట ఇచ్చింది సమంత. నువ్వు త్వరగా కోలుకోవాలి సామ్ అంటూ కోట్లాది మంది అభిమానులు ఆ దేవుడ్ని కోరుకుంటున్నారు. తారక్ కూడా సమంత త్వరగా కోలుకోవాలని ఆకాక్షించారు.