మళ్లీ పారితోషికం పెంచేసిన సమంత?

By KTV Telugu On 4 November, 2022
image

అక్కినేని హీరోలను బీట్ చేసిందా?
టాలీవుడ్ ను షేక్ చేస్తున్న రూమర్?

మయోసైటిస్ వ్యాధితో సమంత బాధపడుతుంటే, ఆమె నటించిన యశోద సినిమాకు ప్రమోషన్ చేసే పరిస్థితిలో లేదంటే, ఇప్పటికిప్పుడు రెమ్యూనరేషన్ పెంచడం ఎలా సాధ్యమవుతుంది అనేది చాలా మంది సందేహం. కాని తన అనారోగ్యం నుంచి సమంత కోలుకుంటోంది. వేగంగా కోలుకుంటోంది. అన్ని కుదిరితే త్వరలోనే యశోద సినిమా ప్రమోషన్ లో చురుగ్గా పాల్గొనబోతోంది. అంతే కాదు ఫ్యూచర్ ప్రాజెక్ట్ పైకూడా ఫోకస్ పెట్టింది లేడీ సూపర్ స్టార్.
ఇంట్లో రెస్ట్ తీసుకుంటూనే న్యూ స్టోరీస్ వింటోందట.

తనతో సినిమా తీయాలనుకుంటున్నవారికి తన పారితోషికం 8 కోట్లుగా ఫిక్స్ చేసిందట సమంత.
ప్యాన్ ఇండియా మార్కెట్ లో ఆమెకు వచ్చిన క్రేజ్, ఫ్యాన్ ఫాలోయింగ్ చూపించి సమంత 8 కోట్లు డిమాండ్ చేస్తోందట.
మరో వైపు అక్కినేని నాగార్జున రెమ్యూనరేషన్ కూడా 8 కోట్లుగా ఉంది. మిగితా అక్కినేని హీరోలు 5 నుంచి 6 కోట్లు తీసుకుంటున్నారు. ఈదశలో సమంత పారితోషికం ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. యశోద, శాకుంతలం, ఓ హాలీవుడ్ ప్రాజెక్ట్, అలాగే సిటాడెల్ అనే హిందీ వెబ్ సిరీస్ కోసం 6 నుంచి 7 కోట్లు పారితోషికం తీసుకుందట సమంత. ఇకపై మాత్రం 8 కోట్లు ఇవ్వాల్సిందే అంటోందట.