సానియా పాక్ కోడలు కాదు.. మన ఆడబిడ్డే!
మరో సెలబ్రిటీ పెళ్లి పెటాకులు కాబోతోందా?
సానియామీర్జా. టెన్నిస్‌లో అంతర్జాతీయ వేదికలపై భారత పతాకాన్ని రెపరెపలాడించిన స్టార్. ఇప్పటి యువ టెన్సిస్ క్రీడాకారులు ఎందరికో సానియానే రోల్‌మోడల్. పర్సనల్ లైఫ్ విషయంలో ప్రైవసీ పాటించే సానియామీర్జా సంసారం పట్టాలు తప్పినట్లే కనిపిస్తోంది. ఆమె పెళ్లే ఓ సంచలనమైతే ఇప్పుడామె తీసుకోబోయే నిర్ణయం మరింత సంచలనం సృష్టించబోతోంది. పాక్ క్రికెటర్ షోయబ్‌మాలిక్‌ని పుష్కరకాలం కిందట సానియామీర్జా పెళ్లాడింది. పాక్ ఆటగాడిని జీవితభాగస్వామిగా స్వీకరించి అప్పట్లో విపరీతంగా ట్రోల్ అయింది. భారత్‌కోసం ఆమె ప్రదర్శించిన క్రీడాస్ఫూర్తిని కూడా మరిచిపోయి పాకిస్తాన్ కోడలు అంటూ దెప్పిపొడిచారు కొందరు. ఆటవేరు, వ్యక్తిగతజీవితం వేరని చెప్పుకున్నా ఆమెను టార్గెట్ చేసుకున్నారు.
ఓ కొడుక్కి తల్లయిన సానియామీర్జా 12ఏళ్ల తర్వాత వివాహజీవితంపై తొలిసారి వైరాగ్యం చెందినట్లు కనిపిస్తోంది. అక్టోబరు 30న దుబాయ్‌లో కొడుకు బర్త్‌డేని సానియా-షోయబ్ సెలబ్రేట్ చేసుకున్నారు. షోయబ్ ఫ్యామిలీ ఫొటోలను షేర్ చేస్తే సానియా మాత్రం తాను, కొడుకు మాత్రమే కలిసి ఉన్న ఫొటో పంచుకున్నారు. కొడుకు తనను ముద్దాడుతున్న ఫొటోను ఇన్‌స్టాలో షేర్ చేసిన సానియామీర్జా ఆ ఫొటోకిచ్చిన క్యాప్షన్ ఆమె సంసారజీవితం సవ్యంగా లేదని చెప్పకనే చెబుతోంది. కఠిన పరిస్థితుల నుంచి నన్ను బయటికి తీసుకువచ్చే క్షణాలు అంటూ ఆ ఫొటోకు క్యాప్షన్ ఇచ్చారు సానియా. అక్కడితోనే ఆగలేదామె. ‘ముక్కలైన హృదయం ఎక్కడికి వెళ్తుంది’ అంటూ ఇన్‌స్టా స్టోరీలో ఆమె కామెంట్స్ చూస్తుంటే షోయబ్‌తో ప్రయాణానికి బ్రేక్ పడినట్లే ఉంది. షోయబ్ మోసాన్ని తట్టుకోలేక సానియా విడిపోవడానికి సిద్ధమయ్యారని కొన్నాళ్లుగా విడిగానే ఉంటున్న ఈ జంట కొడుకుకోసం అప్పుడప్పడూ కలుస్తున్నారనే కథనాలు వస్తున్నాయి. ఎవరో ఒకరినుంచి తెగదెంపుల ప్రకటన వస్తుందా? లేదంటే సామ్‌చైతూలా స్టేట్మెంట్ ఉంటుందా? ఎందుకంటే ముక్కలైన హృదయం ఎప్పటికీ అతుక్కోదు.