విడిపోవడం లేదు..కలిసి చేయబోతున్నారు!
ఊపె కుహ… అంటే తెలుసుగా ఊళ్లో పెళ్లికి కుక్కల హడావుడి. మరీ శునకాలతో పోలిస్తే బాధపడతారేమోగానీ చూసేవాళ్లందరికీ అలాగే అనిపిస్తోంది. ఆళ్లు మొగుడూ పెళ్లాలురా నాయనా కలిసి సంసారం చేస్తారో విడిపోవాలనుకుంటే విడాకులు తీసుకుంటారో మీకెందుకు అంటున్నారు. ఇండియన్ టెన్నిస్‌స్టార్ సానియామీర్జా, పాక్ క్రికెటర్ షోయబ్‌మాలిక్ పన్నెండేళ్ల బంధం పెటాకులు అయిపోతోందంటూ అంతా చెవులు కొరికేసుకున్నారు. గుండెలు బాదేసుకున్నారు. కానీ ఇటు సానియామీర్జా, అటు షోయబ్‌మాలిక్ ఇద్దరిలో ఎవరూ అఫీషియల్‌గా ఆ విషయం చెప్పలేదు.
సానియామార్జా కేవలం కొడుకు ఫొటోనే పెట్టిందని బద్దలైన గుండెలు ఏ దారి తీసుకుంటాయని వైరాగ్యపు కామెంట్ పెట్టిందని అంతా ఎవరికివారు ఫిక్స్ అయిపోయారు.
మోడల్ మోజులో షోయబ్‌మాలిక్ భార్యని చీట్ చేస్తున్నాడని కహానీలు అల్లేశారు. ఇద్దరూ సెలబ్రిటీలే. ఎవరితోనైనా సన్నిహితంగా కనిపిస్తే ఏదో ఉన్నట్లేనా! ఏవిటో!! మ్యాటరేంటంటే రేపోమాపో సానియా-షోయబ్‌ల బ్రేకింగ్ న్యూస్ అఫీషియల్‌గా ఎనౌన్స్ అవుతుందనుకుంటున్నవారికి ఓ షాకింగ్ ట్విస్ట్ ఎదురైంది. గాలిపోగుచేస్తున్న వాళ్లందరికీ స్పోర్ట్స్ కపుల్ సర్ప్రైజ్ ఇచ్చారు. ఇద్దరూ కలిసి ఓ టాక్‌షో చేయబోతున్నారట. ప్రముఖ పాకిస్థానీ ఓటీటీ ప్లాట్‌ఫాం ఉర్దూఫ్లెక్స్లో మీర్జా మాలిక్ పేరుతో షో ప్రసారం కాబోతోంది. అందులో సానియా-షోయబ్ జంటే హోస్ట్లంటున్నారు. ఇండియాలో హిట్ అయిన కపిల్ శర్మ టాక్ షో తరహాలోనే ఈ షో ఉండబోతోందని సమాచారం. ఉంటుందని ఇందులో వీరిద్దరూ కలిసి హోస్ట్‌గా చేయబోతున్నట్లుగా సమాచారం అందుతోంది. దీనికి సంబంధించి ఉర్దూప్లెక్స్ అఫీషియల్ ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసిన పోస్ట్ వైరల్ అవుతోంది. షో స్టార్ట్ అయితే ఇద్దరి బ్రేకప్ గాసిప్స్‌కి తెరపడుతుందేమో!