అయ్యన్న పాత్రుడిపై సీఐడీ దర్యాప్తుకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్

By KTV Telugu On 9 November, 2022
image

అయ్యన్న పాత్రుడిపై సీఐడీ దర్యాప్తుకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్

భూమి కబ్జా చేశారని అయ్యన్నపై కేసు నమోదు
సీఆర్పీసీ కింద నోటీసులు జారీ చేసి విచారణ జరుపుకోవచ్చన్న కోర్టు

భూ ఆక్రమణ కేసులో టీడీపీ సీనియర్‌ నేత అయ్యన్న పాత్రుడికి హైకోర్టులో చుక్కెదురైంది. 0.16 సెంట్ల భూమిని కబ్జా చేశారంటూ ఆయనపై సీఐడీ అధికారులు కేసులో దర్యాప్తు కు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. సీఆర్పీసీ నిబంధనల ప్రకారం 41ఏ కింద నోటీసులు జారీ చేసి సీఐడీ అధికారులు విచారణ జరుపుకోవచ్చని తెలిపింది. అంతకుముందు తనపై నమోదైన భూ ఆక్రమణ కేసులు కొట్టివేయాలని కోరుతూ హైకోర్టులో అయ్యన్నపాత్రుడు పిటిషన్ వేశారు. తన క్లయింట్ పై ఉద్దేశపూర్వకంగానే సెక్షన్ 467 నమోదు చేశారని ఈ కేసులో సెక్షన్ 467 చెల్లదని అయ్యన్న తరపు న్యాయవాది కోర్టుకు తెలిపారు. సీఐడీ తరపు న్యాయవాది తన వాదనలను వినిపిస్తూ అయ్యన్నపై ఫిర్యాదు చేసిన ఈఈని బెదిరించడం, భయపెట్టడం వంటివి చేశారని అందుకే సెక్షన్ 467 వర్తిస్తుందని చెప్పారు. ఇరువైపు వాదనలు విన్న న్యాయస్థానం ఈ కేసులో సెక్షన్ 467 వర్తించదని స్పష్టం చేసింది. హైకోర్టు తీర్పుతో అయ్యన్న పాత్రుడు సీఐడీ విచారణ ఎదుర్కోనున్నారు.