ఇప్పుడున్న సినిమా నటుల్లో జగపతిబాబు స్టైలే సెపరేటు. స్టార్ హీరోగా ఎన్నో సినిమాలు..చేసినా.. ఇప్పుడు క్యారెక్టర్ ఆర్టిస్ట్టుగా, విలన్ పాత్రాల్లో మెప్పిస్తున్నా జగపతిబాబుకే సాధ్యం. ఒక నిర్మాత కొడుకులా కంటే ఒక సామాన్య వ్యక్తిగా ఉండటానికే ఇష్టపడతారు.
ఎంతో ఆస్తి ఉన్న చాలా సింప్లిసిటిగా ఉంటారు. ఎదుట మనిషి స్థాయిని బట్టి కాకుండా మంచి వ్యక్తిత్వాన్ని గౌరవించడంలో జగపతిబాబు ముందుంటారు. చాలా మంది స్టార్ హీరోలు వారి డ్రైవర్, లేదా అసిస్టెంట్లను దూరంగా ఉంచుతారు. వాళ్లను ఎక్కడ ఉంచాలో అక్కడే ఉంచాలని అనేవాళ్లు ఉండటం కామన్ . కాని జగపతిబాబు మాత్రం వాళ్లను హోటల్ కు తీసుకెళ్లి వాళ్లతో కలిసి భోజనం చేస్తూ సోషల్ మీడియాలో ఫోటోలు పెట్టడంలో ఆయనకి ఆయనే సాటి. ఒక డ్రైవర్ దగ్గరో పనోళ్లతో కూడా ఎలా ఉండాలో చెప్పకనే చెప్పారు.
జగపతిబాబులో ఎక్కడా స్టార్ హీరో, సీనియర్ యాక్టర్ అన్న ఫీలింగ్ కనిపించలేదు. నడకలోను, నడతలోను మాటల్లో ఆ ఉద్దేశమే అనిపించదు. రోడ్డు మీద అభిమాని అడిగాడని వెంటనే వారితో కలిసి ఫోటో దిగడం జగపతిబాబుకి మాములుగా అనిపించే విషయం. నిజానికి జగపతిబాబు గ్లోబల్ సిటిజన్ అని చెప్పాలి. ఎందుకంటే తన కూతూళ్లకు తన జాతికి, దేశానికి సంబంధం లేదని వారికి ఇచ్చి పెళ్లి చేశారు.అలా అమెరికాతో బాబుకి బంధం ఏర్పడింది. వాళ్ల లైఫ్ అంతా సెటిల్డ్. ఇక్కడ జగపతిబాబు సినిమాల కోసమే తన జీవితాన్ని ఇక్కడ గడుపుతున్నారు.
కమ్మ సామాజిక వర్గానికి చెందినప్పటికి జగపతిబాబు తన వారి కంటే ఇతర వర్గాలతో చాలా క్లోజ్ గా ఉంటారు. కమ్మవర్గం తనను నుంచి వెలి వేశారని ఓ ఇంటర్వ్యూలో చాలా సరదాగా చెప్పారు.తన చుట్టూ హైఫై స్టేటస్ వ్యక్తులు ఉంటుంటారు. పెద్ద స్థాయిలో వ్యక్తుల్ని ఎక్కువగా కలుస్తారు. అయినా సరే ఎందుకంటే జగపతిబాబు ఒక స్టేటస్ మెయింటైన్ చేయాలనుకునే వారు కాదు. తాను ఉంటున్న అపార్ట్ మెంట్ లో నీళ్ల సమస్య ఉందని చెబితే సాధారణ పౌరుడిలా అక్కడ వారితో కూర్చుని పోరాడారు. మాములుగా అలాంటి ఒక వ్యక్తి జనం మధ్య కూర్చుంటారని అస్సలు అనుకోం అనుకోలేం కూడా. కాని అది జగపతిబాబుకి మాత్రమే సాధ్యం. సామాజిక సమస్యలపై కూడా కూడా నిక్కచ్చిగా మాట్లాడతారు.
జగపతిబాబు ఇప్పుడు ఢిపరెంట్స్ రోల్స్ తో కాల్షీట్లు ఖాళీ లేకుండా నటిస్తున్నారు. ఈ పొజిషిన్ లో ఉన్నప్పటికి
వర్షంలో తడుచుకుంటూ రోడ్డు మీద వెళ్తున్న ఫోటో చూస్తుంటే జగపతిబాబు సింప్లిసిటీ ఏంటో చాలా సింపుల్ గా అర్ధం చేసుకోవచ్చు. పక్కన గొడుగు పట్టుకునే మరో లేడు. అయినా అదేం పెద్ద విషయం కాదంటారు. ఏ విషయంలో చూసినా జగపతిబాబు డౌన్ టు ఎర్త్ చూసిన వ్యక్తి . ఒక కామన్ మ్యాన్ .
జగపతిబాబు సినిమాల్లోకి వచ్చిన తర్వాత ఆస్తులన్నీ పొగోట్టుకుని కష్టాలు అనుభవించారు. కొంతమంది స్నేహితులు కూడా మోసం చేశారు. అప్పుల పాలైయ్యారు. లెజెండ్ సినిమాతో దశ తిరిగింది. మళ్లీ పోగొట్టుకువన్నీ తిరిగి సంపాదించుకున్నారు . ఇప్పుడు క్యారెక్టర్ ఆర్టిస్టుగా చేతినిండా పని అయినా..నడక, నడతలో ఎలాంటి మార్పు లేదు.