పవన్ కల్యాణ్ మూడు వివాహాలపై రచ్చ
మహిళా కమిషన్ జోక్యంతో మారిన సీన్
జనసేన ఎదురుదాడితో వేడెక్కిన వ్యవహారం
ట్రెండింగ్ లో ఏపీ మహిళా కమిషన్
ఏపీలో పవన్ కల్యాణ్ మూడు పెళ్లిళ్ల వ్యవహారం రచ్చ రచ్చ అవుతోంది. ఇప్పటివరకు వైసీపీ వర్సెస్ జనసేనగా ఈ వ్యవహారం నడిచింది. ఇప్పుడు మహిళా కమిషన్ జోక్యంతో మరింత రచ్చ అవుతోంది. పవన్ కల్యాణ్ మహిళలకు క్షమాపణ చెప్పాలన్న మహిళా కమిషన్ ను టార్గెట్ చేసుకొని…. జనసేన ట్విట్టర్ వేదికగా ట్వీట్ల మోత మోగిస్తోంది. ఏపీలో అత్యాచారాలు జరుతుంటే.. వైసీపీ నేతలు బూతులు తిడుతుంటే.. ఓ ఎంపీ వీడియో కాల్లో అడ్డంగా దొరికిపోయినప్పుడు.. ఈ మహిళా కమిషన్ ఎక్కడికి వెళ్లిందంటూ 18 అంశాలపై ప్రశ్నల వర్షం కురిపించింది.
త్రీ మ్యారేజెస్ విషయంలో తనపై పదే పదే విమర్శలు చేస్తున్న వైసీపీని టార్గెట్ చేసుకొని ఇటీవల పవన్ కల్యాణ్ రెచ్చిపోయారు. ఈ సందర్భంగా చేసిన అభ్యంతర వ్యాఖ్యలు రాష్ట్రంలో అగ్గిరాజేస్తున్నాయి. భరణం ఇస్తే భార్యను వదిలించుకోవచ్చన్న పవన్ కల్యాణ్ వ్యాఖ్యలను తప్పుబడుతూ… ఏపీ మహిళా కమిషన్ ఆయనకు నోటీసులు పంపింది. మహిళలను స్టెపినిగా పేర్కొనడాన్ని తీవ్రంగా ఆక్షేపిస్తున్నట్లు నోటీసుల్లో పేర్కొంది. ఆ వ్యాఖ్యలను వెనక్కి తీసుకొని…మహిళలకు క్షమాపణ చెప్పాలని ఆదేశించింది. కమిషన్ నోటీసులపై స్పందిస్తూ జనసేన పలు ప్రశ్నలతో ఎదురుదాడి మొదలుపెట్టడంతో మరింత దుమారం రేగుతోంది.
ఇక, సోషల్ మీడియాలోనూ ఈ అంశం ట్రెండింగ్ లోకి వెళ్లడంతో ఈ ఎపిసోడ్ మరింత వేడి పెంచుతోంది. ఇండియా, పాకిస్థాన్ మ్యాచ్ తోపాటు ఏపీ మహళా కమిషన్ ట్రెండింగ్ లో ఉండటం ఆసక్తిని రేకెత్తిస్తుంది. ఇండియా టాప్ ట్రెండింగ్స్ లో ఇండియా-పాక్ మ్యాచ్ ఫస్ట్ ప్లేస్ లో ఉంటే, రెండో స్థానంలో ఏపీ ఉమెన్ కమిషన్ ఎక్స్ పోజడ్ అనే హ్యాష్ టాగ్ ఉండడం విశేషం.