టాలీవుడ్ లో మళ్లీ అదే సీన్
ఒకప్పుడు హిట్ టాక్ వస్తే అదే పది వేలు. సినిమా బాగుందని ఆటోమేటిక్ గా మౌత్ టాక్ స్ప్డెడ్ అయిపోయేది.
కాని ఇప్పుడు అంత సీన్ లేదు. ఏదైనా సినిమా బాగుంది అంటే ఆ సినిమా వసూళ్లు ఉండవు అని అర్ధమవుతోంది.
అంతకు ముందు ఒకే ఒక జీవితం, ఈ మధ్య కాలంలో ఓరిదేవుడా, ఉర్వశివో రాక్షసివో చిత్రాలు అందుకు ఉదాహరణలు. అల్లు శిరీష్ మూవీకి హిట్ టాక్ వచ్చింది. కాని వసూళ్లు చూస్తే దారుణంగా ఉన్నాయి. సినిమా చూసేందుకు ఆడియెన్స్ థియేటర్ వరకు రాకపోవడం అందర్నీ ఆశ్చర్యపరుస్తోంది. చిరు నటించిన గాడ్ ఫాదర్ కు మంచి రివ్యూస్ వచ్చాయి. చిరు కమ్ బ్యాక్ అన్నారు. కాని మెగా స్టార్ రేంజ్ సినిమా వసూళ్లు రాలేదు. దాంతో డిసెంబర్ లో రావాల్సిన హీరోలందరూ ఫిబ్రవరికి తమ సినిమాలను పోస్ట్ పోన్ చేసుకుంటున్నారు. డిసెంబర్ 2న రావాల్సిన సర్ ఇఫ్పుడు శివరాత్రి కానుకగా రిలీజ్ కాబోతోంది. కళ్యాణ్ రామ్ అమిగోస్ , విజయ్ దేవరకొండ ఖుషి, అల్లరి నరేష్ ఉగ్రం, సంక్రాంతికి రావాల్సిన ఏజెంట్ కూడా ఇప్పుడు ఫిబ్రవరి రెండోవారానికి పోస్ట్ పోన్ అయిందని సమాచారం. ఆగస్ట్ కు ముందు కూడా టాలీవుడ్ లో ఇలాంటి సీన్ కనిపించింది. కాని బింబిసార, సీతారామం చిత్రాలు ఈ ట్రెండ్ ను బద్దలు కొట్టి ఆడియెన్స్ ను థియేటర్ కు రప్పించాయి.ఇప్పుడు ఇలాంటి ట్రెండ్ సెట్టింగ్ మూవీస్ కోసమే తెలుగు సినిమా ఎదురు చూస్తోంది.