మహారాష్ట్ర రాజకీయం రసవత్తరంగా మారిందా ? గురువారం సాయంత్రం ఐదు గంటల లోపు బల నిరూపణ చేసుకోవాలని గవర్నర్ కోషియారీ..
సీఎం ఉద్ధవ్ ను ఆదేశించడంతో ఆయన ఇరకాటంలో పడ్డారా ? ఉద్ధవ్ రాజీనామా చేస్తారా.. ? సుప్రీం కోర్టు నుంచి ఆయన ఊరట పొందుతారా ? వాచ్ దిస్ స్పెషల్ స్టోరీ..
దేశం మొత్తం ఇప్పుడు మహారాష్ట్ర వైపు చూస్తోంది. మహారాష్ట్ర ఎమ్మెల్యేలు తమ అసెంబ్లీ వైపే చూస్తున్నారు. అసెంబ్లీకి వెళితే అక్కడ ఏం జరుగుతుందోనన్న అనుమానాలు వారిని పీడిస్తున్నాయి. బల నిరూపణ పూర్తి కావడం అంత సులభం కాదని ఎన్సీపీ, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు భయపడుతున్నారు. అయితే ఎలాగోలా ఉద్ధవ్ ను దించెయ్యాలని బీజేపీ భీష్మించుకు కూర్చుంది. రెబెల్స్ ను కమలం పార్టీ రెచ్చగొడుతోంది.దానితో వారు ఎట్టిపరిస్థితుల్లో ముఖ్యమంత్రి ఉద్ధవ్ నాయకత్వాన్ని ఆమోదించే ప్రసక్తే లేదంటున్నారు….
రాష్ట్రంలో కూటముల లెక్కలు చాలా విచిత్రంగా ఉన్నాయి. మహారాష్ట్ర అసెంబ్లీ బలం 288 కాగా ఒకరు చనిపోవడం ఇద్దరు జైల్లో ఉండటంతో ఆ బలం 285కి తగ్గింది. అయితే లెక్కప్రకారం అధికార మహావికాస్ అఘాఢీకి 162 మంది బలమంది..అయితే ముందు చెప్పుకున్న ముగ్గురు పోతే.. మిగిలేది 159… అందులోనూ 39 మంది షిండే వర్గాన్ని మనం మరిచిపోకూడదు. ఇక ఎన్డీయే బలం ప్రస్తుతం 123 ఉన్నప్పటికీ.. షిండే వర్గం కలిస్తే చాలా పెరుగుతుంది. షిండే వర్గంలో ఎంత మంది ప్లేట్ ఫిరాయిస్తారు. ఎంతమంది ఓటు వేస్తారో చూడాల్సి ఉంది. ఇప్పటికిప్పుడు మెజార్టీ మార్కు మాత్రం 143. ఓటింగ్ జరిగిన సమయంలో అసెంబ్లీకి హాజరైన వారిని బట్టి మెజార్టీ మార్కు మారుతుంది…
ఉద్ధవ్ ఠాక్రే మరోసారి సుప్రీం కోర్టు తలుపు తడుతున్నారంటే.. విశ్వాస తీర్మానంలో ఆయన గట్టెక్కుతారన్న నమ్మకం సడలిపోయిందనే అనుకోవాలి. 16 మంది రెబెల్స్ అనర్హత పిటిషన్ పై విచారణ ఈ నెల 12కు వాయిదా పడినందున అప్పటి వరకు అసెంబ్లీలో విశ్వాస పరీక్షవద్దన్నది ఉద్ధవ్ వాదన. ఆయన వైపు పట్టుమని పది మంది ఎమ్మెల్యేలు కూడా లేరని తాజా లెక్కలు చెబుతూనే ఉన్నాయి. ప్రత్యర్థుల బలం 160 దాటిపోయిందని ఆయనకు తెలుసు. అందుకే కోర్టులో కేసులతో ఆయన కాలయాపన చేయాలనుకుంటున్నారు….
ఇరు వర్గాల లెక్కలు వేరుగా ఉన్నాయి. ఓటింగ్ కు రెబెల్స్ అందరూ గైర్హాజరైతే.. ఉద్దవ్ ప్రభుత్వం పడిపోవడం ఖాయం అదే రెబెల్స్ స్వయంగా రాజీనామా చేసినా… ఉద్దవ్ దిగిపోయి.. బీజేపీ నేత ఫడ్నవీస్ కు అధికారాన్ని అప్పగించాల్సి ఉంటంది. అవసరమైనంత వరకే కొంతమంది రెబెల్స్ ను రాజీనామా చేయించి ప్రభుత్వాన్ని పడగొట్టాలని బీజేపీ లెక్కలేసుకుంటుంది. వారందరికీ తర్వాత బీజేపీ టికెట్లు ఇచ్చి మంత్రులను కూడా చేస్తామని హామీ పలికిందట. వీటన్నింటికీ మించి ఉద్దవ్ రాజీనామా చేసి.. ఎన్నికలకు వెళ్లినా ఆశ్చర్యం లేదు. ఏదైనా కోర్టు ఉత్తర్వుల తర్వాతే జరుగుతుంది…