వరుణ్ తేజ్ ఆలోచనలో పడ్డాడా?
గద్దలకొండ గణేష్ తర్వాత హరీష్ శంకర్ ఖాళీగా ఉన్నాడు. అతను ఎందుకు ఖాళీగా ఉన్నాడు అంటే, అందుకు కారణం పవన్ కళ్యాణ్ తో సినిమా. గబ్బర్ సింగ్ కాంబినేషన్ లో భవదీయుడు భగత్ సింగ్ తెరకెక్కాల్సి ఉంది. కాని ఈ ప్రాజెక్ట్ ఎనౌన్స్ మెంట్ కు మాత్రమే పరిమితం అయింది. పవన్ కళ్యాణ్ చేస్తోన్న హరి హర వీరమల్లు తర్వాతే షూట్ ప్రారంభం అవుతుందని ముందు నుంచి ప్రచారం సాగుతున్నా, ఆ తర్వాత ఓ తమిళ రీమేక్ లో పవన్ నటించాలని ఫిక్స్ కావడంతో,
హరీశ్ శంకర్ తో చేయాల్సిన సినిమా వెనక్కి వెళ్లిందని టాక్. అందుకే హరీష్ శంకర్ మరో హీరోతో మూవీ చేయబోతున్నాడంటూ తరచూ వార్తలు వినిపిస్తుంటాయి. ఒకసారి పవన్ తోనే కోలీవుడ్ సూపర్ హిట్ తేరీ రీమేక్ చేస్తాడని,
మరోసారి విజయ్ దేవరకొండతో సినిమా చేయబోతున్నాడని, ఇంకో సారి రామ్ తో మూవీ చేస్తాడని, ఇలా రకరకాల రూమర్స్ వినిపిస్తూ వస్తున్నాయి. ఇప్పుడు గద్దలకొండ గణేష్ హీరో వరుణ్ తేజ్ తో మరో మూవీ చేయబోతున్నాడట హరీష్ శంకర్. ఈ వార్తల్లో ఎంత వరకు నిజం ఉందో తెలియదు కాని, గద్దలకొండ గణేష్ రిలీజ్ సమయంలోనే వరుణ్ తో మరో మూవీ చేస్తానని ప్రకటించాడు హరీష్ శంకర్. ఆ ప్రాజెక్ట్ కు ఇప్పుడు పట్టాలెక్కించేందుకు ట్రై చేస్తున్నాడు హరీష్.
మరోవైపు వరుణ్ తేజ్ కూడా ఈ మధ్య సీరియస్ మూవీస్ చేస్తున్నాడు. గని డిజాస్టర్ అయింది. ఈ మూవీ తర్వాత మరో రెండు న్యూ ప్రాజెక్ట్స్ ఇటీవలే స్టార్ట్ చేసాడు. రెండూ కూడా సీరియస్ సబ్జెక్ట్స్. అందుకే హరీష్ శంకర్ ను లైన్ లో పెట్టాడు వరుణ్. తన నుంచి మాస్ మూవీ కోరుకుంటున్న ఫ్యాన్స్ కు ఆ ట్రీట్ కూడా రెడీ అవుతోందని హింట్ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నాడు.