మళ్లీ రిస్క్ చేస్తోన్న వరుణ్ తేజ్
మరోసారి గన్నులతోనే సినిమా చేస్తోన్న డైరెక్టర్
దసరాకు గాడ్ ఫాదర్ తో పాటు రిలీజ్ అయ్యి, దారుణమైన ఫలితాన్ని అందుకుంది ది ఘోస్ట్. కింగ్ నాగ్ కెరీర్ లో మైల్ స్టోన్ మూవీగా నిలుస్తోంది అనుకుంటే, ఆయన కెరీర్ లోనే బిగ్గెస్ట్ డిజాస్టర్స్ లిస్ట్ లో చేరింది. స్టైలిష్ లుక్ అన్నారు, అదిరిపోయే యాక్షన్ సీన్స్ అన్నారు. కత్తిని చూపించారు. గన్నులతో ఫైటింగ్ చూపించారు. సోనాల్ చౌహాన్ కూడా నటించింది. అయినప్పటికీ ఘోస్ట్ బాక్సాఫీస్ దగ్గర నామ మాత్రపు వసూళ్లను కూడా అందుకోలేకపోయింది. ఘోస్ట్ థియేటర్స్ లోకి వచ్చి 10 రోజులు కాలేదు అప్పుడే మరో మూవీ అవకాశం అందుకున్నాడు దర్శకుడు ప్రవీణ్ సత్తారు. మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ కొత్త సినిమా షూటింగ్ ను పట్టాలెక్కించాడు. ఘోస్ట్ డైరెక్టర్ తో సినిమానా , ఇది చాలా రిస్క్ కదా అని అందరూ అంటున్న సరే వరుణ్ తేజ్ అతని మేకింగ్ ఫిదా అయ్యాడట. తను రాసుకున్న కథ చాలా బాగుందని, తన కెరీర్ లో హై వోల్టేజ్ యాక్షన్ ఫిల్మ్ లో నటిస్తున్నట్లు చెప్పాడు వరుణ్ తేజ్. ఎక్కువ శాతం లండన్ లోనే షూటింగ్ జరుపుకోనుంది ఈ చిత్రం. ప్రపంచానికి ఒక మెసేజ్ ఇచ్చే ప్రయత్నం కూడా జరుగుతోందట. ఏది ఏమైనా వరుణ్ తేజ్ హిట్ కొట్టి చాలా కాలమైంది. పాండెమిక్ తర్వాత వరుణ్ థియేటర్స్ వరకు తీసుకొచ్చిన గని డిజాస్టర్స్ లిస్ట్ లో చేరిపోయింది. గద్దలకొండ గణేష్ లాంటి హిట్ ఇప్పుడు ఈ మెగా హీరోకు చాలా అవసరం. కాని వరుణ్ తేజ్ మాత్రం ఫ్లాప్ డైరెక్టర్ కు ఛాన్స్ ఇచ్చి మరో సారి రిక్స్ చేస్తున్నాడు.