మాస్ కు ఫుల్ మీల్స్ ఫిక్స్ చేసిన బాబి
మొన్న ఇస్మార్ట్ శంకర్ తో, ఇప్పుడు మెగా స్టార్ తో..
సంక్రాంతికి రిలీజ్ అవుతున్న చిత్రాల్లో వాల్తేరు వీరయ్య ఒకటి. ఈ మూవీకి సంబంధించిన సాంగ్ ను పిక్చరైజ్ చేస్తున్నాడు బాబి. ఒక వైపు మెగాస్టార్,మరోవైపు మాస్ రాజా కలసి, రాక్ స్టార్ దేవి అందించిన బీట్ కు స్టెప్పులేస్తున్నారు.
అంతా బాగానే ఉంది. సాంగ్ లో ఒక ఛమక్ తక్కువైంది అని బాబి అనుకున్నాడు. చిరు, రవితేజకు తోడుగా గ్లామర్ కూడా ఉండాలనుకున్నాడు. కాని ఆల్రెడీ సాంగ్ షూట్ అవుతున్న సమయంలో ఎవర్ని సంప్రదించాలో బాబికి అర్ధం కాలేదు.
ఈ టైమ్ లో బోయపాటి దర్శకత్వంలో రామ్ హీరోగా తెరకెక్కుతున్న సినిమాలో ఐటెమ్ సాంగ్ చేయడానికి ఇటీవలే హైదరాబాద్ వచ్చిన ఊర్వశీ రౌతేలా, బాబికి గుర్తోచ్చింది. సెకండ్ థాట్ లేకుండా ఆమెను సంప్రదించడం అయింది. ఆమె వాల్తేరు వీరయ్యలో స్పెషల్ స్టెప్పులూ వేయడం అయిపోయింది. ఉత్తరాఖండ్ కు చెందిన ఈ ముద్దుగుమ్మ బాలీవుడ్ లో హీరోయిన్ గా నిలదొక్కుకునేందుకు చాలా ప్రయత్నాలే చేస్తోంది. కాని కాలం కలసి రావడం లేదు. అందుకే సౌత్ వైపు చూస్తోంది. పైగా మెగాస్టార్ మూవీలో ఛాన్స్ చిన్న విషయం కాదు కదా..