రౌడీ జోడి ఎందుకు అర్జెంటుగా అక్కడికి వెళ్లారు?
ప్రేమ అనేది నిజం కాదా?
టోటల్ టాలీవుడ్ లో ఇప్పుడు ఒకటే డిస్కషన్ అదే, విజయ్,రష్మిక ప్రేమలో ఉన్నారా… ? ఉన్నారు కాబట్టే సరదాగా మాల్దీవుల వరకు వెళ్లారు. కొన్ని రోజులు బీచ్ లో గడిపారు. హ్యాపీగా ఫోటోలు దిగారు. ఇదంతా పైకి కనిపించే మ్యాటర్. కాని అసలు స్టోరీ వేరే ఉందట. అది ఏంటంటే ఒక మ్యాగజైన్ ప్లాన్ చేసిన ట్రిప్ అట. మాల్డీవుల్లో వీరిద్దరిపై ఫోటో షూట్ నిర్వహించారట. అందుకోసమే విజయ్ దేవరకొండ,రష్మిక మండన మాల్దీవులకు అర్జెంటుగా వెళ్లారట. అదేంటి ప్రేమలో ఉన్నారు.. కాస్తంత ఏకాంతం కోసమే మాల్దీవులకు వెళ్లి ఉంటారు అనుకున్నాం అంటారా.. అసలు వీరిద్దరి మధ్య ఏ రిలేషన్ ఉంది అనేది ఇప్పటికీ ఎవరికి అర్ధం కాని విషయం. దేవరకొండ ఏమో తన లవ్ స్టోరీ గురించి ఇప్పుడు చెప్పే టైమ్ కాదు అంటాడు. మరో వైపు రష్మిక ఏమో విజయ్ తనకు బెస్ట్ ఫ్రెండ్ అని చెబుతుంది. ఇండియా వైడ్ గా డిజాస్టర్ అయిన లైగర్ తనకు బాగా నచ్చిందని, మాస్ క్యారెక్టర్ ను విజయ్ ఇష్టపడి చేసాడని, బాడీ బాగా బిల్డ్ చేసాడని పొగడ్తల వర్షం కురిపిస్తుంది. విజయ్, రష్మిక మధ్య ఏం ఉందో ఏం లేదో తేలిపోతే ఒక పని అయిపోతుంది కదా అనుకుంటున్న బ్యాచ్ ఇప్పుడు ఎక్కువగా యాక్టివ్ గా ఉంది. మాల్దీవుల్ల నుంచి తిరిగొచ్చిన విజయ్ ఇమిడియెట్ గా ఖుషి షూటింగ్ లో పాల్గొనబోతున్నాడు. ఇక రష్మిక పుష్ప2 సెట్స్ లోకి అడుగుపెట్టబోతోంది.