బాక్సాఫీస్ కు యశోద ఫీవర్
కష్టకాలంలో గొప్ప రిలీఫ్
యశోద రిలీజ్ కు సమంత స్థాయి వేరు. ఇఫ్పుడు అమె స్థాయి వేరు. ఎందుకంటే ఇప్పుడు ఈ లేడీ సూపర్ స్టార్ ప్యాన్ ఇండియా లేడీ సూపర్ స్టార్ గా మారింది. ఇండియా వైడ్ గా యశోద అందుకుంటున్న ఆదరణ అందుకు నిదర్శనం.
సరోగసీ స్కామ్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రంలో సమంత నటనపై ప్రశంసల వర్షం కురుస్తోంది. సినిమాలో అక్కడక్కడా గ్రాఫ్ పడిపోయినా సమంత తనదైన పెర్ఫామెన్స్ తో ఆడియెన్స్ ను ఎంటర్ టైన్ చేయడం. రివ్యూవర్స్ అందరూ సామ్ నటన గురించే ప్రత్యేకంగా చెప్పుకు రావడం ఆమెకు పెద్ద రిలీఫ్. మయోసైటీస్ బారిన పడిన సమంతకు, ఈ సినిమాను ప్రమోట్ చేసేంత ఓపిక కూడా లేదు. అయినప్పటికీ తన సినిమాపై నమ్మకంతో, మొండిగా తెలుగు వర్షన్ కు డబ్బింగ్ చెప్పడమే కాదు. సుమతో కలసి ఓ ఇంటర్వ్యూ కూడా ఇచ్చింది. ఒక్క ప్రీ రిలీజ్ ఈవెంట్ లేదు. ఫ్యాన్స్ మీట్ లేదు. కేవలం తన సినిమాలో కంటెంట్ మీద నమ్మకంతోనే, ఈ రోజు సినిమాను థియేటర్ లోకి తీసుకొచ్చింది సమంత. ఆ నమ్మకమే నిజమైంది. ఈ సినిమా ఫస్ట్ డే కలెక్షన్స్ దేశంలో ఓ మీడియం రేంజ్ స్టార్ హీరో రేంజ్ లో ఉండనుందని సమాచారం. కేవలం 15 కోట్ల లోపు థియేట్రికల్ బిజినెస్ తో యశోద బాక్సాఫీస్ బరిలోకి దిగింది. ఈ సినిమాకు వచ్చిన పాజిటవ్ టాక్ తో , పైగా ప్యాన్ ఇండియా మార్కెట్ లో ఈ మూవీకి మంచి రివ్యూస్ రావడంతో యశోద ఈజీగా హిట్ నుంచి సూపర్ హిట్ దశకు చేరుకుంటుంది అనడంలో ఎలాంటి సందేహం లేదంటున్నారు ట్రేడ్ పండితులు.