వేమన విగ్రహం తొలగించారంటూ ఎల్లోమీడియా దుష్ప్రచారం
అసలు అక్కడ ఏం జరిగింది ?
ఆంధ్రప్రదేశ్‌లో ప్రతిపక్షాలు ఎంతగా దిగజారిపోయాయి అంటే అసత్యాలలకు అర్థసత్యాలకు రంగులు పూసి రాష్ట్రంలో ఏదో జరిగిపోతోందని ప్రజలను నమ్మించే ప్రయత్నం చేస్తున్నాయి. ఏమూల ఏం జరిగినా పెద్ద నోరేసుకుని ఎల్లోమీడియా అండతో రచ్చ రచ్చ చేస్తున్నాయి. విపక్షాలు మూకుమ్మడిగా చేస్తున్న ఈ తరహా దాడులను ఎదుర్కోవడంలో వైసీపీ చేతులెత్తేసిందనే చెప్పవచ్చు. తాజాగా కడపలో యోగి వేమన యూనివర్శిటీలో వేమన విగ్రహాన్ని తొలగించి వైఎస్ఆర్ విగ్రహం పెట్టారని ఆంధ్రజ్యోతి, ఈనాడు కూడబలుక్కుని ఒక వార్త రాశాయి. ఇంకేముంది ప్రభుత్వంపై సోషల్ మీడియాలో నెటిజన్లు దుమ్మెత్తిపోస్తున్నారు. టీడీపీ శ్రేణులు దీన్ని బాగా ప్రచారం చేశాయి. ఇటీవల ఎన్టీయార్ హెల్త్ యూనివర్సిటీ పేరును డాక్టర్ వైఎస్ఆర్ హెల్త్ యూనివర్సిటీగా మార్చినప్పుడు ఎంత రచ్చ జరిగిందో ఎవరూ మర్చిపోలేదు. ఇంతలో మళ్లీ ఇదొక ఇష్యూ ముందుకొచ్చింది. నిజంగానే యోగి వేమన విగ్రహం తొలగించి వైఎస్ఆర్ విగ్రహం పెట్టారా, వేమన విగ్రహాన్ని ఏం చేశారు.
అసలు అక్కడ ఏం జరిగిందంటే కడప జిల్లాలో యోగి వేమన యూనివర్సిటీని 2006లో వైఎస్ ముఖ్యమంత్రిగా వున్న సమయంలో నెలకొల్పారు. ఇప్పుడు అక్కడ కొన్ని అభివృద్ధి పనులు జరుగుతున్నాయి. యూనివర్సిటీలో రెండు లేన్లుగా ఉన్న ఎంట్రన్సు రోడ్డును నాలుగు లేన్లుగా విస్తరించారు. ఒక యూనివర్సిటీకి అనుబంధ పీజీ సెంటర్‌గా ఉన్న సంస్థ ఎంట్రన్స్ గేట్‌ను అద్భుతంగా తీర్చిదిద్దారు. ఆ గేటు ఎదురుగా ఒక విగ్రహం పెట్టాలనుకున్నారు. వేమన సర్కిల్లో ఉన్న విగ్రహాన్ని తీసుకొచ్చి ఎంట్రన్స్ దగ్గర పెట్టారు. దీంతో వేమన సర్కిల్ బోసిపోయినట్లు కనిపించింది. అందుకని అక్కడ లోపల సర్ సి.వి. రామన్ బ్లాక్ దగ్గర ఉన్న వైఎస్ఆర్ విగ్రహం తీసుకొచ్చి పెట్టారు. కానీ ఎల్లోమీడియా ఏం చేసిందంటే ఎంట్రన్స్ గేటు ఎదురుగా వేమన విగ్రహాన్ని పెట్టిన విషయం ప్రస్తావించకుండా వేమన విగ్రహం తీసేసి వైఎస్ఆర్ విగ్రహం పెట్టారంటూ దుష్ప్రచారం మొదలెట్టింది. దాంతో విమర్శలు వెల్లువెత్తాయి. వాస్తవాలను ప్రజలకు చేరవేయాల్సిన మీడియా ఈ విధంగా అర్థసత్యాలను ప్రచారం చేస్తూ పాతాళంలోకి దిగజారిపోయాయి.