రక్తదానం చేయడం అంటే ప్రాణదానం చేసినట్లే ఒక రక్త దానం ముగ్గురి ప్రాణాలను కాపాడగలదు. మనం చేసే రక్తదానం ఇతరులను బ్రతికించగలదు అంటే అది చాలా సంతోషాన్ని ఇచ్చే విషయం అయితే కొందరు భయంతో నాకే బలం లేదు సన్నగా ఉన్నాను నేనేo ఇస్తాను అనుకుంటారు .ఇంకొందరు వీక్ అయిపోతామని క భయపడతారు ఎలాంటి నీడిల్స్ వాడతారో ఎందుకు వచ్చినా రిస్క్ అని కొంతమంది రక్తదానం చేయడానికి వెనకాడతారు కానీ ఇవన్నీ కూడా అపోహలే. 18 సంవత్సరాల నుండి 60 సంవత్సరాల వరకు వయసు ఉన్నవారు, ఆరోగ్య సమస్యలు లేనివారు తప్పకుండా రక్తదానం చేయడం వారికి కూడా ఎంతో మంచిది
రక్తదానం వల్ల శరీరంలో అదనంగా ఉన్న ఐరన్ స్థాయి తగ్గుతుంది తద్వారా రక్తనాళాలు వ్యాకోచించి రక్త ప్రసరణ మెరుగు పడుతుంది దీనివల్ల హార్ట్ ఎటాక్ రిస్క్ తగ్గుతుంది. మహిళలకు పీరియడ్స్ సమయంలో కొంత రక్తం పోతుంది కాబట్టి వారికి ఈ కారణంగానే హార్ట్ ఎటాక్ రిస్క్ కూడా తక్కువగా ఉంటుంది పురుషులు రక్తదానం చేయడం వల్ల హార్ట్ ఎటాక్ రిస్క్ ను తగ్గించుకోవచ్చు
రక్తదానం చేశాక శరీరం తిరిగి కొత్త కణాలను ఉత్పత్తి చేసుకుంటుంది దీనివల్ల కొత్త రక్త కణాలు సామర్థ్యం పెరుగుతుంది కొన్ని ఇన్ఫెక్షన్స్ కూడా తగ్గుతాయి రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి ఎక్కువగా ఉన్నట్లయితే రక్త దానం చేయాలి దీనివల్ల రక్తంలో గాడత తగ్గి ,రక్తం గడ్డ కట్టడం, స్ట్రోక్ సమస్యలు తగ్గుతాయి
రక్తంలో ఐరన్ పేర్కోవడం వల్ల హెమక్రోమోటోసిస్ అనే వ్యాధి వస్తుంది రక్తదానం చేయడం వల్ల ఈ వ్యాధి రాదు.
రక్తం తీసుకునేటప్పుడు దాతకు బేబీ చూడడం బరువు చెక్ చేయడం లాంటివి చేస్తారు. అన్ని సరిగా ఉంటేనే రక్తం తీసుకుంటారు. అలాగే ఇచ్చిన రక్తాన్ని పరీక్షించినాకే అవసరమైన వారికి ఇస్తారు కాబట్టి ఉచిత వైద్య పరీక్షలు కూడా జరుపబడతాయి. డిస్పోజబుల్ నీడిల్స్ వాడుతున్నారు కాబట్టి మనకి ఏమైనా జబ్బులు వస్తాయేమో అని అనుమాన పడాల్సిన అవసరం లేదు. కాబట్టి ఆరోగ్యవంతులైన ప్రతి ఒక్కరు మూడు నెలలకు ఒకసారి రక్తదానం చేయవచ్చు
మరిన్ని వార్తలకు ఎక్కడ క్లిక్ చేయండి
మరిన్ని వీడియోలకు ఎక్కడ క్లిక్ చేయండి…