ఎయిమ్స్ కోసం రాయ‌చూర్ ప్ర‌జ‌ల ర‌క్త‌త‌ర్ప‌ణం

By KTV Telugu On 25 January, 2023
image

అత్యున్న‌త ప్ర‌మాణాల‌తో జాతీయ‌స్థాయి వైద్య‌కేంద్రం ఉండాల‌న్న రాయ్‌చూర్ ప్ర‌జ‌ల కోరిక నెర‌వేర‌డం లేదు. ప్ర‌జ‌ల ఆకాంక్ష‌ను చాటిచెబుతూ విద్యార్థులు, యువ‌కులు ర‌క్త‌త‌ర్ప‌ణం చేస్తున్నా ఈ ప్ర‌భుత్వాలు చ‌లించ‌డం లేదు. రాయ‌చూర్‌కి ఎయిమ్స్ కేటాయించాలంటూ రుధిరంతో లేఖ‌లు రాస్తోంది అక్క‌డి యువ‌త‌. ఈ మ‌హోద్య‌మంలో ఇప్ప‌టికే దాదాపు 20వేలమంది త‌మ ర‌క్తంతో లేఖ‌లు రాశారు. ఆ స్ఫూర్తి కొన‌సాగుతూనే ఉంది. ఎయిమ్స్ సాధ‌న‌కోసం అలుపెర‌గ‌కుండా సాగుతున్న ఉద్య‌మానికి మార్గ‌నిర్దేశ‌నం చేస్తూ పోరాటంలో ముందుంటున్నారు ప్ర‌జానేత రవి బోసరాజు.

దేశంలో ఎయిమ్స్ అంకురార్ప‌ణ ఇప్ప‌టిదికాదు. స్వాతంత్య్రానికి సంవ‌త్స‌ర‌కాలం ముందే 1946లోనే ఈ ఆలోచ‌న‌కు బీజంప‌డింది. త‌ర్వాత జవహర్‌లాల్ నేతృత్వంలోని ప్రభుత్వం ఢిల్లీలో మొద‌టి ఎయిమ్స్ ప్రారంభించింది. స్వాతంత్య్రానంతరం ఈ దేశానికి కాంగ్రెస్‌ చేసిన అతిపెద్ద సహకారం ఇదే. ఆ విష‌యాన్ని మ‌నం దేశం ఎప్ప‌టికీ మ‌రిచిపోదు. కళ్యాణ్ కర్ణాటకలోని ఆరు జిల్లాలకు రాయచూర్ జిల్లా కేంద్ర బిందువు. మొత్తం 20 ల‌క్ష‌ల జ‌నాభా ఉన్నా ఎలాంటి అధునాతన వైద్యం అందుబాటులో లేక రాయ‌చూర్‌ ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఏద‌న్నా అత్య‌వ‌స‌రం అయితే బెంగళూరు, హైదరాబాద్ వంటి పెద్ద నగరాలకు వెళ్లాల్సి వస్తోంది.

నీతి ఆయోగ్ నివేదిక ప్ర‌కారం రాయచూర్ జిల్లాను వెనుకబడిన ప్రాంతంగా గుర్తించి రాష్ట్రానికి అనేక అదనపు సౌకర్యాల కోసం కేంద్ర ప్రభుత్వం ప్ర‌తిపాదించింది. కానీ మాట‌లే త‌ప్ప చేత‌ల్లేవు. రాయ‌చూర్‌లో ఎలాంటి అభివృద్ధి పనులూ జరగలేదు. రాయ‌చూరు జిల్లాలో ఎయిమ్స్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ దాదాపు ఏడాదికాలంలో పోరాటం జ‌రుగుతున్నా ప్రభుత్వం, ఎమ్మెల్యేలు పట్టించుకోలేదు. ఎయిమ్స్‌ నిర్మాణానికి తాగునీరు, భూమి, విద్యుత్‌తో పాటు అన్ని వనరులూ ఈ ప్రాంతంలో ఉన్నా ప్రజాభీష్టాన్ని ఇంత‌వ‌ర‌కు మ‌న్నించ‌లేదు. రాయ‌చూరుకు ఎయిమ్స్‌ మంజూరైతే అన్ని జిల్లాలకు మేలు జరుగుతుంది. ఇది రాష్ట్రానికే త‌ల‌మానికంగా నిలుస్తుంది. అయినా ప్ర‌జ‌ల గోడు ఈ ప్ర‌భుత్వ చెవికి ఎక్క‌డంలేదు.

రాహుల్ గాంధీ భారత సమైక్యతా యాత్రలో రాయ‌చూరు జిల్లాకు ఎయిమ్స్ మంజూరు చేయాలన్న ప్ర‌జ‌ల కోరిక‌ను ఆయ‌న దృష్టికి తీసుకెళ్లారు. కాంగ్రెస్ రాష్ట్ర యువనేత రావి బోసరాజు ఈ చొర‌వ చూపారు. అటు కేంద్ర‌రాష్ట్ర ప్ర‌భుత్వాల‌కు కూడా ప‌దేప‌దే విన్న‌విస్తున్నా ఈ ప్రాంత ప్రజలను విస్మరిస్తున్నారు. అయినా రాయ‌చూర్‌కి ఎయిమ్స్ సాధించాల‌న్న సంక‌ల్పం స‌డ‌ల‌లేదు. ప్ర‌జ‌ల‌ప‌క్షాన నిరంత‌ర ప్ర‌య‌త్నం చేస్తూనే ఉన్నారు ర‌వి బోస‌రాజు. ఎమ్మెల్యేలు, మంత్రులు, సీఎంలు చివ‌రికి ప్ర‌ధానిని కూడా క‌లిసి రాయ‌చూర్ జిల్లాలో ప్రతిష్టాత్మకమైన ఎయిమ్స్‌ ఇన్‌స్టిట్యూట్ ఏర్పాటు చేయాలని కోరారు. రాష్ట్రంలో ప్రాంతీయ అభివృద్ధి అసమాన‌త‌లు తొలగించేందుకు రాయ‌చూర్ జిల్లాకు ఎయిమ్స్ మంజూరు చేయాలని ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తున్నారు.

ఎయిమ్స్ ఏర్పాటైతే అత్యున్న‌ద వైద్య‌సేవ‌లు అందుతాయి. వెనుకబడిన జిల్లాల విద్యార్థులు పోస్ట్ గ్రాడ్యుయేట్ వైద్య విద్యను అభ్యసించేందుకు వెసులుబాటు క‌లుగుతుంది. దీనికితోడు ఎయిమ్స్‌ ఏర్పాటుతో ఉపాధి అవకాశాలు కూడా పెరుగుతాయని ప్రజలు ఆశిస్తున్నారు. అందుకు ఎయిమ్స్‌కోసం 2022 మే 13నుంచి మొద‌లైన పోరాటం రోజురోజుకీ ఉధృతం అవుతోంది. ప్రభుత్వం నిర్ల‌క్ష్యంచేసే కొద్దీ పోరాట ప‌ట్టుద‌ల పెరుగుతోంది. చివ‌రికి ఈ సుదీర్ఘ పోరాటంతో ప్ర‌భుత్వంలో క‌ద‌లిక అనివార్యం అయ్యేలా ఉంది. కానీ రాయ‌చూర్‌కి ఎయిమ్స్ విష‌యంలో రాష్ట్ర‌ప్ర‌భుత్వ చిత్త‌శుద్ధిపై అనుమానాలున్నాయి. రాయచూర్‌కు ఎయిమ్స్‌ మంజూరుకు కృషి చేస్తానని చెబుతూనే ఇతర జిల్లాల పేర్లను కేంద్ర ప్రభుత్వానికి సిఫార్సు చేస్తూ సీఎం బసవరాజ్‌ బొమ్మై ఈ ప్రాంత ప్రజలను మోసం చేస్తున్నారన్నారు యువ‌నేత ర‌వి బోస‌రాజు. ఎవరెన్నిఅడ్డంకులు సృష్టించినా రాయ‌చూర్‌కి ఎయిమ్స్ సాధించేదాకా పోరాటం ఆగ‌దంటున్నారు.