నీకేం పనోయ్! ఆళ్లంతా మా బ్రాండ్ అంబాసిడర్లు!
నీవు నేర్పిన విద్యయే నీరజాక్షా అన్నట్లు…బీజేపీతో రాజకీయంగా తలపడుతూ కేజ్రీవాల్ తలపండిపోతోంది. బీజేపీ హిందూత్వ నినాదాన్ని తన స్టయిల్లో అందిపుచ్చుకున్నారు ఆమ్ఆద్మీ పార్టీ అధినేత. కాషాయం వేయలేదన్న మాటేగానీ కరడుగట్టిన హిందుత్వవాదినన్నట్లు సెంటిమెంట్ రాజేస్తున్నారు. కరెన్సీ నోట్లమీద గణేషుడు, లక్ష్మిదేవి ఫొటోలు ముద్రించాలన్న కేజ్రీవాల్ డిమాండ్‌తో బీజేపీ ఉలిక్కిపడింది.
హిందూత్వం తన డీఎన్ఏగా భావిస్తుంది బీజేపీ. దేవుళ్ల వ్యవహారమైనా, ఆలయాల అంశమైనా తనే ఓ అడుగు ముందుండాలనుకుంటుంది. అలాంటిది అందరి జేబుల్లో ఉండే కరెన్సీనోట్లపై కేజ్రీవాల్ సెంటిమెంట్ డైలాగులతో బీజేపీ డిఫెన్స్‌లో పడ్డా ఎటాక్ స్టార్ట్ చేసింది. కేజ్రీవాల్ డిమాండ్‌ని తప్పుపట్టలేరు. కేవలం ఎన్నికల ప్రయోజనాలకోసమే కేజ్రీవాల్ ఈ అంశాన్ని లేవనెత్తారని కౌంటర్లిస్తున్నారు కాషాయనేతలు.పండించటంతో
మహారాష్ట్ర బీజేపీ నేత మరో అడుగు ముందుకేశారు. కరెన్సీ నోట్లమీద మిగతా వారికంటే మరాఠా పోరాటయోధుడు, శివాజీ ఫొటో బాగుంటుందని ట్వీట్ చేశారు. శివాజీ బొమ్మతో రూ.200 నోటుని పెట్టి చూడండి ఎంత ముచ్చటగా ఉందో అంటున్నారు. కేజ్రీవాల్ ప్రతిపాదన బాగుందంటూనే లౌకికదేశంలో కరెన్సీ నోట్లపై దేవుళ్ల బొమ్మలు ముద్రించలేమని బీజేపీ ఎమ్మెల్యే ఓపీ శర్మ వ్యాఖ్యానించారు. బీజేపీని ఎలా ఇరిటేట్ చేయాలో కేజ్రీవాల్‌కి అనుభవపూర్వకంగా తెలిసొస్తోంది. ఆయన అమ్ములపొదిలో ఇలాంటి సెంటిమెంట్ అస్త్రాలు ఇంకెన్ని ఉన్నాయో!