గ్యాస్ బండ మీదేసుకున్న బీజేపీ ! ఇదే ఎన్నికల ఎజెండా అయితే ?

By KTV Telugu On 4 September, 2023
image

KTV TELUGU

గ్యాస్ సిలిండర్ దరను రెండు వందల రూపాయలు తగ్గిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. ఆ వెంటనే అందరికీ మనసులో ఒకటే గుర్తొచ్చి ఉంటుంది. కాంగ్రెస్ టైంలో ఎంత ఉండేది.. బీజేపీ సమయంలో ఎంత అయింది అనేదే గుర్తుకు వచ్చేది. అంతే కాదు బ్యాంక్ అకౌంట్‌లో పడే సబ్సిడీ నలబై రూపాయలు గుర్తొచ్చినప్పుడు కేంద్రంపై, బీజేపీ ప్రభుత్వంపై సగటు మధ్యతరగతి మనిషి పటపట పళ్లు కొరుక్కోకుండా ఉండరు. అయితే ఇప్పటి వరకూ జరిగిన ఏ ఎన్నికల్లోనూ అటు గ్యాస్ సిలిండర్ ధర కానీ.. ఇటు గ్యాస్ పెట్రోల్, డీజిల్ ధరలు కానీ ఎన్నికల ఎజెండా కాలేదు. విపక్ష పార్టీలు చాలా సార్లు ప్రయత్నించాయి కానీ.. ఆ ప్రాతిపదికగా ఓట్లు వేయలేదు. కానీ ఇప్పుడు బీజేపీ గ్యాస్ సిలిండర్ ధరను రెండు వందలు తగ్గించడంతో ప్రజలందరికీ అసలు విషయం గుర్తు చేసినట్లయింది. ఎన్నికలు వచ్చాయనే తగ్గిస్తున్నారు కదా అని అనడం ప్రారంభించారు. ఇప్పుడు గ్యాస్ బండకు.. పెట్రోల్ , డీజిల్ ధరల మంట తేల్చి విపక్షాలు ప్రజల్లో చర్చ పెట్టకుండా ఉంటాయా ?

దేశంలో ప్రతి మధ్యతరగతి కుటుంబం నెలకు గ్యాస్ లిండర్‌కు పన్నెండు వందలు ఖర్చు పెట్టుకోవాల్సి వస్తోంది. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వానికి పాపం అనిపించింది. అందుకే రెండు వందలు తగ్గిస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఇంతకాలం ప్రజల నుంచి ఆందోళన వ్యక్తమైనప్పటికీ పట్టించుకోని కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు ఎన్నికల ముంగిట ఈ నిర్ణయం తీసుకోవడంతో.. విమర్శలు ప్రారంభమయ్యాయి. ఎన్నికల్లో లబ్ధి పొందడమే లక్ష్యంగా గ్యాస్‌ ధరల తగ్గింపు నిర్ణయాన్ని నరేంద్రమోడీ ప్రభుత్వం ప్రకటించిందని అందరికీ తెలుసు. ఎన్నికలు ముగియగానే వడ్డీతో సహా వసూలు చేసుకుంటారన్న అనుమానాలు కూడా బలంగానే వినిపిస్తున్నాయి. దీనికి కారణం తొమ్మిదేళ్లుగా ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరే. గ్యాస్, పెట్రోల్, డీజిల్ మీద పన్నులతో కేంద్రం ప్రజల్ని పీల్చి పిప్పి చేస్తూ వస్తోంది.

కరోనా కారణంగా ప్రజలు ఆర్థికంగా చితికిపోయారు. ఆ సమయంలో ప్రజల్ని ఆదుకోవడానికి ఏ ప్రభుత్వమైనా ప్రజల పట్ల కాస్త సానుకూలతతో వ్యవహరించారు. కానీ కేంద్రంలోని నరేంద్రమోదీ ప్రభుత్వం పన్నులు వడ్డించింది. 2021 ఫిబ్రవరిలో వంట గ్యాస్ సిలిండర్ 694 రూపాయలుగా ఉంది. అప్పట్లో బ్యాంకు ఖాతాల్లో జమ అయ్యే సబ్సిడీ కనీసం 230 రూపాయలు ఉండేది. కానీ ఆ తర్వాత ప్రభుత్వ యాజమాన్యంలోని గ్యాస్ కంపెనీలు వంట గ్యాస్‌ ధరలను కనీసం పదిహేను సార్లు పెంచారు. 2014లో బీజేపీ అధికారంలోకి రాకముందు ఎల్పీజీ గ్యాస్‌ సిలిండర్‌ ధర 410 మాత్రమే. అందులో కూడా పేదలకు కొంత సబ్సిడీ లభించేది. ఇప్పుడు 2023లో గ్యాస్‌ సిలిండర్‌ ధర 1150 రూపాయలకతు చేరింది. బీజేపీ ప్రభుత్వం గ్యాస్‌ సబ్సిడీని దాదాపు పూర్తిగా తగ్గించింది. మొన్నటిదాకా గ్యాస్‌ రేట్లు తగ్గించాలని దేశవ్యాప్తంగా ప్రజలు డిమాండ్‌ చేస్తే అంతర్జాతీయ మార్కెట్‌ ప్రకారమే ధరలు పెంచామని బీజేపీ నేతలు చెబుతూ వచ్చారు. ఇప్పుడేమో ఎన్నికల ముంగిట తాము పెంచినదాంట్లో కొంచెం తగ్గించి మహిళలనుద్ధరించినట్టు చెప్పుకుంటు న్నారు.

గతంలో గ్యాస్‌ సిలిండర్‌కు సబ్సిడీ మినహాయించి వినియోగదారుల నుంచి ధర వసూలు చేసేవారు. అప్పట్లో 500 లోపే సిలిండర్‌ ధర ఉండేది. తర్వాత ధర పెరిగినా.. పెంచిన మొత్తం ధర వారి బ్యాంకు ఖాతాల్లో సబ్సిడీ రూపంలో డబ్బు జమయ్యేవి. సిలిండర్‌కు మొత్తం ధర చెల్లించినా.. సబ్సిడీ సొమ్ము బ్యాంకు ఖాతాలో జమ కావడం లేదు. కేవలం నలభై రూపాయలే జమ అవుతోంది. అంటే కాంగ్రెస్ పార్టీ దోచుకుంటోందని నానా తిట్లు తిట్టి.. ఆ పార్టీని హఠావో చేసినప్పుడు నాలుగు వందలు ఉన్న రేటు ఇప్పుడు పదకొండు వందలు అయింది. అప్పుడు సబ్సిడీ ఎత్తేసి బ్యాంకులో వేస్తామని కాంగ్రెస్ వారు అంటే మోడీ చేసిన పోరాటం ఆకర్షించింది. ఆయన వస్తే రేట్లు పెరగవని అనుకున్నారు. కానీ తొమ్మిదేళ్ల తర్వాత అది 12 వందలకు దగ్గరకు చేరింది. నగదు బదిలీ ప్రారంభించిన కొత్తలో గ్యాస్ సబ్సిడీ నాలుగు వందల పైనే వచ్చేది. కానీ ఇప్పుడు నలభై రూపాయలు వస్తోంది. ఎంత రేట్లు పెంచిాన అంతకంటే సబ్సిడీ పెరగడం లేదు. మధ్యలో గ్యాస్ సబ్సిడీ వదులుకోండని విస్తృత ప్రచారం చేశారు. పెరుగుతున్న ధరల భారంతో ఎవరూ గ్యాస్ సబ్సిడీని వదులుకోవడానికి సిద్ధపడలేదు. దాంతో అందరి సబ్సిడీని కత్తించేసింది.

పెరుగుతున్న నిత్యావసర వస్తవుల ధరలతో తిండి గింజలే భారం అనుకుంటే గ్యాస్ కూడా రేటు పెరిగింది. దీంతో గ్రామీణ ప్రాంతాల్లో గ్యాస్ వినియోగం పూర్తి స్థాయిలో తగ్గిపోతోంది. సిటీల్లో కూడా తగ్గిపోతోంది. ఇది నమ్మశక్యం కాని నిజం. ఆర్థిక రాజధాని ముంబైలో 21 శాతం కుటుంబాలు వంట గ్యాస్ వాడటం లేదు. దేశవ్యాప్తంగా పది శాతం కుటుంబాలు గ్యాస్ సిలిండర్ ను పక్కన పెట్టేశాయి. గ్యాస్ అనేది లగ్జరీగా మారిందని అక్కడి జనం అభిప్రాయం. అలాంటి వారందరికీ కేంద్రం చేసిన మోసం.. మోదీ సర్కార్ తెచ్చిన కష్టం మరోసారి గుర్తుకు తెచ్చారు.

గ్యాస్ బండలే కాదు.. పెట్రోల్, డీజిల్ ధరల గురించి చెప్పాల్సిన పని లేదు. ఇప్పుడు ఎన్నికలకు వాటి ధరలను కేంద్రం తగ్గించాలనుకోవడం ద్వారా.. ప్రజల్లో వాటిపై చర్చ పెట్టే అవకాశాన్ని ప్రతిపక్షాలకు బీజేపీ ఇచ్చినట్లయింది. వీటి ఆధారంగా ఎన్నికలు జరిగితే.. బీజేపి అసలు ప్లాన్ రివర్స్ అయినట్లవుతుంది.

దేశ ప్రజల ఆర్థిక ఆరోగ్యాన్ని, నిత్యావసర వస్తువుల ధరలను ప్రభావితం చేసేవి పెట్రోల్, డీజిల్ ధరలు. వీటి పై ధరలు పెంచడం ద్వారా.. ప్రజల జీవితాల్లో చాలా మార్పు వచ్చింది. ఖర్చులు పెరిగిపోాయయి. కానీ కేంద్రం మాత్రం తగ్గలేదు. కరోనా తర్వాత ప్రతీ రోజూ పావలా.. అర్థ పెంచుకుంటూ పోయి.. పెట్రోల్ రేటును 120 రూపాయలకు చేర్చింది. ఆ తర్వాత దీపావళి కానుక అని .. మరొకటి అని రెండు సార్లు రెండు పది రూపాయలు తగ్గించారు. కానీ..మళ్లీ పెంపు ద్వారా పది రూపాయలు కవర్ చేశారు. ఎలా చూసినా ఇప్పుడు రాష్ట్రాల పన్నులు కలిపి పెట్రోల్ ధర వంద నుంచి నూట పది రూపాయల వరకూ తేలుతోంది. కాంగ్రెస్ హయాంలో ఇది 70 రూపాయలే ఉండేది. అప్పట్లో రెండు లేదా మూడు రూపాయలు పెంచితే ప్రజలు , ప్రతిపక్ష పార్టీలు రోడ్డెక్కి ధర్నాలు చేసేవారు. ఇప్పుడు ఎవరికీ అంత తీలిక లేదు. ప్రజల నుంచి కేంద్రం ఈ పెట్రో పన్నుల ద్వారా ఖజానాకు చేర్చుుకుంటున్న మొత్తం నాలుగు లక్షల కోట్ల రూపాయల పైమాటే. పెట్రోల్ , డీజిల్ ఒక్క లీటర్ ధరలో అన్ని రకాల పన్నులు కలిపి అరవై శాతానికిపైగా ఉంటాయి అంటే… దేశ పౌరుడు ఎంతగా దోపిడీకి గురవుతున్నాడో అర్థం చేసుకోవచ్చు. కాంగ్రెస్ ప్రభుత్వాన్నే దోపిడీ అని చెప్పి బీజేపీ నేతలు అప్పట్లో ధర్నాలు చేసేవారు. అప్పుడు కాంగ్రెస్ చేసింది దోపిడీ అయితే.. ఇప్పుడు మోదీ సర్కార్ చేస్తోంది నిలువుదోపిడీ.

భావోద్వేగాల్లో ముంచెంత్తడం ద్వారానో.. దేశం కోసం ధర్మం కోసం అని నమ్మించడం ద్వారానో కానీ ఇంత కాలం ఈ విషయాలను ప్రజల్లో చర్చనీయాంశాలు కాకుండా బీజేపీ చూడగలిగింది. అందుకే ఎక్కడ ఎప్పుడు ఎన్నికలు జరిగినా విపక్షాలు గ్యాస్ బండ గురించి ఎంత ప్రచారం చేసినా హైలెట్ కాలేదు. దీనికి కారణం .. కేంద్రం ఈ అంశంపై గుంభనంగా ఉండటమే. ఎక్కువగా ప్రచారాంశం చేయకపోవడమే. కానీ ఈ సారి కేంద్రమే విపక్షాలకు అస్త్రం ఇచ్చింది. రెండు వందల రూపాయుల తగ్గించడం ద్వారా తాము తగ్గించామన్న ఓ తీపి కబురు చెప్పడం కన్నా భారీగా ఇప్పటికే దోచేశారు కదా అన్న ఓ సందేహం ప్రజల మనసుల్లోకి వస్తోంది. అంతే కాదు ఎన్నికల తర్వాత వడ్డతో సహా వసూలు చేస్తారని అంటున్నారు. నిజానికి గ్యాస్ బండ విషయంలో.. పార్టీలు చాలా వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నాయి. దాదాపుగా ప్రతి రాష్ట్రంలోనూ జరిగే ఎన్నికల్లో గ్యాస్ బండ హామీల్ని ఇస్తున్నాయి. కర్ణాటకలో కాంగ్రెస్ కు వర్కవుట్ అయింది. ఏపీలో టీడీపీ అవే హామీల్ని ఇచ్చింది. తెలంగాణలో కాంగ్రెస్ ఇస్తోంది.

కాంగ్రెస్ గ్యాస్ బండ ట్రాప్‌లో ఇప్పుడు బీజేపీ పడిందని అనుకోవచ్చు. ప్రజలు ఇదే అంశాన్ని హైలెట్ చేసుకుని పోలింగ్ బూత్‌కు వెళ్లేలా ప్రతిపక్షాలు చేసే చాన్స్ బీజేపీ ధరల తగ్గింపు ద్వారా ఇచ్చింది. మరి దీన్ని కాంగ్రెస్ వినియోగించుకోగలుగుతుందా లేదా అన్నది మాత్రం డౌటే

మరిన్ని వార్తలకు ఎక్కడ క్లిక్ చేయండి

మరిన్ని వీడియోలకు ఎక్కడ క్లిక్ చేయండి