రూ.8 లక్షల కోట్లు – చందమామ తెచ్చే సంపద ! Chandrayaan3

By KTV Telugu On 26 August, 2023
image

KTV TELUGU :-

భారతీయుల అకుంఠిత కృషి , పట్టుదల భారత్ ను ప్రపంచంలో సమున్నతంగా నిలబెడుతోంది. చంద్రుడ్ని అందుకునే లక్ష్యంతో ప్రారంభించిన చంద్రయాన్ (Chandrayaan3) ప్రయోగాల్లో మూడో భాగం సూపర్ సక్సెస్ అయింది. విక్రమ్ ల్యాండర్ (vikram lander) చంద్రుడి సౌత్ పోల్ పై సేఫ్ గా ల్యాండ్ అయింది. ఇదే ప్రాంతంలో ల్యాండింగ్ కోసం రష్యా అంతరిక్ష సంస్థ ప్రయోగించిన లూన్ ల్యాండర్ క్రాష్ కావడంతో.. విక్రమ్ పై ప్రపంచదేశాలన్నీ ఆసక్తి చూపించాయి.

విక్రమ్ చంద్రుడిపై సాప్ట్ గా ల్యాండయింది. రెండు వారాల పాటు చంద్రుడిపై ఉన్న పరిస్థితులను.. స్థితిగతులను అధ్యయనం చేయడానికి అవసరమైన ఫోటోలు.. మట్టి.. ఇతర వాతావరణ పరిస్థితల్ని అధ్యయనం చేస్తుంది. ఇంకా చాలా విజయాలు ముందున్నాయి . కానీ ఈ విజయంతో భారత్‌కు కలిగే లాభం ఎనిమిది లక్షల కోట్ల రూపాయలు.

ప్రపంచంలో అభివృద్ధి చెందిన దేశాలు.. వేల కోట్లు బడ్దెట్లు కేటాయించి పరిశోధనలు చేస్తున్నా… చంద్రునిపై ల్యాండ్ కావడమే దుర్లభం అవుతోంది. యాభై ఏళ్ల కింద అమెరికా మనుషుల్ని పంపింది. తర్వాత ఓ అబ్జేక్టును పెంపడానికి కూడా కష్టపడుతోంది. రష్యా వల్ల కావడం లేదు. చైనా కూడా గతంలోనే అన్నీ సాధించింది కానీ ఇప్పుడు సాధ్యం చేసుకోలేకపోతోంది. కానీ భారత్ మాత్రం వడివడిగా ముందుకెళ్తోంది. చంద్రయాన్ త్రీ విజయంలో ప్రపంచంలో స్పేస్ రంగంలో భారత్ బలమైనశక్తిగా అవతరించింది. ముందు ముందు .. తిరుగులేని స్థానానికి చేరుకోవడం ఖాయంగా కనిపిస్తోంది. చంద్రయాన్‌ విజయవంతం సాంకేతికంగానే కాక, ఆర్థికంగా భారత్‌ ఎంతో పురోగతిని సాధించినట్టు అయింది. అంతరిక్ష రంగంలో మన దేశం సరికొత్త చరి త్రను సృష్టించినట్టు అయింది. కానీ చంద్రునిపై అడుగుపెట్టే దశంలో మనం ఇంకా చాలా దశలను అధిగమించాల్సి ఉంది. కానీ ఈ దశలోకి అడుగుపెట్టినందునే భారత్ అంతరిక్ష వ్యాపార సామ్రాజన్యంలో కీలకమైన భాగం సొంతం చేసుకోతోంది.

  • చంద్రయాన్ విజయంతో అంతరిక్ష రంగంలో అగ్రగామిగా భారత్
  • విక్రమ్ సాఫ్ట్ ల్యాండింగ్ తో ఇక అంతరిక్ష ప్రయోగాలకు భారతే కీలకం
  • వెల్లువలా రానున్న పెట్టుబడులు -స్టార్టప్‌లు
  • చంద్రుడిపైకి మనుషుల్ని తీసుకెళ్లే ప్రాజెక్టులకు భారతే కీలకం
  • రూ. 8 లక్షల కోట్ల మేర స్పేస్ రంగంలో వ్యాపారం
  • భారత్ కు అన్ని విధాలుగా మేలు చేయనున్న ఇస్రో (ISRO) విజయం

మూన్ మిషన్ ద్వారా భారత్ సాధించిన విజయం చిన్నది కాదు. అసాధారణమైనది. ఇంకా చెప్పాలంటే రష్యా ను మించిన ఖ్యాతి భారత్‌కి దక్కనున్నది. రష్యా సాధించిన విజయాలన్నీ సోవియట్‌ యూనియన్‌ హయాంలో సాధించినవే. రష్యా స్వతంత్ర దేశంగా ఆవిర్భవించిన తర్వాత రాస్‌కాస్మోస్‌ చేపట్టిన ఏకైక మూన్‌ మిషన్‌ (Moon Mission) లూనా-25 ప్రయోగం విఫలమైంది. ఆ ప్రయోగం విఫలమైన కొద్ది రోజుల్లోనే బారత్ అనుకున్నది సాధించింది. చంద్రుని వద్దకు ప్రయోగాలకు ఇప్పటి వరకు 13 దేశాలు 146 ప్రయత్నా లు చేశాయి. వీటిలో 69 మాత్రమే విజయవంతం అయ్యాయి. చంద్రుడిపై అన్వేషణల విషయంలో అగ్రరాజ్యానికే 15 వైఫల్యాలు ఎదురయ్యాయి. మన దేశం జరిపిన మూడు ప్రయోగాల్లో ఒక్కటే విఫలమైంది. ఇప్పుడు మూడో ప్రయోగం విజయవంతం అయింది.

ఈ విజయంతో..

అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో ఇప్పటికే వ్యాపారపరంగా లాభాలను ఆర్జిస్తోంది. అంతరిక్ష రంగంలో భారత్‌ తయారు చేసే హార్డ్‌ వేర్‌కు ప్రపంచవ్యాప్తంగా మార్కెట్ పెరుగుతుంది. వాటి ఆధారంగా తయారీ పరిశ్రమల్లో పెట్టుబడుల అవకాశాలు బాగా పెరుగుతాయి. భారత్‌ని తృతీయ ఆర్థిక శక్తిగా నిలబెట్టేందుకు మన ప్రభుత్వం సాగిస్తున్న ప్రయత్నాలు సఫలం అవుతాయి. మన దేశం ఇంతవరకూ 34 దేశాలకు చెందిన 381 ఉపగ్రహాలను అంతరిక్షంలోకి పంపింది. వీటి ద్వారా 279 మిలియన్‌ డాలర్లను ఆర్జించింది.

చంద్ర యాన్‌ ప్రయోజనాల్లో ముఖ్యమైనది చంద్రుని ఉపరి తలంపై అన్వేషణ. ఇందుకోసం ఇస్రో ఎంతో శ్రమి స్తోంది. ఎన్నో పరిశోధనలు చేస్తోంది.చంద్రునిపై నీటి జాడలున్నాయని చంద్రయాన్‌-1 ప్రయోగంలో తేలింది. దాంతో జాబిలిపై మనుగడకు అవకాశాలపై ఆశలు చిగురించాయి. భూమండలానికి ప్రత్యామ్నా యంగా మరొక ఆవాసం కోసం మానవుడి అన్వేషణలో ముందగుడు పడినట్లయింది. చంద్రుడి ఉపరితలం, అక్కడి వాతావరణం స్థితిగతులను అధ్యయనం చేయడమే ఇప్పుడు జరుగుతున్న మూన్‌ మిషన్ల ప్రధాన లక్ష్యాలు. చంద్రుని ఉపరితలం వలసరాజ్యంగా ఉపయో గ పడుతుందా అనే దానిపై కూడా పరిశోధనలు సాగుతు న్నాయి.

భూమికి అతి దగ్గరగా ఉన్న గ్రహం కావడం వల్ల చంద్రునిపై ఖనిజాలు, ఇతర అమూల్య నిక్షేపాలను కనుగొంటే భారత్‌కి ఎంతో ఉపయోగకరం అవుతాయి. చంద్రయాన్‌-3 అక్కడి సమాచారాన్ని మనకి పంపిస్తుంది. చంద్రుని దక్షిణ ధ్రువంలో లభించే రాళ్ళు, మట్టి కొన్ని లక్షల క్రితం నాటి పరిస్థితులను ఆవిష్కరించే అవకాశం ఉంది. చంద్రునితో భూమికి గల సంబంధాలను కనుగొనేందుకు ఇవి ఎంతో ఉపయోగపడతాయి. ఎలా ఉపయోగపడతాయన్నది అంచనా వేయడం కష్టం. కానీ మానవుల జీవనాన్ని సమూలంగా మార్చే అవకాశం ఉంది.

చంద్రుడిపైకి రోవర్లు పంపించడానికే అగ్రనేతలు ఫెయిలవుతున్నాయి.కానీ మనం ముందడుగు వేశాం. అంతరిక్షం దిశగా మన దేశమే ముందుకెళ్తోంది. మరి మనషుల్నీ తీసుకెళ్లగలమా ?

ఇస్రో చంద్రయాన్‌ ప్రయోగాలు చేపట్టింది కేవలం రోవర్లు, ల్యాండర్లను చంద్రుడి మీదకు పంపించడానికి మాత్రమే కాదు. ఎప్పటికైనా మానవుల్ని కూడా చంద్రుడి మీదకు పంపాలనే బలీయమైన సంకల్పంతో భారత అంతరిక్ష కేంద్రం అడుగులు వేస్తోంది. కానీ, ఈ ప్రయత్నం అనుకున్నంత సులభం కాదు. అందుకే ఒక్కో విజయం సాధిస్తూ ఇస్రో ముందు కెళ్తోంది. తదుపరి ప్రయోగాల్లో మానవ సహత అంతరిక్ష నౌక ను పంపి స్తారు. ఈ దిశగా అమెరికా కూడా వేగంగా అడుగులు వేస్తోంది.ఇందుకోసం ఆర్టెమిస్‌ను మరింత సమర్థవం తంగా తీర్చిదిద్దుతోంది.

గతంలో వ్యోమ గాములను చంద్రుడిపైకి పంపిన నాసా 2025 నాటికి దక్షిణ్రధువంపై అడుగిడేలా ప్రణాళికలు సిద్ధంచేసింది. అంటే.. భారత్ తో పాటు ప్రపంచంలోని అగ్రదేశాలు కూడా ఈ మిషన్ లో పోటీ పడుతున్నాయి. ఆయా దేశాలకు ఉన్న వనరులు వేరు.. మన దేశానికి ఉన్న వనరులు వేరు. అమెరికాలో అమెజాన్, టెస్లా ఓనర్లు ప్రత్యేకంగా మూన్ మిషన్లు చేపట్టి నాసాతో కలిసి పని చేస్తున్నారు. కానీ భారత్ లో అంతగా అంతరిక్షంపై పెట్టుబడి పెట్టే వ్యాపారవేత్తలు రెడీ కాలేదు. ఇప్పుడు బయట నుంచి పెట్టుబడుల వెల్లువ వస్తుంది. అంతర్గత స్టార్టప్‌లు పెరుగుతాయి. మొత్తంగా ఎనిమిది లక్షల కోట్ల రూపాయల మేర వ్యాపారం జరుగుతుందని అంచనాలుఉన్నాయి.

అయితే భారత్ అంతరిక్ష మార్కెట్ లో ఎవరూ ఊహించనంత గొప్ప స్థానం పొంతబోతోంది. మన ఓ రకంగా స్పేస్ విషయంలో మేడిన్ ఇండియా బ్రాండ్ నే ముందుకు తీసుకెళ్తున్నాం. పరుగెల్తి పాలు తాగడం కన్నా నిలబడి నీళ్లు తాగడం మంచిదన్న సామెతను ఇస్రో పాటిస్తోంది. పరిశోధనలు చేసి.. మేడిన్ ఇండియా బ్రాండ్ లతోనే అంతరిక్ష ప్రయోగాలు చేస్తోంది. అనూహ్యమైన విజయాలు సాధిస్తోంది. అందుకే.. భారత్ ఇవ్వబోయే అంతరిక్ష సేవల పట్ల ప్రపంచం అంతా ఎదురు చూస్తోంది. మూన్ మిషన్ లో ఇక భారత్ పాత్రను ఎవరూ తక్కువ చేయలేరు. ఇంకా చెప్పాలంటే.. మనమే చంద్రునపై చేరుకునే మిషన్లకు నాయకత్వం వహించవచ్చు. అంటే.. ఇటు సాంకేతిక పరంగా..అటు వ్యాపార పరంగా దేశం అద్భుతమైన ప్రగతి సాధించడానికి ముందడుగుపడినట్లే.

ఇస్రో విజయం.. దేశం సాధించిన విజయం. ప్రపంచంలో భారత్ ను ఆకాశం అంత ఎత్తుకు తీసుకెళ్లిన విజయం. ఈ విజయంతో భారత్ వాణిజ్య పరంగానే కాదు.. సాంకేతికంగానూ అగ్రనేతలను దాటిపోతుంది. ఇది భారతీయులుగా మనందరికీ గర్వకారణమే..

మరిన్ని వార్తలకు ఎక్కడ క్లిక్ చేయండి

మరిన్ని వీడియోలకు ఎక్కడ క్లిక్ చేయండి