Ktv Telugu : రాజకీయాల్లో అధికారం అనేది ఎవరికైనా అంతిమ లక్ష్యం. ఆ అధికారం సాధించడమే విజయం. నైతిక విజయాలు.. ఓడినా ప్రజల మనసుల్ని గెలుచుకున్నాం వంటి మాటాలకు పైసా విలువ ఉండదు. అందుకే గెలుపు కోసం రాజకీయ పార్టీలు ఎన్ని అడ్డదారులైనా తొక్కుతాయి. అధికారంలో ఉండే పార్టీలకు ఇది మరింత అడ్వాంటేజ్ … వారు విపక్షాలను అణిచివేయవచ్చు. అయితే మన దేశంలో విపక్షాలపై అధికార పార్టీలు కక్ష సాధింపులకు పాల్పడితే గతంలో ప్రజల సానుభూతి లభించేది. కానీ ఇప్పుడు అలాంటిదేమీ లేదు. అందుకే తమకు వ్యతిరేకంగా ఉన్న పార్టీలను వ్యవస్థలను ఉపయోగించి అణిచి వేస్తున్నాయి. ఇలాంటి ప్రయోగాల్లో ప్రధాని మోదీ ఇప్పుడు ఎవరూ ఊహించనంత వేగంగా పావులు కదుపుతున్నారు.
జూన్23న పట్నాలో కాంగ్రెస్‌తో సహా 15 ప్రతిపక్ష పార్టీలు సమావేశం అయిన పదిరోజుల్లోనే శరద్ పవార్ నేతృత్వంలోని ఎన్‌సీపీని రెండు ముక్కలు అయింది. దీని వెనుక ఉన్నది బీజేపీనేనని చెప్పాల్సిన పనిలేదు. కురువృద్ధ నేత శరద్ పవార్ పట్టు రోజురోజుకూ బలహీనపడుతున్న తరుణంలో ఎన్‌సీపీని చీల్చడం ద్వారా మహారాష్ట్రలో బీజేపీని మరింత శక్తిమంతమైన పార్టీగా మార్చడమే బీజేపీ ధ్యేయం. తర్వాత బీహార్‌లోని జనతా దళ్ యునైటెడ్ వంతు అని చెబుతున్నారు. నితీష్ కుమార్ .. ప్రధాని మోదీకి వ్యతిరేకంగా బలమైన ప్రాంతీయ పార్టీల కూటమి ఏర్పాటు చేయాలనకుంటున్నారు. కానీ ఆయనకు పార్టీ నీడ లేకుండా చేయాలని బీజేపీ అనుకుంటోంది. కూటమిలో ఉన్న మిగతా పార్టీలకూ అదే ముప్పు పొంచి ఉంది. దీంతో బెంగళూరులో జరగాలనుకుంటున్న రెండో విడత బీజేపీయేతర పక్షాల సమావేశం జరుగుతుందా లేదా అన్న సందేహం ప్రారంభమయింది.
సర్జికల్ స్ట్రయిక్ .. ఈ పదం ప్రధాని నరేంద్రమోదీకి బాగా ఇష్టం. ఇప్పుడు దేశంలో తమకు వ్యతిరేకమైన పార్టీలపై ఈ సర్జికల్ స్ట్రైక్ చేస్తున్నారు. తర్వాత సర్జికల్ స్ట్రైక్ బీహార్ మీద పడే ప్రమాదాన్ని ఏమాత్రం తోసి పుచ్చలేము. ప్రదాని మోదీ గురించి బాగా తెలుసు కాబట్టి నితీష్ కుమార్.. మళ్లి ఎన్డీయే లోకి వెళ్లే అవకాశాల గురించి అనుమానాలు వ్యక్తమవు తున్నాయి. అదే జరిగితే ప్రతిపక్ష ఐక్యతా యత్నాల దిశ, దశ మారే అవకాశాలున్నాయి. ఒక వంక కమలనాథులు వివిధ రాష్ట్రాల్లో ఎన్నికల ఏర్పాట్ల కు పార్టీ ని సన్నద్ధం చేస్తూనే మరోవంక బీజేపీయేతర ప్రభు త్వాల్లో అమలు పరచాల్సిన వ్యూహాలపై కసరత్తు చేస్తు న్నారు. ముఖ్యం గా ప్రధాని మోడీ అమెరికా నుంచి వచ్చీ రాగానే ఎన్నిక ల సమరాంగణంలోకి దూకేశారు. దేశం లోని ప్రాంతీ య పార్టీల మీద విమర్శనాస్త్రాలు ఎక్కుపెట్టి ప్రమాదకర సంకేతాలిచ్చారు.
అయితే ప్రధానమంత్రి నరేంద్రమోదీ వ్యూహంలో అన్ని ప్రాంతీయ పార్టీలు టార్గెట్ గా లేవు. తమతో సన్నిహిత సంబంధాలు పెట్టుకుని.. పరోక్షంగా అయినా తమ వైపే ఉంటామని సామంతులుగా మసలుకుంటామని సంకేతాలిస్తే చాలు.. క్షమించాం పోండి అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. బీజేపీపై యుద్ధం ప్రకటించి.. చివరికి తెల్ల జెండా ఎగురవేసిన బీఆర్ఎస్ ను కూడా బీజేపీ చల్లగా చూస్తోదంని ఇటీవలి పరిణామాలు నిరూపిస్తున్నాయి. అదే సమయంలో తమకు నమ్మకమైన అప్రకటిత మిత్రపక్ష పార్టీగా ఉంటున్న వైసీపీ జోలికి వెళ్లడం లేదు. ఆ పార్టీని ఎన్ని కేసులు వెంటాడుతున్నా..చివరికి కుటుంబసభ్యుడ్ని అత్యంత దారుణంగా హత్య చేసిన విషయంలో తీవ్ర అభియోగాలు ఎదుర్కొంటన్నా.. దిలాసాగా ఉంటున్నారు ఆ పార్టీ నేతలు. ఇక అదే రాష్ట్రంలోని తెలుగుదేశం పార్టీ.. మోదీతో పెట్టుకోవడం ఎందుకని.. జగన్ తో తలపడితే చాలని ఫిక్స్ అయిపోయింది. తాము మోదీ విధానాలను సమర్థిస్తామని చంద్రబాబు నేరుగా ప్రకటించారు. బీజేపీ వ్యతిరేక కార్యకలాపాల్లో పాల్గొనడం లేదు. దీంతో బీజేపీ ఆ పార్టీని కూడా ఇప్పటికైతే సామంతుల కేటగిరిలోనే చేర్చుకుంది. రేపేం చేస్తుందో తెలియదు.
ప్రతిపక్ష పార్టీలు అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో ముఖ్యంగా తమను వ్యతిరేకిస్తున్న ప్రభుత్వాలు ఉన్న చోట పట్టు నిరూపించుకోవడానికి కేంద్రం ప్రజలు ఏమనుకుంటారో అని మొహమాట పడి తమ వ్యూహాలను మార్చుకోవడం లేదు. జేపీ ఎంతటి సాహసోపేత నిర్ణయా లకై నా వెనుకడుగు వేయడం లేదు. కేంద్ర దర్యాప్తు సంస్థలు మాత్రమే కాదు.. రాజకీయంగానూ సర్జికల్ స్ట్రైక్స్ చేస్తున్నారు. మరో పది నెలల్లో జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో మూడో సారి గెలవడం అనేది మాత్రమే ప్రధాని మోదీ ముందు ఉన్న లక్ష్యం. దానికి నైతికత.. అనైతికత అనే అడ్డంకుల్ని ఆయన తొలగించుకున్నారు. రాజకీయాల్లో విజయమే మాట్లాడుతుందని.. ఆయనకు తెలుసు. అందుకే మోదీ ఇప్పుడు విశ్వరూపం చూపిస్తున్నారు. ఇందులో నలిగిపోయేవాళ్లు ఎంత మంది.. తట్టుకుని నిలబడేవాళ్లు ఎంత మందనేది ముందు ముందు తెలుస్తుంది.
మరిన్ని వార్తలకు ఎక్కడ క్లిక్ చేయండి
మరిన్ని వీడియోలకు ఎక్కడ క్లిక్ చేయండి