కర్ణాటకలో రాజకీయ నేతల రాసలీలల ఎపిసోడ్ లేకుండా ఎన్నికలు జరగవు. గతంలో అసెంబ్లీలోనే ఎమ్మెల్యేలు బ్లూ ఫిల్మ్ చూస్తూ దొరికిపోయారు. తర్వాత మంత్రిగా ఉండి రమేష్ జార్కిహోళి అనే నేత చేసిన రాసలీలు దేశవ్యాప్తంగా హైలెట్ అయ్యాయి. మీ వీడియోలు ఉన్నాయంటే.. మీ వీడియోలు ఉన్నాయని నేతలు పరస్పరం ఆరోపించుకుంటూనే ఉంటారు. తాజాగా ఈ జాబితాలోకి హసన్ ఎంపీ, దేవేగౌడ మనవడు ప్రజ్వల్ రేవణ్ణ చేరారు. ఆయన బంధువైన ఓ మహిళతో లీలులు వీడియోలుగా బయటకు వచ్చాయి. దాంతో ఆమె తనను వేధించారని కేసు పెట్టింది. దీంతో ప్రజ్వల్ జర్మనీ పారిపోయారు. ఇప్పుడు ఆయన లీలల గురించి కథలు కథలుగా ప్రచారంలోకి వస్తున్నాయి. పెన్ డ్రైవ్ వ్యవహారం దుమారం రేపుతోంది. ఇదంతా బీజేపీకి అనుకోని కష్టం వచ్చేలా చేసింది.
మాజీ ప్రధాని దేవెగౌడ మనువడి రాసలీలు దేశ వ్యాప్తంగా పెను దుమారాన్ని రేపుతున్నాయి. మాజీ సీఎం కుమార స్వామి సోదరుడి కుమారుడు ప్రజ్వల్ రేవణ్ణకు సంబంధించిన పోలీసుల విచారణలో వెయ్యికిపైగా అమ్మాయిలతో శంగారంలో పాల్గొన్న వీడియోలు బయటపడ్డాయన్న ప్రచారం జరుగుతోంది. యువతులను లొంగదీసుకుని లైంగిక కోరికలు తీర్చుకోవడమే టార్గెట్‌గా ఎంతో మంది మహిళల జీవితాలను నాశనం చేశాడని ఆరోపణలు వస్తున్నాయి. వారి ఆరోపణలకు బలం చేకూరుస్తూ వీడియోలు బయటపడటం జేడీఎస్‌లో కలకలం రేపుతోంది. మాజీ మంత్రి హెచ్‌డి రేవణ్ణ, ఎంపీ ప్రజ్వల్‌పై లైంగిక దౌర్జన్యం కేసు నమోదు చేసిన బాధిత మహిళ వారికి బంధువే. ప్రజ్వల్ తల్లి భవానీకి బాధితురాలు స్వయానా మేనత్త కుమార్తె. తననే కాకుండా తన కుమార్తెనూ ప్రజ్వల్ వదల్లేదని.. అతనికి భయపడి ఫోన్ నంబర్ బ్లాక్ చేసిందని పోలీసులకు ఫిర్యాదు చేసింది.
ప్రజ్వల్ వీడియోలు తీసి వాటి ఆధారంగా అమ్మాయిలను లోబరుచుకునేవాడని కొందరు ఆరోపిస్తున్నారు. అలా ఏకంగా మూడు వేలకుపైగా వీడియోలు తీశాడని.. వెయ్యి మందికిపైగా మహిళలపై అత్యాచారానికి పాల్పడినట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. జేెడీఎస్ ఎంపీ రాసలీల ఆరోపణలపై కర్ణాటక ప్రభుత్వం సిట్ ఏర్పాటు చేసింది. ఎడీజీపీ బికె సింగ్ నేతత్వంలో ప్రత్యేక దర్యాప్తు బందాన్ని (సిట్) ఏర్పాటు చేశామని రాష్ట్ర హౌం మంత్రి పరమేశ్వర్ ప్రకటించారు. కాగా.. అశ్లీల వీడియోల అంశం హల్‌చల్ చేస్తున్న సమయంలోనే ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ జర్మనీలోని ఫ్లాంక్‌ఫర్ట్‌కు వెళ్లిపోవడం మరిన్ని అనుమానాలకు దారితీస్తోంది. అయితే సిట్ దర్యాప్తులో భాగంగా ఆయన్ని వెనక్కి తీసుకువచ్చి విచారిస్తామని పరమేశ్వర్ తెలిపారు. ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణకు సంబంధించి పలు వీడియోలు ప్రస్తుతం రాష్ట్రమంతటా వైరల్‌గా మారాయి. ప్రజ్వల్ రేవణ్ణ పలువురు మహిళలతో అశ్లీలంగా ఉన్న వీడియోలు వెలుగులోకి వచ్చాయి. దీంతో బాధిత మహిళలు న్యాయం చేయాలని టివి చానళ్లు, మహిళా కమిషన్‌ను ఆశ్రయిస్తున్నారు.
ప్రస్తుతం బీజేపీ , జేడీఎస్ కర్ణాటకలో పొత్తులో ఉన్నాయి. లోక్‌సభ ఎన్నికల్లో ఉనికిని చాటుకోవడానికి జేడీఎస్ తంటాలు పడుతోంది. ఈ సమయంలో రేవణ్ణ వివాదంలో చిక్కుకోవడం ఆ పార్టీని కలవరపెడుతోంది.
ప్రజ్వల్ ఈ సారి కూడా హసన్ నుంచి పోటీ చేశారు. హసన్ దేవేగౌడ నియోజకవర్గం. ఆయన వయసు భారం పెరిగిపోవడంతో మనవడికి చాన్సిచ్చారు. పెద్ద కుమారుడు అయిన హెచ్‌డీ రేవణ్ణ కుమారుడికి హసన్ ఇచ్చారు. గత ఎన్నికల్లో గెలిచారు. ఆయన ఒక్కరే గెలిచారు. ఈ సారి బీజేపీతో పొత్తు పెట్టుకుని మూడు సీట్లలో పోటీ చేస్తున్నారు. మూడు సీట్లలో ఒకటి హసన్. మోడీ కూడా వచ్చి ప్రచారం చేసి వెళ్లారు. రెండో విడతలో కర్ణాటకలో మొదటి విడత ఎన్నికలు పూర్తయ్యాయి. పోలింగ్ కు రెండు రోజుల ముందు ఈ వీడియోలు వెలుగులోకి వచ్చాయి. రెండో విడతలో మరో పధ్నాలుగు లోక్ సభ నియోజవర్గాలకు ఎన్నికలు జరగాల్సి ఉంది. వాటిపై ప్రభావం పడితే మొదటికే మోసం వస్తుందని.. బీజేపీ కూటమి కంగారు పడుతోంది. దీన్ని ఎలా కవర్ చేసుకోవాలో.. తెలియక దేవేగౌడ ఫ్యామిలీ కిందా మీదాపడుతోంది. డీప్ ఫేక్ అనడానికి కూడాలేనంత క్లియర్ గా దృశ్యాలు ఉన్నాయి. బాధితురాలు కూడా బయటకు వచ్చారు.
రేవణ్ణ లైంగిక వేధింపులకు సంబంధించిన వీడియోలు ఇప్పటికే హసన్‌లో వందలాదిగా దర్శనమిస్తున్నాయి. కానీ హసన్ లో ఇప్పటికే పోలింగ్ పూర్తయింది. ఆ తర్వాత ఇది దేశవ్యాప్త చర్చనీయాంశమయింది. ఈ వివాదంతో తనకేమీ సంబంధం లేనట్లుగా బీజేపీ వ్యవహరిస్తోంది. అయినప్పటికీ ఆ పార్టీలో కలవరపాటు కన్పిస్తూనే ఉంది. రెండో దశ పోలింగ్‌లో ఈ ఉదంతం ప్రభావం చూపుతుందేమోనన్న ఆందోళన బీజేపీలో వ్యక్తమవుతున్నా పైకి మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తోంది. ఎక్కువ స్పందిస్తే ఎక్కువ రచ్చ అవుతుందని కంగారు పడుతున్నారు. దీన్నుంచి బయటపడటం బీజేపీ, జేడీఎస్ కూటమికి ఇబ్బందికరమే.
మరిన్ని వార్తలకు ఎక్కడ క్లిక్ చేయండి
మరిన్ని వీడియోలకు ఎక్కడ క్లిక్ చేయండి…