దేశవ్యాప్తంగా ఇప్పుడు ఎన్నికల వేడి కనిపిస్తోంది. సార్వత్రిక ఎన్నికలకు ఇంకా ఏడాది సమయం మాత్రమే సమయం ఉంది. అందుకే రాజకీయ పార్టీలన్నీ తమ ఎన్నికల సన్నాహాలు ప్రారంభించాయి. అయితే కేంద్రంలో ఇప్పుడు ఓ అనివార్యమైన పరిస్థితి కనిపిస్తోంది. అదేమిటంటే విపక్షాలన్నీ ఏకం కావడం. జాతీయ స్థాయిలో బీజేపీని సింగిల్‌గా ఢీకొట్టగలిగే పార్టీ లేదు. కాంగ్రెస్ పార్టీ ఒక్క దానికే అంత శక్తి లేదు. చాలా రాష్ట్రాల్లో బీజేపీతో కాంగ్రెస్ పోటీ పడటం లేదు. ఇతర ప్రాంతీయ పార్టీలు ప్రత్యర్థులుగా ఉన్నాయి. ఇప్పుడు అనివార్యంగా అన్ని పార్టీలు కలిసి మోదీ మీద దండెత్తాల్సిన అవసరం ఏర్పడింది. అయితే రాజకీయ పార్టీలకు అనేక రకాల సమస్యలు ఉన్నాయి. కలిసి పని చేస్తాం కానీ చేయలేం అన్నట్లుగా ఉండాల్సిన రాజకీయ పరిస్థితులు. అయితే ఇప్పుడు ఎట్టి పరిస్థితుల్లోనూ కలవాల్సిన అవసరం కనిపిస్తోంది. లేకపోతే ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోలేమన్న ఆందోళన వారిలో కనిపిస్తోంది. అందుకే నితీష్ పర్యటనలు ప్రారంభించారు. కలిసి పోటీ చేసేందుకు తాను కలిసిన వారందర్నీ ఒప్పిస్తున్నారు. ఇప్పుడు పరిస్థితి చూస్తూంటే ఒకరిద్దరు తప్ప అందరూ కలిసి పోటీ చేయడం ఖాయం అనుకోవచ్చు. మరి ఈ క్రెడిట్ నితీష్ కుమార్‌దా అని ఆలోచిస్తే అసలు క్రెడిట్ మోడీకే వెళ్తుంది. ఎందుకంటే విపక్షాలను ఏకం చేస్తోంది ఆయనే మరి.
ఎలా లేదన్న కాంగ్రెస్ పార్టీ బీజేపీని ఢీకొట్టగలిగగే సామర్థ్యం ఉన్న పార్టీల్లో అతి పెద్ద పార్టీ మిగతావన్నీ ప్రాంతీయ పార్టీలే. కాంగ్రెస్ పార్టీ లేకుండా కూటమి సాధ్యం కాదు. ఈ విషయాన్ని కాంగ్రెస్ నేతలు చెబుతూంటారు కానీ ప్రాంతీయ పార్టీల నేతలు మాత్రం అంగీకరించారు. ఎందుకంటే కాంగ్రెస్ పని అయిపోయిందని పది లేదా పదిహేను సీట్లు వచ్చినా తామే కింగ్ మేకర్లం అని వారు ఊహిస్తూ ఉంటారు కానీ ఇప్పుడు అదే కాంగ్రెస్ పార్టీతో కలిసి పోటీ చేసేందుకు అన్ని పార్టీలు సిద్ధమవుతున్నాయి. ఇలా మార్పు రావడానికి ప్రధాన కారణం మోదీ. ఇప్పటి వరకూ ఊగిసలాడిన పార్టీలు కాంగ్రెస్ పార్టీతో కలిసి పని చేయడానికి వేదిక పంచుకోవడానికి రాజకీయాలు చేయడానికి ఒప్పించింది ఆయనే. కాకపోతే పరోక్షంగా కానీ ఉద్దేశపూర్వకంగానే అనుకోవచ్చు. ఓ రకంగా పక్కాగా బీజేపీ వ్యూహకర్తలు ప్లాన్ చేసి మరీ విపక్షాలన్నీ కాంగ్రెస్ నేతృత్వంలో ఏకమయ్యేలా చేస్తున్నాయి. దీని వెనుక ఊహించనంత పొలిటికల్ స్కెచ్ ఉంది.
రాహుల్ గాంధీపై అనర్హతా వేటు వేయడం అంటే చిన్న విషయం కాదు. ఓ చిన్న పరువు నష్టం కేసులో రెండేళ్లు జైలు శిక్ష ఆ తర్వాతి రోజే ఆయన పదవి నుంచి తొలగించారు. వారంలోపే ఇంటిని ఖాళీ చేయమని నోటీసులు ఇచ్చారు. సాధారణంగా ఈ పరిణామాలుచూస్తే విపక్ష నేత అని అనుకున్న ప్రతి ఒక్కరికీ భయం పడుతుంది. రాహుల్ గాంధీ అంతటివాడికే అలాంటి పరిస్థితి ఎదురైతే రేపు తమ పరిస్థితి ఏమిటి అన్న ఆలోచన రాకుండా మానదు. ఇలాంటి ఆలోచన రావాలనే అసలిదంతా జరిగింది. వెంటనే విపక్ష నేతలదరూ ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీతో దూరంగా ఉండేవారు కూడా ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం పోరాడదాం రండి అని పిలిపునివ్వగానే మరో క్షణం ఆలోచించకుండా వచ్చేశారు. ఇదే ఎఫెక్ట్ బీజేపీ మోదీ కోరుకున్నారు. ఇప్పుడు బీఆర్ఎస్ సహా అన్ని పార్టీలు కాంగ్రెస్ పక్కన కనిపిస్తున్నాయి. ఇప్పుడు బీజేపీ అసలు ప్లాన్ అమలు చేయడం ప్రారంభించింది.
ప్రధాని మోదీ ఇటీవల తన ప్రసంగాల్లో ఒకే అంశాన్ని హైలెట్ చేస్తున్నారు అదేమిటంటే అవినీతి. అవినీతి పరుల్ని వదిలే ఉద్దేశం లేదని దొరికిన వారిని ఎలా వదిలి పెట్టాలని ఆయన ప్రశ్నిస్తున్నారు. హైదరాబాద్‌లో కూడా అవే మాటలన్నారు. తమను తాము కాపాడుకోవడానికి అవినీతి పరులందరూ ఏకమవుతున్నారని కామన్‌గా ఆరోపిస్తున్నారు. మోదీ బీజేపీ టార్గెట్ ఇదే. కాంగ్రెస్ నేతృత్వంలో విపక్షాలన్నీ అవినీతి పార్టీలనీ అవన్నీ కూటమి కట్టి ప్రజల వద్దకు వస్తున్నాయని అందర్నీ ఓడించాలని ఆయన పిలుపునిస్తున్నారు. ఆ కూటమిలో కొన్ని పార్టీలకు అవినీతి మరక ఉండకపోవచ్చు కానీ ప్రజాస్వామ్య పరిరక్షణ పేరుతో కాంగ్రెస్ తో జత కట్టినందున వారిపైనా మరకలు తప్పవు. రేపు ఎన్నికల్లో మోదీ వర్సెస్ అవినీతి కూటమి అనే ప్రచారం ఉద్ధృతంగా సాగుతుంది. మరి అప్పుడు ప్రజలు ఏం చేస్తారు.
ప్రాంతీయపార్టీలతో ఉన్న ముప్పును వాటిని కాంగ్రెస్‌తో జత కట్టేలా చేయడం ద్వారా ప్రధాని మోదీ తగ్గించుకున్నారని అనుకోవచ్చు. హిందీ రాష్ట్రాల్లో తప్పితే ఇతర చోట్లా బీజేపీకి కాంగ్రెస్ కు పోటీ జరగడం లేదు. హిందీ రాష్ట్రాల్లో యూపీలో కూడా కాంగ్రెస్ పోరులో లేదు అన్నీ ఇతర పార్టీలే ఉన్నాయి. అన్ని పార్టీలతో రాష్ట్రానికో స్ట్రాటజీతో పోరాడటం బీజేపీకి ఇబ్బందే. అందుకే అన్ని పార్టీల్నికలిపేసి అవినీతికూటమి అనే ముద్ర వేసి ఎన్నికల బరిలోకి దిగితే బీజేపీ ఒక్క షాట్‌కు విపక్ష పార్టీలు అన్ని ఉంటే అన్నీ దెబ్బయిపోతాయి. ఇదే క్యాంపెయిన్‌ను బీజేపీ ప్రారంభించింది సోషల్ మీడియాలో తిరుగుతున్న కొన్ని వీడియల్లో పది తలలు ఉన్న కాంగ్రెస్ అవినీతి కూటమితో ఒక్క మోదీ తలపడుతున్నట్లుగా చిత్రీకరిస్తున్నారు. ఇంతకన్నా మాస్టర్ ప్లాన్ ఏముంటుంది. విపక్షాలు ఏం చేయాలో కూడా తానే వ్యూహాత్మకంగా నిర్దేశిస్తున్న మోదీ బీజేపీకి తిరుగుంటుందా.