సందీప్ సింగ్ హర్యానా రాష్ట్ర క్రీడల మంత్రి. ఒకప్పుడు భారత జాతీయ హాకీ జట్టుకు నాయకత్వం వహించాడు. ఆ తరువాత పాలిటిక్స్‌లోకి వచ్చారు. 2019లో హర్యాణాలోని పెహోవా నియోజకవర్గం నుంచి బీజేపీ తరపున మొదటిసారి ఎమ్మెల్యేగా గెలిచారు. క్రీడాకారుడైన సంబంధిత శాఖ మంత్రిత్వ బాధ్యతల్ని అప్పగించారు. అయితే అతను క్రీడలపై దృష్టిపెట్టకుండా శృంగార క్రీడలపై మక్కువ చూపించారు. మంత్రి తనపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారని జూనియర్ అథ్లెటిక్స్ మహిళా కోచ్ ఫిర్యాదు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఓ సర్టిఫికెట్ విషయంలో వ్యక్తిగతంగా కలవాలని పిలిచి తనను లైంగికంగా వేధింపులకు గురిచేశారని మంత్రిపై మహిళా కోచ్ ఆరోపించారు. ఇన్ స్టాగ్రాంలో మంత్రి తనను కాంటాక్ట్ అయ్యారని చెప్పారు. ఓ సర్టిఫికెట్ విషయంలో వ్యక్తిగతంగా వచ్చి కలవాలని పిలవడంతో మంత్రి క్యాంప్ కార్యాలయానికి వెళ్లినట్లు తెలిపారు. అక్కడ సందీప్ సింగ్ తనతో అసభ్యంగా ప్రవర్తించారని సర్టిఫికెట్ కావాలంటే తను చెప్పినట్లు నడుచుకోవాలని బెదిరించారని ఆరోపించారు.
శుక్రవారం ఇండియన్ నేషనల్ లోక్ దళ్ పార్టీ ఆఫీసులో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆమె ఈ ఆరోపణలు చేశారు. కేబినెట్ నుంచి వెంటనే సందీప్ సింగ్ ను తొలగించి విచారణకు ఆదేశించాలని సీఎం మనోహర్ లాల్ ఖట్టర్ ను ఆమె డిమాండ్ చేశారు. అయితే తనపై వచ్చిన ఆరోపణలు నిరాధారమని మంత్రి సందీప్ సింగ్ కొట్టిపారేశారు. కేవలం రాజకీయంగా తనను దెబ్బ తీయడానికే ప్రతిపక్షాలు రాద్ధాంతం చేస్తున్నాయని ఆయన ఆరోపించారు. మహిళా కోచ్ ఆరోపణలపై కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత మాజీ ముఖ్యమంత్రి భూపిందర్ సింగ్ హుడా స్పందిస్తూ కోచ్ ఆరోపణలపై నిష్పక్షపాత విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. మహిళా కోచ్ ఆరోపణల ఆధారంగా సందీప్ సింగ్ పై చండీగఢ్ పోలీసులు లైంగిక వేధింపుల కేసు నమోదు చేశారు.
దీంతో ఆయన తన మంత్రి పదవి నుంచి తప్పుకున్నారు. తనపై వచ్చిన తప్పుడు ఆరోపణలపై సమత్ర విచారణ జరగుతుందని ఆశిస్తున్నానని విచారణ నివేదిక వచ్చేవరకు క్రీడాశాఖ బాధ్యతలను ముఖ్యమంత్రికి అప్పగిస్తానని సందీప్ సింగ్ అన్నారు.