ఆరెస్సెస్ లేనిదే బీజేపీ లేదు. కానీ ఇది నరేంద్రమోదీ అమిత్ షాల హవా ప్రారంభం కాక ముందే. ఆరెస్సెస్ నుంచే వీరు ఎదిగినా బీజేపీ వీరి చేతుల్లోకి వచ్చాక పూర్తిగా మారిపోయింది. ఆరెస్సెస్ సిద్ధాంతాలను పట్టించుకోవడం లేదన్న ఆరోపణలు ఎక్కువగా వస్తున్నాయి. ముఖ్యంగా మోదీ తీరుపై ఆరెస్సెస్ నాయకత్వం తీవ్ర అసంతృప్తితో ఉందన్న ప్రచారం గత ఐదేళ్లుగా జరుగుతోంది. 2019 ఎన్నికలకు ముందు సూరజ్ కుండ్‌లో జరిగిన ఆర్ఎస్ఎస్ సమావేశాల్ల 2019 ఎన్నికల వ్యూహాల విధానాలను ఖరారు చేసినప్పుడు మోడీ మాత్రం రెండో సారి ప్రధాని కారాదని పలువురు పట్టుబట్టారు. ఒంటెద్దు పోకడలతో రాజకీయంగానే కాక పాలనాపరంగానూ విమర్శలపాలయ్యారని ఆయనను తప్పించాలని అనుకున్నారు ప్రత్యామ్నాయంగా నితిన్ గడ్కరీని తెరపైకి తెచ్చారు. కానీ ఇప్పుడు గడ్కరీకే ప్రాధాన్యత లేకుండా పోయింది బీజేపీ పార్టీ నిర్ణయాల్లో ఆయన పాత్ర ఇప్పుడు లేదు. ఆరెస్సెస్ చేయాలనుకున్నదాన్ని రివర్స్‌లో మోదీ చేసేశారు అందుకే ఇప్పుడు మోదీ ఆరెస్సెస్ మధ్య బంధం అంత గొప్పగా లేదన్న వాదన ప్రధానంగా వినిపిస్తూ ఉంటారు.
బీజేపీ ని ఆర్‌ఎస్‌ఎస్ నూ వేరువేరుగా చూడలేమని ఇప్పటి వరకూ చెప్పుకున్నారు. ఆర్‌ఎస్‌ఎస్ ఐడియాలజీకి బీజేపీ హిందుత్వ వాదానికి చాలా దగ్గరి పోలికలు ఉంటాయి. ఈ రెండు కూడా ఏకీకృతంగా ముందడుగు వేస్తూ జాతీయ రాజకీయాల్లో తిరుగులేని శక్తిగా ఎదుగుతోంది. కానీ ఇలాంటి శక్తి వచ్చిన తర్వాత మోదీ ఆరెస్సెస్‌ను పట్టించుకోవడం లేదన్న విమర్శలు ఎక్కువగా వస్తున్నాయి. నరేంద్రమోదీ ఇప్పుడు తిరుగులేని నాయకుడు. ఆయన ఇమేజ్ ఆకాశం అంత ఎత్తులో ఉంది. అయితే ఆయన ధోరణి పార్టీకి చేటు తెచ్చేదిగా ఉందని సీనియర్లతో పాటూ ఆర్ఎస్ఎస్ లోని కొందరు పెద్దలు భావిస్తున్నారు. దీంతో మోడీని దూరం పెట్టే విషయాన్ని సీరియస్ గా పరిశీలిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే మోడీ-అమిత్ షాలు ఉన్నపాటున దిద్దుబాటు చర్యలు మొదలెట్టారన్న ప్రచారం కొంత కాలంగా సాగుతోంది. ఈ క్రమంలో నరేంద్రమోదీ ఆరెస్సెస్ ప్రభావాన్ని బీజేపీపై తగ్గించే ప్రయత్నాలు చేస్తున్నారని అంటున్నారు. బీజేపీలో ఆరెస్సెస్‌కు అత్యంత సన్నిహితులు ఎవరంటే నితిన్ గడ్కరీ. నితిన్ గడ్కారీని బీజేపీ పార్లమెంటరీ బోర్డ్ నుంచి తప్పించారు. ఊహించని విధంగా ఆయనను మోడీ అమిత్ షా ద్వయం పక్కన పెట్టేసింది. దాంతో మోడీకి ఆర్‌ఎస్‌ఎస్ కు గ్యాప్ వచ్చిందనే వాదనలు గట్టిగానే వినిపించాయి.
ప్రధాని మోదీ బీజేపీ సాధిస్తున్న విజయాలన్నింటినీ తన ఖాతాలో వేసుకుంటున్నారు. దేశవ్యాప్తంగా లక్షలాది మంది సంఘ్ కార్యకర్తలు బీజేపీ విజయానికి తెరవెనుక కృషి చేశారు. దీనిని గుర్తించకుండా బీజేపీ టాప్ లీడర్లు రాజకీయ అవసరాల కోసం సంఘ్ కోర్ అజెండాను పక్కన పెడుతున్నారన్న అభిప్రాయం ఆరెస్సెస్ కు కలుగుతోంది. ఈ పరిస్థితుల్లో రాజకీయ లాభాల కోసం ఐడియాలజీకి బీజేపీ దూరం జరగకుండా ఆరెస్సెస్ పట్టు బిగించాలని కొంత కాలంగా ప్రయత్నిస్తోంది. జరుగుతున్న ఎన్నికల్లో బీజేపీ సాధిస్తున్న విజయాలు పార్టీ సీనియర్ లీడర్లందరూ నరేంద్ర మోడీ ఖాతాలోనే వేయడం మొదలెట్టారు. మోడీకి ఉన్న ప్రజా కర్షణ వల్లనే ఈ గెలుపు సాధ్యమైందని కేంద్ర మంత్రులు కూడా బాహాటంగా ప్రకటనలు చేశారు. అయితే ఈ విషయాన్ని అంగీకరించడానికి ఆరెస్సెస్ సిద్దంగా లేదు. బీజేపీ గెలుపులో తమ పాత్రను పార్టీ సీనియర్ లీడర్లు సహా ఎవరూ గుర్తించకపోవడం ఆరెస్సెస్ కు రుచించలేదని భావిస్తున్నారు. పార్టీ గెలుపు కోసం తమ స్వయంసేవకులు చేసిన కృషిని ఇటీవల ఆరెస్సెస్ బహిరంగంగా చెప్పుకుంటోంది. దేశవ్యాప్తంగా నాలుగున్నర లక్షల పల్లెలకు స్వయంసేవకులు వెళ్లారని అక్కడ ఎన్నికల కోసం పనిచేశారని ఈ పల్లెల్లో అనేక కుటుంబాలతో పరిచయాలు పెంచుకుని బీజేపీ ఓటర్లుగా మార్చారని చెబుతున్నారు. చడీచప్పుడు లేకుండా బీజేపీకి అనుకూలంగా జరిగిన ఈ ప్రచారంలో దాదాపు పది లక్షల మంది ఆరెస్సెస్ వాలంటీర్లు దేశంలోని అన్ని ప్రాంతాల్లో పనిచేశారు. లోక్ సభ ఎన్నికలు కాబట్టి జాతీయ సమస్యలను దృష్టిలో పెట్టుకునే ఓటు వెయ్యాలంటూ పరోక్షంగా ప్రజలను ఆ దిశగా ఆలోచించేలా చేశారు. దీంతో ప్రాంతీయ పార్టీలు లేవనెత్తిన ఇష్యూస్ ను ప్రజలు మరచిపోయి నేషనల్ ఇష్యూస్ గురించి ఆలోచించి బీజేపీకి అనుకూలంగా తీర్పు ఇచ్చారనేది ఆరెస్సెస్ పెద్దల అభిప్రాయం. బీజేపీ గెలుపు కోసం ఇంతగా కృషి చేసినప్పటికీ అదంతా మోడీ ఘనతేనని ప్రచారం జరగడం ఆరెస్సెస్ కు ఇష్టం లేదని చెబుతుననారు.
వాజ్ పేయి హయాంతో పోలిస్తే ప్రస్తుతం ఆరెస్సెస్ బీజేపీ మధ్య సంబంధాలు అంతగొప్పగా లేవు. ప్రధాని మోడీ సాక్షాత్తూ ఆరెస్సెస్ ప్రచారక్ గా పనిచేసిన నాయకుడు. పార్టీ ప్రెసిడెంట్ గా ఉన్న అమిత్ షా గతంలో విద్యార్థి సంఘమైన ఏబీవీపీలో పనిచేశారు. వీరిద్దరికీ ఆరెస్సెస్ ఇంపార్టెన్స్ ఏంటో ఎవరూ ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఆరెస్సెస్ ఐడియాలజీకి అనుగుణంగానే ప్రభుత్వం అనేక నిర్ణయాలు తీసుకుంటోంది. ఆరెస్సెస్ నాయకత్వం కూడా ఈ విషయాన్ని కాదనడం లేదు. కానీ బీజేపీ గెలుపులో తమ పాత్ర కూడా ఉందన్న విషయాన్ని ఎస్టాబ్లిష్ చేసుకోవడానికి ఆరెస్సెస్ నాయకులు తాపత్రయపడుతున్నారు. అలాంటి క్రెడిట్ ఆరెస్సెస్‌కు ఒక్క శాతం ఇవ్వడానికి మోదీ రెడీగా లేరు. బీజేపీలో కీలక బాధ్యతల కోసం అరెస్సెస్ నుంచి తరచూ కొంత మంది సీనియర్లను పంపుతూ ఉటారు. తెలుగు రాష్ట్రాలకు చెందిన రామ్ మాధవ్, మురళీధర్ రావు ఆ తరహాలోనే బీజేపీలోకి వెళ్లారు. నేరుగా ప్రధాన కార్యదర్శులయ్యారు. ఓ దశలో అమిత్ షా తర్వాత రామ్ మాధవ్ బీజేపీ అధ్యక్షడవుతారని అనుకున్నారు. కానీ ఆయనను అవమానకరంగా ఆరెస్సెస్ కు వెళ్లిపోయేలా చేశారు. కానీ మురళీధర్ రావు మాత్రం ఎవరూ పట్టించుకోకపోయినా బీజేపీలోనే ఉండిపోయారు. అయితే ఆరెస్సెస్ నుంచి బీజేపీని నడిపించడానికి నియమితులైన బీఎల్ సంతోష్ మాత్రం పాతుకుపోయారు. మోదీ, షాల ఆలోచనలకు తగ్గట్లుగా ఆయన పని చేసుకుంటున్నారు. ఆయన రాజకీయాలకు విలువలు ఉండవన్న విమర్శలు చేలా కాలంగా వస్తున్నాయి.
మోదీపై ఆరెస్సెస్ అసంతృప్తి చాలా సందర్భాల్లో బయటపడింది. కాంగ్రెస్ ముక్త భారత్ పిలుపు సరి కాదని ఆరెస్సెస్ చీఫ్ మోహన్ భగవత్ చాలా సార్లు స్పష్టంచేశారు ప్రభుత్వ వైఫల్యాలపై ఎన్నో సార్లు నేరుగా విమర్శిచారు. కోవిడ్– 19 ను సరిగ్గా డీల్ చేయలేదని తొలి వేవ్ తర్వాత భారత ప్రభుత్వం, పాలనా యంత్రాంగం, భారత ప్రజలు నిర్లక్ష్య వైఖరి ప్రదర్శించారని స్వయంగా రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ అదినేత మోహన్ భాగవత్ తీవ్ర విమర్శలు చేయడం సంచలనం రేపింది. 1925లో రాష్ట్రీయ స్వయం సేవక్ ఆవిర్భవించిన తర్వాత ఆ సంస్థకు ఆధిపత్యం వహించిన సర్ సంచాలక్‌లలోకెల్లా మోహన్ భాగవత్ అత్యంత శక్తివంతమైనవారు. భారత ప్రభుత్వంపై, పౌర సమాజంపై ఇంతటి ప్రభావం చూపగలుగుతున్న వారిని మునుపెన్నడూ చూసి ఉండరని రాజకీయ విశ్లేషకులు చెబుతూ ఉటారు ప్రత్యేకించి హిందూ పౌర సమాజంపై మోహన్ భాగవత్ వేసిన ప్రభావం అంతాఇంతా కాదు. ఇది ఎలా సాధ్యమయిందంటే 2014 సార్వత్రిక ఎన్నికల్లో మోదీ గెలవడానికి ముందు ఆరెస్సెస్ బీజేపీలు ఢిల్లీపై కానీ దేశంలోని చాలా రాష్ట్రాల్లో కానీ ఎన్నడూ పట్టు సాధించిన పాపాన పోలేదు. చివరకు 1999–2004 సంవత్సరాల మధ్య నాటి ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయి హయాంలో కూడా ఢిల్లీలో బీజేపీ నేతృత్వంలో సంకీర్ణ ప్రభుత్వం ఉన్నప్పటికీ ప్రభుత్వంపై ఆ పార్టీకి పరిమితమైన పట్టు మాత్రమే ఉండేది. అప్పట్లో బీజేపీ నియంత్రణలో కొన్ని రాష్ట్రాలు మాత్రమే ఉండేవి. దీని పర్యవసానంగానే 2000 సంవత్సరం నుంచి ఆరెస్సెస్ చీఫ్‌గా ఉండిన కేఎస్ సుదర్శన్ నేటి మోహన్ భాగవత్ కంటే చాలా తక్కువ పలుకుబడి కలిగి ఉండేవారు. పార్టీలో మోదీ ఆరెస్సెస్‌లో మోహన్ భగవత్ తిరుగులేని అధికారంతో ఉండటంతో ఇరువురి మధ్య గ్యాప్ పెరిగిపోయిందన్న అభిప్రాయం వినిపిస్తోంది.
మోహన్ భాగవత్ మోదీ ఒకే సంస్థ నీడలో సుదీర్ఘకాలంలో ఎదిగి వచ్చారు. మోదీ ప్రధాని అయ్యేంతవరకు రాష్ట్రీయ స్వయం సేవక్ అఖిల భారత యంత్రాంగంపై కానీ దాని విశాలమైన సంస్థాగత యంత్రాంగంపై గానీ ఆయనకు నియంత్రణ కూడా లేదు. సంఘ్ పరివార్ లో నియంత్రణల కారణమంగా మోహన్ భాగవత్ సహజంగానే ఆరెస్సెస్‌లో అత్యంత శక్తివంతమైన నేతగా వెలుగొందుతూ వచ్చారు. అదే సమయంలో వె మోదీకి ఎలాంటి ప్రాధాన్యతా ఉండేది కాదు. 2002 సంవత్సరానికి ముందువరకు ఆరెస్సెస్‌కి చెందిన మోహన్ భాగవత్ ప్రమోద్ మహాజన్‌ల ఆదేశాలను మోదీ శిరసావహించేవారు. నరేంద్రమోదీకి అత్యంత అనుకూలంగా మారిన విషయం ఏమిటంటే ఆయన గుజరాతీ నేపథ్యమే. ఇప్పుడు సంఘ్ పరివార్ అధినేత మోహన్ భాగవత్ ప్రధాని మోదీని గొప్ప నాయకుడిగా ఆమోదిస్తున్నారని నమ్మలేం అందుకే బీజేపీ ఆరెస్సెస్ మధ్య గ్యాప్ ఉందనే వార్తలు. మోదీ మోహన్ భగవత్‌ల మధ్య ఆధిపత్య పోరాటమే బీజేపీ ఆరెస్సెస్ మధ్య దూరం పెరగడానికి కారణం అవుతోందా.