అవును, షర్మిలకు రాజ్యసభే..!

By KTV Telugu On 1 September, 2023
image

KTV TELUGU :-

షర్మిల ఏం చేయబోతున్నారు. సోనియను ఎందుకు కలిశారు. పార్టీ విలీనం ఖాయమా. ఆమెకు ఎలాంటి పదవి దక్కబోతోంది. ఆమెను ఆంధ్రప్రదేశ్లో కూడా ఉపయోగించుకోబోతున్నారా.. ఇలాంటి ప్రశ్నలకు ఇప్పుడిప్పుడే సమాధానం వస్తోంది.

వైఎస్ రాజశేఖర్ రెడ్డి కూతురు అనుకున్నది సాధంచలేకపోవచ్చు. కాకపోతే ఆమెకు గౌరవప్రదమైన పదవి మత్రం దక్కే అవకాశాలున్నాయి. సోనియా ఆమెకు రాజ్యసభ హామీ ఇచ్చినట్లుగా ఓపెన్ టాక్. కాంగ్రెస్ పార్టీ షర్మిల సేవలను ఆంధ్రప్రదేశ్లో కూడా వినియోగించుకోవాలనుకుంటోంది. అందుకు ఆమె అయిష్టంగానే అంగీకరించినట్లు సమాచారం.

భర్త అనిల్ తో కలిసి షర్మిల ఢిల్లీ వెళ్లారు. సోనియాగాంధీ, రాహుల్ గాంధీతో కలిసి ఆమె బ్రేక్ ఫాస్ట్ మీటింగుకు హాజరయ్యారు. దాదాపు గంటన్నర పాటు జరిగిన భేటీలో ఆనేక అంశాలు చర్చకు వచ్చాయి. వైఎస్సాఆర్టీపీని కాంగ్రెస్ లో విలీనం చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు ఆమె సోనియా ముందు ప్రకటించారు. పైగా దాని వల్ల తనకు కలిగే ప్రయోజనాలు, నష్టాలను ఆమె మనసు విప్పి మాట్లాడినట్లు తెలుస్తోంది.ఆయితే ఆమె ప్రయోజనాలకు ఎలాంటి భంగం కలుగకుండా చూసుకుంటామని హామీ ఇచ్చిన సోనియాగాంధీ.. రాజశేఖర్ రెడ్డి కూతురిగా ఆమెకు తగిన గౌరవం లభిస్తుందని హామీ ఇచ్చారు. షర్మిలను కర్ణాటక నుంచి రాజ్యసభకు పంపేందుకు సోనియా ప్రతిపాదించగా అందుకు ఆమె సంతోషంగా అంగీకరించారు. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ కాంగ్రెస్ లో కీలక పాత్ర పోషించాలని షర్మిలను సోనియా కోరారు. జగన్మోహన్ రెడ్డి కోసం షర్మిల పాదయాత్ర చేసినప్పుడు ఆమెకు లభించిన జనాదరణ తనకు తెలుసునని సోనియా ప్రశంసించారు.

ఆంధ్రప్రదేశ్లో పార్టీ బాగా వీక్ అయిపోయిందని అక్కడ నూతన జవసత్వాలు కల్పించాల్సిన అనివార్యత ఉందని సోనియా ఈ సందర్భంగా ప్రస్తావించారు.ఆంధ్రప్రదేశ్ కంటే తెలంగాణలో ముందుగానే ఎన్నికలు జరుగుతున్నందున ఆ రాష్ట్రంలో ప్రచారం పూర్తయిన తర్వాత ఏపీపై పూర్తి స్థాయిలో ఏకాగ్రత చూపాలని సోనియా కోరగా అందుకు షర్మిల అంగీకరించారు. కేసీఆర్ ప్రభుత్వానికి కౌంట్ డౌన్ మొదలైందని సోనియా, షర్మిల ఇద్దరూ అభిప్రాయానికి వచ్చారు. షర్మిల తెలంగాణలో పోటీ చేసినా తమకు ఎలాంటి ఇబ్బందీ లేదని, ఆమె సేఫ్ సైడ్ గా ఉండేందుకు రాజ్యసభ ఇస్తామని కాంగ్రెస్ పార్టీ హామీ పలికింది. పాలేరు నియోజకవర్గంలో పరిస్థితులను సైతం అడిగి తెలుసుకున్న సోనియా.. తుమ్మల నాగేశ్వరరావును కాంగ్రెస్ లో చేర్చుకుంటే ఎలా ఉంటుందని ప్రశ్నించారట.దానిపై స్పందించేందుకు షర్మిల సముఖంగా లేకపోవడంతో సోనియా మిన్నకుండి పోయారట.

ఒకటి రెండు వారాల్లో షర్మిల పార్టీ కాంగ్రెస్ లో విలీనం కావడం ఖాయంగా కనిపిస్తోంది. టీపీసీసీ అధ్యక్షడు రేవంత్ రెడ్డి సహా కొందరు నేతలకు ఆమె రావడం ఏ మాత్రం ఇష్టం లేదు. ఆమె ఆంధ్రా నాయకురాలని ఎలాంటి రాజకీయాలనైనా ఆమె ఆంధ్రాలోనే చేసుకుంటే బావుంటుందని రేవంత్ బహిరంగంగానే ప్రకటించిన సందర్భాలున్నాయి. దానితో ఇప్పుడు ఆమె చేరిక ఖాయం కావడంతో వారి స్పందన ఎలా ఉంటుందో చూడాలి. తెలంగాణలో పీసీసీ సహకారం ఆమెకు ఉంటుందని ఖచితంగా చెప్పలేము. ఎందుకంటే ఒక నేత పైకి వెళ్తుంటే నలుగురు కిందకు లాగే పార్టీ అది. పైగా షర్మిలకు మరో టఫ్ టాస్క్ కూడా ఉంది.ఏపీలో పార్టీ పునరుద్ధరణ అంత సులభం కాదు. ఎలా చేస్తారో చూడాలి మరి..

మరిన్ని వార్తలకు ఎక్కడ క్లిక్ చేయండి

మరిన్ని వీడియోలకు ఎక్కడ క్లిక్ చేయండి