కశ్మీర్‌ టూ కన్యాకుమారి.. బీజేపీ లెక్క పక్కా!

By KTV Telugu On 5 October, 2022
image

– కశ్మీర్‌లో కాషాయజెండా ఎగరాలి.. దటీజ్‌ టార్గెట్‌
– కశ్మీర్‌ని బీజేపీ మళ్లీ కెలికింది.. రియాక్షన్స్‌ షురూ

చొరబాట్లు ఆగలేదు. ఉగ్రమూకలు దాడులు ఆపలేదు. జమ్ముకశ్మీర్‌లో రోజూ తుపాకులు పేలుతూనే ఉన్నాయి. అయినా బీజేపీ తాను అనుకున్నది చేసుకుంటూ పోతోంది. ఊరకరారు మహానుభావులన్నట్లు అమిత్‌షా కశ్మీర్‌ పర్యటన వెనుక వ్యూహాత్మక ఎత్తుగడ ఉంది. ఊహించినట్లే జమ్ముకశ్మీర్‌లో వెనుకబడిన వర్గాలైన గుజ్జర్, బకర్వాల్, పహాడీలకు ఎస్టీ హోదా కల్పిస్తామని కేంద్ర హోం మంత్రి హామీ ఇచ్చారు. జస్టిస్‌ వర్మ కమిషన్‌ సిఫార్సులతో ఈ మూడు వర్గాల ప్రజలకు ఎస్టీ రిజర్వేషన్‌ ఫలాలు దక్కబోతున్నాయి.
ఇదివరకు జమ్ముకశ్మీర్‌కి ప్రత్యేక ప్రతిపత్తి ఉండేది. ఆర్టికల్‌ 370 రద్దుతో అడ్డంకులన్నీ తొలగిపోయాయి. కొత్తగా మూడువర్గాలకు రిజర్వేషన్‌ ఇవ్వడం వల్ల ఇప్పటికే ఎస్టీ కోటాలో లబ్దిపొందుతున్నవారికి ఎలాంటి నష్టం జరగదంటున్నారు అమిత్‌షా. కానీ దీన్ని రాజకీయ నిర్ణయంగానే కశ్మీర్‌ విపక్షాలు వ్యతిరేకిస్తున్నాయి. ఇప్పటికే కశ్మీర్‌ అస్థిత్వాన్ని కేంద్రం దెబ్బతీస్తోందని మండిపడుతున్న పార్టీలు ఈ రిజర్వేషన్‌ని రాజకీయ ఎత్తుగడగానే చూస్తున్నాయి.
జమ్ముకశ్మీర్‌ సరిహద్దు జిల్లాలైన రాజౌరీ, పూంచ్‌ జనాభాలో 40 శాతం మంది బకర్వాల్, గుజ్జర్‌లే. పహాడీల జనాభా తక్కువ. మూడు దశాబ్ధాలుగా కశ్మీరీలు, డోగ్రాలకు 10 శాతం ఎస్టీ రిజర్వేషన్‌ అమలవుతోంది. తమకు కూడా రిజర్వేషన్‌ కల్పించాలని పహాడీలు ఎప్పటినుంచో డిమాండ్‌ చేస్తున్నారు. గుజ్జర్లు, బకర్వాల్‌లు ఈ డిమాండ్‌ని వ్యతిరేకిస్తున్నారు. 2020 జనవరి నుంచి ఉద్యోగాలు, విద్యాసంస్థల్లో పహాడీలకు కేంద్రం 4 శాతం కోటా కల్పించింది. రాజౌరి, పూంచ్, బారాముల్లా, హాంధర్వాలలో ప్రహరీలు భారీగా ఉన్నారు. ఎస్టీ హోదాతో వీరంతా తమ ఓటుబ్యాంకుగా మారతారనే ఆలోచనతో బీజేపీ ఉంది. అయితే గుజ్జర్లు, బకర్వాల్‌ల వ్యతిరేకత కొత్త చిక్కులు తెచ్చిపెట్టేలా కనిపిస్తోంద