వచ్చే అవకాశాలు కూడా తక్కువే?
క్లారిటీ వస్తే మాత్రం ఫ్యాన్స్ కు షాకే?
సంక్రాంతికి ఆదిపురుష్ తో పాటు చిరు నటిస్తున్న వాల్తేరు వీరయ్య, బాలయ్య కొత్త సినిమాలు విడుదల కావాల్సింది. కాని ఇప్పుడు ఈ మూడు సినిమాలు సంక్రాంతి బరిలో నుంచి తప్పుకునే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి. అందుకు కారణం ఆదిపురుష్ చుట్టూ ఉన్న కాంట్రవర్సీ. ఈ సినిమాను మళ్లీ రీషూట్ చేసి ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలనుకుంటున్నాడట దర్శకుడు ఓంరౌత్. ఇక చిరు, బాలయ్య ఇద్దరు సంక్రాంతి పండక్కి వస్తామనడం , ఈ రెండు సినిమాలను మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తుండటంతో, ఒకే బ్యానర్ నుంచి పండక్కి రెండు సినిమాలు విడుదల కరెక్ట్ కాదని, ఈ రెండు చిత్రాలను విడుదలను హోల్డ్ లో పెట్టిందట మైత్రీ మూవీస్. చిరు, బాలయ్య చిత్రాల స్థానంలో, నందమూరి కళ్యాణ్ రామ్ నటిస్తున్న న్యూ మూవీని సంక్రాంతి బరిలో నిలుపనుందట. ప్రస్తుతం ఈ రూమర్ టాలీవుడ్ ను షేక్ చేస్తోంది. సంక్రాంతి బరి నుంచి అగ్ర హీరోలు తప్పుకుంటే యువ హీరోలు కొత్త సినిమాలతో దూసుకొచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.