కేన్సర్ బాధితుల జాబితాలో మరో నటి.!

By KTV Telugu On 24 May, 2022
image

కేన్సర్ మహమ్మారి గురించి వేరే చెప్పనక్కర్లేదు. కేన్సర్ ప్రాధమిక దశలో గుర్తించడంలో చాలామంది విఫలమవుతుంటారు. ఫలితంగా అది ప్రాణాపాయంగా మారుతుంటుంది. కేన్సర్ కన్నా ట్రీట్ మెంట్ అతి పెద్ద సవాల్. ఎంతో మంది హీరోయిన్లు కేన్సర్ పై పోరాటం చేసి విజయం సాధించిన వాళ్లు ఉన్నారు. ఇలాంటి పోరాటంలో గెలిచినోళ్ల మాటలు ఎంతో మంది స్ఫూర్తిదాయకంగా ఉంటాయి. ఈ జబ్బుని ఎదుర్కొనే ధైర్యాన్ని ఇస్తాయి.

ఇప్పుడే మొదలైంది

బ్రెస్ట్ కేన్సర్ బారిన పడిన సినిమా, టీవీ నటి ఛావి మిట్టల్ రేడియేషన్ థెరపీ గురించి తన అనుభవాలను అభిమానులతో పంచుకుంది. తనకు బ్రెస్ట్ క్యాన్సర్ బయటపడినట్టు గత నెలలో ప్రకటించడం తెలిసిందే. కేన్సర్ పై అవగాహన కల్పించాలని కూడా ఆమె నిర్ణయించుకుంది. అందుకని సోషల్ మీడియా వేదికగా ఎప్పటికప్పుడు తన స్వీయ అనుభవాలను పంచుకుంది.. అభిమానులతో టచ్ లో ఉంటోంది.

రేడియో థెరపీ, దాని దుష్ప్రభావాల గురించి తాను ఆందోళనకు గురైనట్టు ఆమె చెప్పింది. అయినా, ఈ ప్రయాణాన్ని జయించాలని నిర్ణయించుకున్నట్టు ప్రకటించింది. రేడియో థెరపీ వల్ల  కొన్ని దుష్ప్రభావాలు కనిపిస్తాయని, వాటితో అంత సౌకర్యంగా ఉండకపోవచ్చని డాక్టర్లు చెప్పారట.. కీమో లేదా రేడియోథెరపీ అన్నది పేషెంట్ ఎంపికే అని చాలా మంది అన్నారు. సాంకేతికంగా అనుమతి పత్రంపై సంతకం చేయడమే మనం చేయాల్సింది. మొత్తానికి చికిత్స ఏంటన్నది మీ డాక్టర్ నిర్ణయించాల్సిందే. డాక్టర్ దృష్టి ప్రాణాలు కాపాడడంపైనే కానీ, దుష్ప్రభావాల గురించి కాదు అంటూ ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ పెట్టింది. 20 సైకిల్స్ పాటు రేడియేషన్ ను.. వారంలో ఐదు రోజుల చొప్పున, వచ్చే నాలుగు వారాల పాటు ఇస్తారు. దుష్ప్రభావాల గురించి కాకుండా జీవితాన్ని ఎంజాయ్ చేయాలని అనుకుంటున్నట్టు ఛావి మిట్టల్ తెలిపింది.

అప్పట్లో మమతా మోహన్ దాస్

మిట్టల్ కన్నా ముందే మన తెలుగు హీరోయిన్లో కేన్సర్ వ్యాధి బారిన పడి బయటపడిన వాళ్లు ఉన్నారు. 2013లో క్యాన్సర్ వ్యాధికి గురైన సింగర్, యాక్టర్ మమతామోహన్ దాస్ కీమో థెరపీ చేయించుకున్నారు. దీంతో జుట్టు అంతా రాలిపోయి నటనకు దూరమైంది.. చికిత్స అనంతరం కోలుకుని మళ్లీ నటనకు సిద్ధమైన తరుణంలో మరోసారి ఆమె కేన్సర్ బారిన పడ్డారు. దీంతో మరోసారి చికిత్స నటనకు దూరమై తర్వాత కోలుకుంది. నాగార్జున మన్మధుడు సినిమాలోని భామ సోనాలి బింద్రే కూడా కేన్సర్ బారిన పడి తిరిగి కోలుకుని.. ఇప్పుడు సినిమాల్లో నటించేందుకు సిద్దమవుతోంది. ఇలా చాలా మంది ఈ మహమ్మారి బారినపడ్డా విజయవంతంగా కోలుకొని తమ కెరీర్ కొనసాగిస్తూ బాధితుల్లో స్ఫూర్తి నింపుతున్నారు.

ఆటోబయోగ్రఫి రాసుకున్న మనీషా

దశాబ్దం కింద ఇదే మహమ్మారితో పోరాడిన బాలీవుడ్ హీరోయిన్ మనీశా కోయిరాలా ఆటో బయోగ్రఫీలో తాను ఎదుర్కొన్న సమస్యలు రాసుకుంది. క్లిష్ట సమయంలో తన బంధువులు, స్నేహితులు అండగా నిలిచారని చెప్పుకొచ్చింది. ఇలాంటి ఇన్స్ స్పైర్ స్టోరీలన్నీ కేన్సర్ వ్యాధి బారిన పడి ట్రీట్ మెంట్ తీసుకున్న వారికి ఉపయోగపడతాయి.