ఈసారి మమ్ముట్టి రోల్ రిపీట్?
మెగా రీమేక్ కు చరణ్ ప్రయత్నాలు?
ఖైదీ నంబర్ 150 తో చిరు కమ్ బ్యాక్ ఇచ్చింది మొదలు, మెగాస్టార్ నటించే సినిమాల సెలక్షన్ మొత్తం రామ్ చరణ్ చూసుకుంటున్నాడు. పూరితో ఆటో జాని పట్టాలెక్కాల్సి వచ్చినప్పుడు, ఈ ప్రాజెక్ట్ మధ్యలోనే ఆగిపోయినప్పుడు,
కత్తి రీమేక్ స్టార్ట్ చేయాల్సినప్పుడు చరణ్ ముందు ఉండి చిరును నడిపించాడు. ఖైదీ నంబర్ 150 ఎన్నో రికార్డులు తిరగరాసింది. ఆ తర్వాత సైరా తెరకెక్కాల్సి వచ్చినప్పుడు సురేందర్ రెడ్డి పేరును చరణే సూచించాడు. చిరు డ్రీమ్ ను తాను ఫుల్ ఫిల్ చేసాడు. ఆచార్య ప్రాజెక్ట్ ఐడియా కూడా చరణ్ తీసుకున్న నిర్ణయమే… అయితే చరణ్ కూడా నటించాలి అనేది చిరు కొరిక. ఆ కోరికను తీర్చే క్రమంలో కొన్ని తప్పులు చేసాడు కొరటాల శివ. ప్రస్తుతం చిరు నటించిన, థియేటర్స్ ను షేక్ చేస్తున్న గాడ్ ఫాదర్ ప్రాజెక్ట్ ముందుకు వెళ్లడానికి చరణ్ మెయిన్ రీజన్. మాలీవుడ్ బ్లాక్ బస్టర్ లూసిఫర్ స్టోరీలో చిరు కనిపిస్తే చూడాలని చరణ్ కోరుకున్నాడు. తాను అనుకున్న విధంగానే ధృవ తమిళ దర్శకుడు మోహన్ రాజా కు ప్రాజెక్ట్ అప్పగించాడు. ప్రస్తుతం చిరుకు మరో రీమేక్ ఆఫర్ చేస్తున్నాడు. మాలీవుడ్ లో మమ్ముట్టి నటించిన భీష్మపర్వం తెలుగు రీమేక్ రైట్స్ ను చరణ్ కొనుగోలు చేసినట్లు బాగా ప్రచారం సాగుతోంది. ఇది కూడా గాడ్ ఫాదర్ లాంటి స్టోరీనే కాకపోతే ఒకే కుటుంబంలో జరిగే గొడవలుగా చాలా పాత్రల మధ్య ఆ ఇంటి పెద్దాయన ఎలాంటి నిర్ణయం తీసుకున్నాడు అనేది సినిమాలో చూపించారు. మైఖెల్ పాత్రను మమ్ముట్టి పోషించిన తీరుకు ఈ సినిమా 100 కోట్లు కురిసేలా చేసింది. ఇఫ్పుడు ఇదే రోల్ ను చిరు చేస్తే చూడాలనుకుంటున్నాడు చరణ్. మలయాళ బ్లాక్ బస్టర్ లూసిఫర్ తెలుగు రీమేక్ గాడ్ ఫాదర్ 100 కోట్ల వైపు పరుగులు తీస్తుండటంతో చరణ్ ఈ సినిమా రీమేక్ ప్రపోజల్ ను చిరు ముందు ఉంచాడట