దాసోజు శ్రవణ్.. ఇదెక్కడి రాజకీయం

By KTV Telugu On 22 October, 2022
image

గులాబి దళపతి కెసిఆర్ ఆపరేషన్ ఆకర్ష్ సక్సెస్ అనుకోవాలా ? స్వామి గౌడ్. దాసోజు శ్రవణ్ చేరిక చెపుతున్నది ఏమిటి ? శ్రవణ్ ఎందుకు తెరాస లో చేరారు. అన్ని పార్టీలు మారినా శ్రవణ్ ని తెరాసలోకి ఎందుకు రానిచ్చారు?

బీజేపీ కి గట్టి ఎదురుదెబ్బ తగిలింది . తెరాస బలోపేతం అవుతున్న ఫీలింగ్ వస్తుంది . ఇద్దరు సీనియర్ నేతలు పార్టీ ఫిరాయిచ్చారు .  శ్రవణ్, స్వామి గౌడ్ రాకతో  మునుగోడు ఎన్నికల వేళ తెరాస కు అడ్వాంటేజ్ అవుతుంది . కెసిఆర్ స్వయంగా ఫోన్ చేసి పిలవడంతో నేతలు ఇద్దరు తెరాస లోకి జంప్ అయ్యారు తెలంగాణ బీజేపీ లో బీసీలకు ప్రాధాన్యం లేదని ఆరోపణలు చేసారు తెరాస లో శ్రవణ్ కీలక నేత  అవుతన్నారని పార్టీ వర్గాలు నమ్ముతున్నాయి శ్రవణ్ తొలుత చిరంజీవి పార్టీ లో పనిచేసారు పీఆర్పీ లో కీలక నేతగా ఉండేవారు  అక్కడ నుంచి ఆయన తెరాస లోకి వచ్చారు. కెసిఆర్ కి సన్నిహితుడు అనిపించుకున్న తర్వాత ఎక్కడో చెడింది   కాంగ్రెస్ లోకి వెళ్ళిపోయి ఖైరతాబాద్ నుంచి పోటీ చేసారు దానం  నాగేందర్ చేతిలో పరాజయం పాలయ్యారు . కొద్దీ కాలంగా బీజేపీలో ఉంటున్న శ్రవణ్ ఆ పార్టీ లో ఉండ లేక తిరిగి తెరాస లోకి వచ్చారు

బీజేపీ నుంచి బయటికి శ్రవణ్ చెప్పిన మాట ఆ పార్టీ లో బీసీ లకు ప్రాధాన్యం ఇవ్వడం లేదని…. డబ్బున్న వారికీ, పెద్దలకు మాత్రమే టిక్కెట్లు ఇస్తున్నారని అయన చెప్పారు. బీజేపీ లో నిజమైన కార్యకర్తలకు అవకాశం లేదని ఆయన అంటున్నారు కెసిఆర్ జాతీయ పార్టీ పెట్టడం తో శ్రవణ్ వచ్చారని కూడా అనుకోవచ్చు శ్రవణ్ ని పిలవడం లో కెసిఆర్ తక్షణ ప్రయోజనం తో పాటు దీర్ఘ కాల ప్రయోజనం ఆశించారు . ప్రస్తుతానికి మునుగోడు ఎలక్షన్ లో శ్రవణ్, స్వామి గౌడ్ ని వాడుకుంటారు . వారితో బీజేపీని తిట్టిస్తారు . బీజేపీ అరాచక పార్టీ అని. . రాష్ట్రానికి చేసింది ఏమి లేదని ప్రచారం చేయిస్తారు జనం మీద వారిని సమ్మోహనాస్త్రంగా వాడతారు. దాసోజు శ్రవణ్ గతంలో  కాంగ్రెస్ జాతియా అధికార ప్రతినిధిగా పని చేసారు . విద్యాధికుడు  ఐన శ్రవణ్ మంచి వక్త . అన్ని అంశాలపై కూలంకషంగా చర్చించగలరు .  ఆయనకు  అన్ని అంశాలపై అవగహన కూడా ఉంది . దానితో కెసిఆర్ పెట్టిన జాతీయ పార్టీకి శ్రవణ్ కు నేషనల్ స్పోక్ స్పర్సన్ పదవి కట్టబెట్టి ఢిల్లీ లో ఉంచాలను కుంటున్నారు. శ్రవణ్  కుడా అలాంటి పనులు ఇష్ట పడతారు  బీ ఆర్ ఎస్ కోసమే కొందరు నేతలు కావాలని కెసిఆర్ భావిస్తున్నట్టుగా తెలుస్తుంది. ఇపుడు తెరాస లో కీలకంగా ఉన్న నేతలు కాకుండా వేరు వ్యక్తులు కావాలనుకున్నారు. అందుకే శ్రవణ్ ని పిలిచారు. శ్రవణ్ నేరుగా వోట్ బ్యాంకుగా  పనికిరాక పొయినా పార్టీ విధానాలను జనంలోకి తీసుక వెళ్లందుకు ఇతర రాష్ట్రలో నేతలతో మాట్లాడేందుకు  ఉపయోగ పడతారు .. నిజానికి శ్రవణ్ నిలకడలేని నాయకుడు  పార్టీస్  మారతారు ఎప్పటికీ నాలుగు పార్టీస్  మారేసారు ప్రస్తుతం  తెరాస లోకి వచ్చారు పాలిటిక్స్ లో ఇదే ఆఖరి ఛాన్స్ కావచ్చు కెసిఆర్ ఇచ్చిన అవకాశాన్ని వాడుకొని  నిరూపించుకోవాల్సన అనివార్యత ఆయనపై ఉంది. ఎలా పనిచేస్తారో చూడాలి.