మురుగదాస్ సైలెన్స్ వెనుక ఉన్న రీజన్ అదేనా?
స్ట్రాంగ్ కమ్ బ్యాక్ కోసం స్టార్ డైరెక్టర్ బిగ్ ప్లాన్ వేశాడా?
మురుగదాస్ అంటే ఒకప్పుడు ఇండియాలోనే ఫేమస్ డైరెక్టర్. అండర్ కవర్ గా సోషల్ మెసేజ్‌ను చెప్పుకొస్తూ, కమర్షియల్ హంగలతో సినిమాను తెరకెక్కించడం మురగదాస్ కు వెన్నెతో పెట్టిన విద్య. అయితే రెండేళ్లుగా ఈ స్టార్ డైరెక్టర్ అండర్ గ్రౌండ్ లోకి వెళ్లిపోయాడు. రజనీకాంత్ తో దర్బార్ తీసి పరువు పోగొట్టుకున్నాడు. స్టార్ డైరెక్టర్ అనే పేరు కూడా పోయింది. అంతకు ముందు మహేష్ తో తీసిన స్పైడర్ కూడా డిజాస్టర్ అయింది. దాంతో మురుగదాస్ తో సినిమా అంటే స్టార్ హీరోలు భయపడిపోయే పరిస్థితి వచ్చింది. ఈ దశలో రెండేళ్లుగా స్టోరీల మీద స్టోరీలు రెడీ చేసుకుంటున్నాడు మురగదాస్. తనకు పరిచయం ఉన్న హీరోలందరి కోసం సినిమా స్టోరీ రెడీ చేసాడు. అయితే సూర్య నుంచి మాత్రం మరో రిక్వెస్ట్ వచ్చిందట.
వీలైతే గజని సీక్వెల్ ప్లాన్ చేయమన్నాడట. ఈ ఐడియా ఏదో బాగుందని మురగదాస్ కొద్ది నెలలుగా గజని 2 పై సీరియస్ గా ఫోకస్ పెట్టాడట. ఇటీవలే సూర్యను కలసి గజని 2 లైన్ చెప్పాడని , ఆ లైన్ సూర్యకు బాగా నచ్చిందట. మొత్తానికి మురుగదాస్ కష్టాలు తీరినట్లే అంటున్నాయి తమిళ పత్రికలు. గజని 2 తెరకెక్కితే మాత్రం మూవీని ప్యాన్ ఇండియా మార్కెట్ లో రిలీజ్ చేసే అవకాశాలే ఎక్కువ. సూర్య నటంచిన గజిని దక్షిణాదిలో సంచలన విజయం సాధించింది. హిందీలో ఆమిర్ ఖాన్ రీమేక్ చేస్తే బాలీవుడ్ మొదటి సారి వంద కోట్ల సినిమాగా రికార్డుల్లోకి ఎక్కింది.