నిదానించే ప్రసక్తే లేదు. ఒక రోజు విపక్షాలకు చెందిన ఒక పెద్ద మనిషి నా దగ్గరకు వచ్చి ఏదో మాట్లాడేశారు.. ఈ దేశం మిమ్మల్ని రెండు సార్లు ప్రధానమంత్రిని చేసింది.. ఇంతకన్నా ఇంకేమీ కావాలి అని రాగాలు తీశారు. రెండు సార్లు చాలు. ఇక చాలించండి అన్న ధోరణిలో ఆయన చెప్పుకుపోయారు. అందరు వేరు.. మోదీ వేరు. అని ఆయనకు తెలియదు… నాది గుజరాత్…. జనం కోసమే బతుకుతాను.. సంక్షేమ పథకాలు వంద శాతం ప్రజలకు చేరే వరకు నేను విశ్రమించను…. ఈ మధ్య ఒక సభలో మోదీ చేసిన సుదీర్ఘ ప్రసంగం ఇదీ.. ఆ మాట ఎవరన్నారు.. ఎందుకన్నారు.. అని ఆలోచించే కంటే… ఒక ప్రతిపక్షనేత తనతో చేసిన కామెంట్ ను మోదీ ఎందుకు బయటపెట్టారన్నది ఇప్పుడు చర్చనీయాంశమైంద. మోదీ నిజంగా 2024లో వైదొలిగి.. పార్టీలో వేరొకరికి ఛాన్సిస్తారా.. అన్న ప్రశ్న తలెత్తుతోంది. జాతీయ స్థాయిలో ఈ దిశగా అప్పుడే చర్చ మొదలైంది.
2019 లోక్ సభ ఎన్నికలకు కొన్ని రోజులు ముందు విద్యార్థులతో కూడిన ఒక సభలో మోదీ పాల్గొన్నారు. అప్పుడు అసోంకు చెందిన ఒక విద్యార్థి లేచి… తాను ప్రధాని కావాలనుకుంటున్నానని.. అందుకు ఏమి చేయాలని మోదీని అడిగారు. 2024లో లోక్ సభ ఎన్నికలు వస్తాయి… ఆ ఎన్నికలకు మీరు సమాయత్తం కావచ్చు అని మోదీ చెప్పారు. దానితో మోదీ రెండు టర్మ్స్ కంటే ఎక్కువ ప్రధానిగా సేవలు అందించబోవడం లేదని అప్పట్లో చెప్పుకున్నారు. ఇప్పుడు మాత్రం మోదీ మాటమార్చారు….
వచ్చేదెవరో..
మోదీ ప్రధాని పదవి నుంచి వైదొలిగితే.. ఆ స్థానాన్ని ఎవరు భర్తీ చేస్తారనే చర్చ మొదలు కాగానే.. అనివార్యంగా మూడు నాలుగు పేర్లు వినిపిస్తున్నాయి. అందులో ప్రస్తుత హోం మంత్రి అమిత్ షా పేరు ప్రధానమైనది. మోదీకి అమిత్ షా నీడలా ఉంటారు. గుజరాత్ సీఎంగా మోదీ ఉన్నప్పటి నుంచి ఆయనకు చేదోడు వాదోడుగా పనిచేస్తున్నారు మోదీ ప్రధాని పదవిని చేపట్టిన తర్వాత అమిత్ షాను ఢిల్లీ పిలిపించుకున్నారు. ఆనందీబెన్ పటేల్ గుజరాత్ సీఎం పదవి నుంచి వైదొలగాల్సి వచ్చినప్పుడు తానకు సీఎంగా అవకాశం ఇవ్వాలని అమిత్ షా కోరారు. అందుకు నిరాకరించిన మోదీ.. నువ్వు నాతోనే ఉండాలి భాయ్ అని అమిత్ షాకు గట్టిగా చెప్పేశారట. పైగా అమిత్ షా హార్డ్ వర్కర్. హోంమంత్రిగా దేశ అంతర్గత వ్యవహారాలు చక్కబెడుతూనే…. పార్టీ వ్యవహారాలపై ఎక్కువ దృష్టి పెడుతున్నారు. ఇవాళ్ల కశ్మీర్ లో ఉంటే.. రేపు కన్యాకుమారి చేరుకోగల ఎనర్జీ ఆయనది. పైగా ప్రతీ రాష్ట్రం, ప్రతీ ప్రాంతం ఆయనకు చిరపరిచితమైన ప్రదేశాలుగా అనిపిస్తాయి. మోదీ గాడ్ ఫాదర్ గా ఉంటూ అమిత్ షాను నడిపించగలరు..
యోగీ ఆదిత్యనాథ్
అమిత్ షాను కాదనుకంటే ఠక్కున గుర్తుకొచ్చే పేరు యోగీ ఆదిత్యనాథ్.. ఇప్పటికే ఆయన రెండో సారి యూపీ సీఎంగా ప్రమాణ స్వీకారం చేశారు. పాలనలో యమ వేగంగా దూసుకుపోతున్నారు. రాజ్ నాథ్, నితిన్ గడ్కర్ లాంటి సీనియర్లు మోదీ నీడన డల్ అయిపోయిన నేపథ్యంలో యోగీ ప్రభ ఇప్పుడు వెలిగి పోతోంది. దేశంలో అతి పెద్ద రాష్ట్ర ముఖ్యమంత్రిగా…. ఇప్పుడు బీజేపీలో మోదీ, అమిత్ షా తర్వాత ఆయన నెంబర్ త్రీగా కొనసాగుతున్నారనే చెప్పాలి. యోగికి పరిపాలనా అనుభవం వచ్చేసింది. ఎదురుదెబ్బలు తిని నిలబడటం ఎలాగో తెలిసిపోయింది… పార్టీని, ప్రభుత్వాన్ని అనుసంధానం చేసుకోవడమెలాగో నేర్చుకున్నారు. మోదీ ఎదురుచూసిన ట్రైనింగ్ మొత్తం ఆదిత్యనాథ్ కు వచ్చేసిందనే చెప్పాలి.. అందుకే పార్టీకి అవసరమైతే ఆయనలో ఒక పీఎం కేండెట్ ఉన్నారు..
హిమంత బిశ్వా
ఈశాన్య రాష్ట్రాలను దేశం పూర్తిగా విస్మరించిందని… ఒక్కసారి అక్కడి నేతకు ప్రధాని పదవి ఇస్తే బావుంటుందని బీజీపి, సంఘ్ పరివార్ అనుకుంటే మాత్రం గుర్తుకొచ్చే ఏకైక పేరు అసోం ముఖ్యమంత్రి హిమంత బిశ్వా శర్మ. కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చినప్పటికీ అసోంలో తొలుత బీజేపీ మంత్రిగా పనిచేసి… అధిష్టానం మెప్పు పొందారు. అసెంబ్లీ ఎన్నికలకు ముందే అనధికారికంగా సీఎం అభ్యర్థిగా చెలామణి అయి.. పార్టీని గెలిపించే బాధ్యతను భుజం మీద వేసుకుని ఆ పని చేసి చూపించారు. సీఎం అయిన తర్వాత ఈశాన్యంలోని ఇతర రాష్ట్రాలతో నెలకొన్న వివాదాలను ఒకటొకటిగా పరిష్కరించుకుంటూ వస్తున్నారు. నార్త్ ఈస్ట్ స్టేట్స్ లో హిమంత ఇప్పుడు మోస్ట్ పాపులర్ లీడర్. అందుకే ఆయనకు కూడా ప్రధానమంత్రి అయ్యే అవకాశాలున్నాయి.
ఏదేమైనా ఎవరు ఏ పదవిని ఎప్పుడు చేపడతారో చెప్పలేం. మోదీ ప్రధాని అవుతారని ఎవరూ ఊహించలేదు. మరో సారి కూడా అంతే.. అందుకే హిందీలో అంటారు.. నసీబ్ అప్నా అప్నా అని.. ఎవరి నసీబ్ ఎలా ఉందో చూద్దాం…. అప్పటి దాకా ఆగుదాం..